SRC కాలేజ్, ఢిల్లీలో జరిగిన Youth AND Truth ప్రారంభ కార్యక్రమాన్ని తిలకించండి.

కార్యక్రమం ముందు జరిగిన హడావుడి

 

సెప్టెంబరు 4, ఉదయం 6గం. కల్లా, కాలేజి వాలంటీర్లు, ఈశా వాలంటీర్లు రావడంతో ఈ కార్యక్రమం ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. కాని నిజానికి ఈ సందడి ఎన్నో వారాలకు ముందే, ఈ వాలంటీర్లు దగ్గరలోని ఇతర కాలేజీ విద్యార్ధులను, అధ్యాపకులను ఆహ్వానించడంతో ఆరంభమయ్యింది.

 

కార్యక్రమానికి ముందుగా ఉన్న పరిస్థితిని పరిశీలిస్తే, విద్యార్ధులు ఉత్సుకతతో ఉన్నారు గాని, మొదటి సారిగా జరిగే ఇటువంటి కార్యక్రమాలు ఎలా పరిణమిస్తాయో నన్న సందేహం కనబడుతున్నది. కాని వాలంటీర్లు మరో స్థాయిలో ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారు ఉత్సాహంగా పాలు పంచుకునేందుకు కావలసిన ఉత్సాహం, ఆనందం ఉండే వాతావరణాన్ని కల్పించేందుకు నడుంకట్టుకున్నారు.

 

హాలులో వాతావరణం మెల్లగా వేడెక్కుతోంది, అప్పుడే వస్తున్న విద్యార్ధులు చేసే రణగొణ ధ్వనే ఉంది.  సౌండ్స్ ఆఫ్ ఈశా సంగీతం ఆరంభించగానే, శబ్దం మరింత సజావుగా తయారయ్యింది. అక్కడక్కడా విద్యార్ధీ, విద్యార్ధనులు పాడుతూ నాట్యంచేస్తుండడంతో ఒక రాక్ సంగీత కార్యక్రమ వాతావరణం నెలకొన్నది.

 

సద్గురు ప్రవేశం...

Youth AND Truth kicks off at Shri Ram College of Commerce, Delhi on September 4, 2018

 

సద్గురు ప్రవేశించడంతోనే RJ రౌనక్ చెప్పినట్లు ఆడిటోరియం వాతావరణంలో ఎంతో ఉత్సాహం నెలకొంది.

“Youth and Truth!” “Youth and Truth!” అంటూ యువత నినాదాలు చేశారు, సద్గురుకు అది ఒక అద్భుతమైన ఆహ్వానం.

అక్కడున్న హై-వోల్టేజ్ వాతావరణం చాలదా అన్నట్లు, మోహిత్ చౌహాన్ ఆలాపించిన “rockstar”, Sounds of Isha వారి ఉత్తేజకరమైన సంగీతం అందరినీ మరో ప్రపంచంలోకీ తీసుకు వెళ్ళాయి. ఇక సద్గురు సరేసరి మోహిత్ చౌహాన్ పాటలకు కదం తొక్కారు.

 

అన్వేషణ మొదలయ్యింది

ఇక ఆతర్వాత ముగ్గురు విద్యార్ధులతో Q&A session మొదలయ్యింది. ఆ తర్వాత ప్రేక్షకులకు ప్రశ్నలడిగే అవకాశం ఇచ్చారు. స్టూడెంట్స్ రగిలే ప్రశ్నలు అడుగుతూ అలాగే సద్గురుని తన జీవితం గురించిన అనేక ప్రశ్నలు అడిగారు. మీరొక కాలు ఎత్తి పెట్టుకు కూర్చుంటారెందుకు? మీరంటే అందరికీ ఎంతో గౌరవం, దానివల్ల మీకేమైనా superiority complex ఉందా? మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీ కలలుకూ, మీ తల్లితండ్రులను సంతోష పెట్టడానికి మధ్య ఏమైనా ఘర్షణకు లోనయ్యారా? 

 

ఈర్ష్య కూడా స్ఫూర్తి నిస్తుందా? ఒక లక్ష్యం అనేది మొదలా? అంతమా? ఇంకా బహిరంగంగా  ప్రేమ చూపించడం మంచిదేనా? రామానుజం లాగా కావడానికి శరీరం మనస్సులను ఎలా తయారు చేయాలి? ఇలా అనేక ప్రశ్నలు సమాధానాల కోసం ఎంతో అతృతగా ఉన్న విద్యార్థుల నుంచి ఉత్సాహంగా వచ్చాయి.

 

 

కాని సత్యాన్ని నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి సద్గురు అవకాశాలను జార విడవలేదు. అటువంటిది ఈనాటి సోషల్ మీడియాలో మునిగిపోతున్న యువతకు అంతగా అలవాటు లేదు. గాడిద తోకకు నిప్పు పెట్టినప్పుడ అది గుర్రం కన్నా వేగంగా పరుగెడుతుంది, మీరెలాగూ ఏదో ఒక రోజు చనిపోతారు కాబట్టి, సర్కస్ కోతి లాగా ప్రవర్తించవద్దు అన్నప్పుడు, అక్కడ యువ విద్యార్థులలో అర్థం అవుతున్నట్లు నిశ్శబ్ద వాతావరణం, అలముకుంది. 

తనదైన విన్నూత రీతిలో జీవితం గురించి మాట్లాడుతూ, సద్గురు వారిని ఆలోచనల్లో ముంచేశారు. ఆదియోగి విగ్రహం అంత 112 అ. ఎందుకు అని అడిగినప్పుడు, ఆయన దాని జ్యామితిలోని విశేషాన్ని వివరించారు.

ఆఖరులో “university or universe”  అంటూ అందరిలో ఒక ప్రశ్నను రేకెత్తించి, SRCC, Delhi.లో జరిగిన “Unplug with Sadhguru” మొదటి కార్యక్రమాన్ని ముగించారు. రెండు గంటలు అనుకున్న కార్యక్రమం మూడు గంటల వరకూ కొనసాగింది, అయినా విద్యార్థులు ఇంకా, ఇంకా ఆశిస్తూనే ఉన్నారు. కార్యక్రమం వారి లంచ్ అవర్ 2pm దాటడంతో,  ప్రశ్నలకు సమాధానాలు వారి మామూలు ఆకలిని మరపించింది. 

సద్గురు సమాధానాలను చూడండి 

ఉల్లాసకరమైన వీడ్కోలు

ఆ ప్రదేశాన్ని వీడుతూ ఎంతో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులతో ఫ్రిస్బీ ఆట ఆడుతూ సద్గురు, ఉత్సాహానికి, ఉల్లాసానికి వయస్సు అడ్డురాదని చూపారు.   

 

 

విద్యార్థుల composure, clarity and mood లో చాలా వ్యత్యాసం కనపడింది. సందేహిస్తూనూ, సిగ్గుపడుతూనూ ఉన్న విద్యార్థలు ఒక్కసారిగా ఎంతో ఉత్సాహం చూపారు, ఎంతో మంది ఆగి తమ అనుభవాలను పంచుకున్నారు. వారు సంకోచంలేకుడా మాతో తమ bisexuality గురించి, ఇటువంటి కార్యక్రమం ఇంతకు ముందే ఎందుకు జరగలేదని అడిగారు. ఇంతవరకూ సద్గురును చూడని వారికి మెసీజీలు పెడుతూ కనిపించారు.  

 

What Students Say About “Unplug with Sadhguru”

విద్యార్థులలో స్పష్టత, సమన్వయం తీసుకురావడానికి సద్గురు దేశంలో అనేక విద్యాసంస్థలలో ఒక నెల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image