పంచభూత క్రియ ఆన్లైన్

మహాశివరాత్రి పర్వదినాన సద్గురుతో 

26 February 2025

03:00 AM - 03:30 AM

(Time is shown in IST)

Registration Closed

ఏడాదిలోనే అత్యంత శక్తివంతమైన రాత్రి అయిన మహాశివరాత్రి సమయంలో, సద్గురు అనుగ్రహాన్ని పొందడానికి పంచభూత క్రియ ఆన్లైన్ ఒక ప్రత్యేకమైన అవకాశం.

భౌతిక శరీరంతో సహా ఈ సృష్టికి, పంచభూతాలే మూలంగా యోగ సంస్కృతిలో పరిగణిస్తారు. మానవ వ్యవస్థలోని పంచభూతాలను శుద్ధి చేయడం ద్వారా శరీరాన్ని మరియు మనసును చైతన్యవంతమైన ఆరోగ్య స్థితికి తీసుకురాగల శక్తివంతమైన ప్రక్రియలు యోగ శాస్త్రంలో ఉన్నాయి.

తీవ్రమైన సాధన(ఆధ్యాత్మిక సాధన) ద్వారా మాత్రమే పొందగలిగే ప్రయోజనాలను, పంచభూత క్రియ ద్వారా, భూత శుద్ధి అనే శక్తివంతమైన యోగ ప్రక్రియ నుండి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేందుకు, సద్గురు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఆరోగ్యానికి - అనారోగ్యానికి, శాంతికి - అశాంతికి, ఆనందానికి - దుఃఖానికి ఉన్న తేడా అంతా, మీలోని పంచభూతాలు ఎలా ప్రవర్తిస్తాయన్న దాన్ని బట్టే.

ప్రయోజనాలు

శరీరం, మనసులో స్థిరత్వాన్ని తెస్తుంది

ప్రత్యేకించి శరీరం దుర్భలంగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది

మానసిక అస్థిరత్వాన్ని సమతుల్యం చేస్తుంది

నిద్రలేమి ఇంకా తరచూ భయపడటం అనే వాటి వల్ల బాధపడుతూ ఉండే వారికి ఇది ఎంతగానో సహకరిస్తుంది

దృశ్యమాలికలు

ప్రోగ్రామ్ వివరాలు

సెషన్ అయిపోయిన తర్వాత పంచభూత క్రియ వీడియో 24 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Translation will be available in Hindi, Kannada, Tamil and Telugu.

గమనిక:
Registration Closed

ప్రోగ్రామ్ మార్గదర్శకాలు

ఈ ప్రోగ్రామ్‍లో పాల్గొనడానికి మీకు కనీసం 14 సంవత్సరాలైనా నిండి ఉండాలి. 14 నుండి 18 సంవత్సరాల వయసు గలవారు, ప్రోగ్రామ్‍కి రిజిస్టర్ చేసుకోవడానికి వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి.

ఫిబ్రవరి 23 తేదీ ఉదయం 8 గంటల నుండి ఫిబ్రవరి 26 ఉదయం 8 గంటల వరకు ఓరియంటేషన్ సెషన్ అందుబాటులో ఉంటుంది.

ఇది మీరు పంచభూత క్రియ కిట్ గురించి తెలుసుకోవడానికి ఇంకా ప్రక్రియకు సన్నద్ధం అవ్వడానికి ఉపయోగపడుతుంది.

మీకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్, మంచి ఎలక్ట్రిసిటీ సప్లై‌తో సహా బాగా పనిచేసే, ఇంటర్నెట్ బ్రౌజర్ కలిగిన ఒక డివైస్ అవసరం.

తరచుగా అడిగే ప్రశ్నలు

సంప్రదించండి

 
Close