పశుపతినాథ ఆలయం పశుపతి నాథుడికి నిలయం. కొన్ని సంస్కృతుల్లో ఇది అన్నిటిల్లోకి గొప్ప ఆలయం. ఈ లింగం వేదాలకన్నా పురాతనమైనది. వేదాలు సుమారు 5000 నుండి 8000 సంవత్సరాల పురాతనమైనవి. ఇది అంతకంటే ప్రాచీన కాలానికి చెందినది. ఈ గుడి ఎన్నోసార్లు మళ్ళీ కట్టవలసి వచ్చింది. కానీ ఆ లింగం మాత్రం వేదాలకంటే ముందరి కాలం లోనిదే.