భారతీయ శాస్త్రీయ సంగీతపు మూలాలు సనాతన వేదాల కాలం నాటివి. నేటి వ్యాసంలో, సద్గురు రెండు ప్రధాన భారతీయ సంగీత రూపాలైన హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల మధ్య శబ్దము, భావోద్వేగాల పరంగా ఉన్న తేడా గురించి మాట్లాడతారు. సంగీత సాధన కేవలం వినోదానికే  కాకుండా వికాసానికీ కూడా ఒక అవకాశంగా ఎలా  మలచుకోవచ్చో వారు ఈ వ్యాసంలో వివరిస్తారు.


శబ్దాన్ని అర్థం చేసుకోవడం, మానవ వ్యవస్థను శబ్దంతో ప్రభావితం చేయడం అనే అంశాల గురించి నా ప్రయణాలలో వ్యక్తిగతంగా నేను అభ్యసించాను.భారతీయ శాస్త్రీయ HindustaniPanditsసంగీతంలో ప్రాధమికంగా రెండు శాఖలు ఉన్నాయి. అవి దక్షిణ భారత దేశపు కర్ణాటక సంగీతం, ఉత్తర భారత దేశపు హిందుస్తానీ సంగీతం. హిందుస్తానీ సంగీతం ప్రాధమికంగా శబ్దం ఆధారంగా ఉంటుంది, కర్ణాటక సంగీతం భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. కర్ణాటక సంగీతంలోవారికి శబ్దాల గురించి అవగాహన లేదని కాదు, వారికీ ఉంది, కాని వీరి సంగీతంలో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. మునుపటి రోజులలో అలా ఉండి ఉండక పోవచ్చు, కానీ గత 400సంవత్సరాలలో, దక్షిణ భారత దేశంలో జరిగిన భక్తి ఉద్యమం కారణంగా, కర్ణాటక సంగీతంలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కర్ణాటక సంగీతం చాలా వరకు త్యాగరాజు లేదా పురందర దాసు వంటి భక్తులు రాశారు కాబట్టి, భావోద్వేగం ఈ సంగీతంలో రంగరించబడింది.

హిందుస్తానీ సంగీతం భావోద్వేగం లేకుండా కేవలం అవసరమైన విధంగా సరళంగా శబ్దాన్ని ఉపయోగిస్తుంది.

హిందుస్తానీ సంగీతం భావోద్వేగం లేకుండా కేవలం అవసరమైన విధంగా సరళంగా శబ్దాన్ని ఉపయోగిస్తుంది. హిందుస్తానీ సంగీతంలో సంగీతాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రముఖంగా చూపించే వివిధ విభాగాలు ఉన్నాయి. శబ్దంలోని లోతుని హిందుస్తానీ సంగీతంలో చూసినంత నిశితంగా ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేదు. మీరు నేర్చుకోవటానికి, కచేరీలు చేయటానికీ కాకపోయినా, హిందుస్తానీ సంగీతాన్ని మీరు నిజంగా ప్రశంసించగలగాలి అంటే, మీరు కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు శిక్షణ పొందవలసి ఉంటారు. ఇది కేవలం ఈ సంగీత విధానంలోని అందాలను అర్ధం చేసుకోవటానికి మాత్రమే. వారు శబ్దాలను ఎంత గొప్పగా ఉపయోగిస్తారంటే, మీరు కనుక నిజంగా వికసించదలచుకుంటే, అవి మీకు అద్భుతమైన ఫలితాలనిస్తాయి.

మనం యోగాలో నాద బ్రహ్మ అంటాము, దాని అర్ధం శబ్దం దైవంతో సమానమని, ఎందుకంటే, ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది, అదే శబ్దము.

శబ్దమంటే అర్ధం ఏమిటి? మనం యోగాలో నాద బ్రహ్మ అంటాము, దాని అర్ధం శబ్దం దైవంతో సమానమని. ఎందుకంటే, ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది, అదే శబ్దము. దీనిని ప్రతి మానవుడు అనుభవించగలడు. మీరు మీలో ఒక ప్రత్యేకమైన స్దితిలోకి వెళ్ళ గలిగితే, మీ మొత్తం ఉనికే ఒక శబ్దమవుతుంది.ఈ సంగీతం ఆ అనుభవం, అవగాహనల నుండి వచ్చింది. మీరు కనుక శాస్త్రీయ సంగీతంలో లోతుగా ఉన్న వారిని గమనిస్తే, వారు సహజంగా ధ్యానంలోనే ఉన్నట్లనిపిస్తారు. వారు సాధువుల లాగా అయిపోతారు. అందుకనే సంగీతాన్ని వినోదంగా చూడరు. అది ఆధ్యాత్మిక సాధనలో ఒక పరికరం. ఒక వ్యక్తికి గ్రహణశక్తి, అనుభూతులలోని ఉన్నత పార్శ్వాలను రుచి చూపించడానికీ, అలాగే అంతర్గత వికాసానికీ ఈ రాగాలను ఉపయోగించారు.

ప్రారంభంలో మీరు చేయగలిగిన సరళమైన పని ఈ మధ్య విడుదలైన శాస్త్రీయ సంగీతాన్ని వినడం. శిక్షణ లేని వారు కూడా ఈ సంగీతాన్ని ఆనందించగలగే వీలుగా ఇవి స్వల్పంగా సరళీకృతం చేయబడ్డాయి. ఉదాహరణకి, ది మ్యూజిక్ టుడే సీరీస్, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరియు రాత్రి సమయాలకు అనుగుణంగా కొన్ని రాగాల సంగ్రహం. మీరు యోగా సెంటర్‌కు వచ్చిన కొంతమంది అధ్భుతమయిన సంగీతకారుల, ప్రముఖ కళాకారుల సంగీతాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈశా యోగా సెంటర్ లో సంవత్సారానికి రెండు సార్లు కచేరీలు జరుగుతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు