INSIGHT 2012 లో పాల్గొన్నవారు, 22 జూన్ 2013 న ఈశా యోగా సెంటర్‌లో అలుమ్నై సమావేశానికి వచ్చారు. సద్గురు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి, ఇన్ఫోసిస్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇంకా హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ మాజీ ఎండి ఇంకా సిఇఒ అయిన దీపక్ ఎం సత్వాలేకర్; వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ కెవి కామత్; యాడ్ ఫిలిం మేకర్ ప్రహ్లాద్ కక్కర్; చోళమండలం ఇన్వెస్ట్మెంట్ & ఫైనాన్స్ ఎండి వెల్లయన్ సుబ్బయ్య; పర్ఫెక్ట్ రిలేషన్స్ సహ వ్యవస్థాపకుడు దిలీప్ చెరియన్; ఐబిఎం గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, ఇండియా & సౌత్ ఆసియా మేనేజింగ్ భాగస్వామి జెబి చెరియన్; ఇంకా IIM అహ్మదాబాద్ ప్రొఫెసర్ శైలేంద్ర మెహతా తదితర సంస్థల నేతలు హాజరయ్యారు.

INSIGHT Q&A సిరీస్‌లో భాగంగా, ఈ వారం సద్గురు, ఇంకా పర్ఫెక్ట్ రిలేషన్స్ సహ వ్యవస్థాపకుడు, దిలిప్ చెరియన్, భారతదేశంలోని వ్యవస్థాపకులూ ఇంకా వ్యాపారాలూ ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య అయిన అవినీతి గురించి చర్చిస్తున్నారు.

పాల్గొన్న అభ్యర్థి: సద్గురుకు, ఇంకా వేదిక పైన ఉన్నరిసోర్స్ లీడర్స్ కు నమస్కారం. నేను ఒక ఫార్మాసూటికల్ కంపెనీ నడుపుతున్నాను. నా ప్రశ్న మౌలిక కార్యాచరణ గురించి కాదు, అది అందుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. నాయకులుగా ఇంకా సిఈఓ లుగా మనకి వ్యాపార సమస్యలపై దృష్టి పెట్టేందుకు తగినంత సమయం ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఈ మధ్య నేను చూస్తున్నది ఏమిటంటే, మా సమయం ఇంకా శక్తిలో చాలా వరకూ మా వ్యాపారానికి అడ్డుపడేందుకు ప్రయత్నించే వారితో వ్యవహరించడంలోనే అయిపోతుంది. మాకు రాజకీయ నాయకుల దగ్గర నుంచి రకరకాల ఫోన్ కాల్స్ వస్తుంటాయి, వేరు వేరు రాజకీయ పార్టీ వాళ్ళు రానున్న ఎన్నికల కోసం డొనేషన్ లు అడుగుతూ ఫోన్ చేస్తారు. నేను రాజకీయ నాయకులని ఒక ఉదాహరణగా చెప్పానంతే. అది స్థానిక గ్రామస్థులు కావొచ్చు, కాలుష్య నియంత్రణ బోర్డు కావొచ్చు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ కావొచ్చు. కాబట్టి మేము చాలా మందితో వ్యవహరిస్తూ ఉంటాము, ఇంకా జనాలు అడ్డంకులుగా అవ్వకుండా చూసుకోవడంలోనే చాలా సమయం వృథా అవుతున్నట్లు అనిపిస్తుంది.

దిలీప్ చెరియన్: బహుశా సద్గురు ఏదైతే వివరిస్తారో, దానికి నేను ఒక నేపథ్యాన్ని అందించాలనుకుంటున్నాను, ఇన్సైట్ మొట్ట మొదటి నుంచీ కూడా పరిష్కరించాలనుకుంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి - భారతదేశంలోని వ్యవస్థాపకులకు ఎదురయ్యే సవాళ్లు. వాస్తవానికి, ఇంకొంత కాలానికి మీరు దీన్ని మరింతగా ఎదుర్కో వాల్సి రావొచ్చు. దీనికి ఏదో ఒక సూటి సమాధానం ఉంది అని కాదు, కానీ భారతదేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అన్ని పరిశ్రమలలోనూ, అన్ని రంగాలలోనూ, బాధాకరంగా అన్ని స్థాయిలలోనూ, ఇంకా ఇప్పుడు అన్ని ప్రాంతాలలోనూ, ఈ ముఖ్యమైన ఆటంకం వల్ల ఇబ్బందికి లోనవుతుంది. నిరంతర అవినీతి ఘాతుకాలు కనబడని ఒకటీ రెండు ఉజ్వలమైన ఉదాహరణలుగా చెప్పుకునే రాష్ట్రాలలో మినహా, అవినీతి అనేది దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి సద్గురు దీనిపై మరింత వివరిస్తారని నేను అనుకుంటున్నాను.

మీ గళాన్ని బలంగా వినిపించండి

సద్గురు: అది ఒక రోడ్ బ్లాక్ అయి ఉంటే బాగుండు అనుకుంటున్నాను. అప్పుడు మీరు వేగం తగ్గించి, ఆ తరవాత మళ్ళీ వేగం పుంజుకోవచ్చు. కానీ అది ఒక చీడ పీడ. అది ప్రతి చోటా ఉంది. ఇది దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ఆ విధంగా తయారవుతుంది. ఇది ఒక దృష్టి సారించవలసిన విషయం. మీలో, కనీసం మీ అభిప్రాయం వరకన్నా జరిగేలా చేయగలిగే అవకాశం ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో; వచ్చే ఎన్నికల్లో మనం దీన్ని ఒక కీలక అంశంగా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.

మీ ప్రాథమిక హక్కులను వినియోగించుకోవడం కోసం ఇటువంటి పనులు చేయాల్సి రావడం అనేది ఒక విధమైన అవమానమే. మీరు అన్నట్టుగా, నిజంగానే మీరు చేయవలసిన దానిపైన దృష్టి పెట్టలేరు, ఎందుకంటే ప్రతిరోజూ ఈ వ్యవహరాలను చూసుకోవడంలోనే ఎంతో సమయం ఇంకా శక్తి అయిపోతాయి. ఈ దేశ పౌరులమైన మనమందరం ముఖ్యంగా వ్యవస్థాపకులు, ఒక ఆలోచనని ప్రతిపాదన చేయాలని నేను భావిస్తున్నాను: ఎవరైతే మాకు స్వచ్ఛమైన పరిపాలనను ఇవ్వబోతున్నారో, మేము వారి పక్షానే ఉంటాము. ఇది చేయాల్సింది కేవలం ఓటు వేయడం ద్వారా మాత్రమే కాదు, మనం దాన్ని స్పష్టంగా, బిగ్గరగా వినబడేలా చాటాలి. అంతా మారుతుందా అంటే, లేదు. కానీ కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. కొంత మార్పు అనేది కూడా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని తెస్తుంది, ఎందుకంటే ప్రస్తుతం కొన్ని రకాల వ్యాపారాల పరిస్థితి కనీసం ఊపిరి సలపలేని విధంగా ఉంది. కొన్ని వ్యాపారాలు ఈ విషయాలలో అంతగా కూరుకుపోలేదు, కానీ కొన్ని వ్యాపారాలకు అది ఊపిరి సలపలేని పరిస్థితి. మీ శరీరంలో ఒక ఇన్ఫెక్షన్ సోకితే, బాక్టీరియా ఇంకా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశిస్తే, మీరు తుమ్మి దాన్ని బయటికి విసిరేయలేరు. మెల్లగా మీరు దాన్ని తొలగించాలి, కానీ అది పోవాలంటే అందుకు ఒక చికిత్స అవసరం. ఆ చికిత్స ఆవశ్యకత ఉంది. ఆ చికిత్స ఇవ్వగలవారు, కేవలం ఈ దేశ ప్రజలు మాత్రమే.

Editor’s Note: INSIGHT: The DNA of Success - A Leadership program with Ratan Tata, Dr. Ram Charan (Top CEO Coach), GV Prasad (Co Chairman & CEO, Dr. Reddy's Laboratories Ltd.) with Sadhguru is going to conducted from Nov 27 - 30, 2014 at the Isha Yoga Center, Coimbatore.

Visit the website www.ishainsight.org, or contact +91 83000 84888, leadership@ishainsight.org for more details.