యంత్రాలంటే ఏమిటి? అవి నాకు ఎలా ఉపయోగపడతాయి?
ప్రతివారూ వారి జీవితంలో విజయం, శ్రేయస్సు కావాలనుకుంటారు. వారు ఏ పనులను చేపట్టినా ఏ ఘర్షణా, సంఘర్షణా లేకుండా ఆ పనులు జరిగిపోవాలనుకుంటారు. యోగులు, మర్మజ్ఞులు మానవులకు ఈ విషయాలలో సహాయపడటానికి గానూ చాలా యంత్రాలను తయారు చేశారు. యంత్రాలంటే ఏమిటో, అవి ఎలా ఉపయోగపడతాయో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి!
ప్రతివారూ వారి జీవితంలో విజయం, శ్రేయస్సు కావాలనుకుంటారు. ప్రతివారికీ విజయం గురించి వారి సొంత అభిప్రాయాలు ఉండవచ్చు. వారి శ్రేయస్సు కోసం వేరు వేరు మార్గాలని ఎంచుకుంటుండవచ్చు. కానీ అంతర్లీనంగా ఉండే కోరిక మాత్రం ఒక్కటే. ఇది ప్రాచీన భారత సంస్కృతిలో గుర్తించబడింది. అందువలన, యోగులు, మర్మజ్ఞులు మానవులకు వారి తక్షణ మరియు అత్యుత్తమ శ్రేయస్సు కోసం చేసే ప్రయత్నంలో సహాయపడటానికి గానూ చాలా పరికరాలను సృష్టించారు. ఒక ప్రత్యేక లక్ష్యసాధన కోసం సహాయపడటానికి సృష్టించబడినటువంటి పరికరాలే ఈ యంత్రాలు.
ప్రశ్న: అసలు ఒక యంత్రం అంటే ఏమిటి?
సద్గురు: భావపరంగా అయితే యంత్రమంటే ఒక మెషీన్ అని అర్ధం. అనేక ఉపయోగకర రూపాల కలయికే ఒక యంత్రం. ఉదాహరణకి, కాలిక్యులేటర్ మన మనస్సు యొక్క ఉత్పత్తి. అది ఒక యంత్రం. మనని 1736తో 13,343ని గుణించమంటే మనం ఒక కాలిక్యులేటర్ కోసం చూస్తాము. ఆ లెక్క మనం మనసులో చేయలేమని కాదు. కానీ ఈ ఉపయోగకర రూపం లేదా యంత్రం మనం మన శరీరాన్ని ఇంకా మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. మీరు ఇప్పటికే శరీరమనే ఒక అత్యంత అధునాతనమైన యంత్రాన్ని కలిగి ఉన్నప్పటికీ, వివిధ పనులను వాటి కోసమే రూపొందించబడిన వివిధ మెషీనులతో ఇంకా మెరుగ్గా చేయవచ్చు.
ప్రతీ ఒక్కరి కోసం శక్తివంతమైన యంత్రాన్ని సృష్టించడానికే ఆలయాలను నిర్మించారు. కానీ ఈ రోజులలో బహిరంగ ప్రదేశాలను నిర్వహించడం కష్టమవుతోంది గనుక వ్యక్తిగతమైన యంత్రాలు సృష్టించబడుతున్నాయి.
ప్రశ్న: ఒక యంత్రం సమక్షంలో ఉండటం వలన పొందే ప్రయోజనాలేమిటి? ఇవి కేవలం ఆధ్యాత్మికమైనవేనా లేకా వీటి వలన భౌతికపరమైన లాభాలు కూడా ఉన్నాయా?
సద్గురు: యంత్రాలు పలు విధాలుగా మన జీవితాలని మెరుగుపరిచే పరికరాలు. అవి ప్రత్యేక లక్ష్యాల కోసం తయారు చేయబడ్డాయి. వివిధ రకాల యంత్రాలు వివిధ రకాలుగా ప్రతిధ్వనిస్తాయి. ఒక కార్యానికి కావలసిన శక్తిని బట్టి దానికి తగిన యంత్రాన్ని సృష్టించవచ్చు. త్రికోణం చాలా సాధారణమైన యంత్రం . ఊర్ధ్వముఖంగా ఉండే త్రికోణం ఒక రకమైన యంత్రం అయితే, అధోముఖంగా ఉండే త్రికోణం మరో రకమైన యంత్రం. మీరు వాటిని వివిధ రకాలుగా కలిపి చాలా రకాలైన యంత్రాలను తయారు చేయవచ్చు.
ఉదాహరణకి, భైరవి యంత్రం శ్రేయస్సుని పెంపొందించే ఒక యంత్రం. మీరు ఏమి చేసినా కూడా భైరవి యంత్రంతో దానిని మరింత బాగా చేయవచ్చు. ఒక ప్రత్యేకమైన స్ధలాన్ని, వాతావరణాన్ని సృష్టించి మీ శ్రేయస్సుని సహజంగా సంరక్షించే ఒక శక్తివంతమైన, వ్యక్తిగతమైన పరికరమే ఈ యంత్రం. ఇది వ్యాపారం, వృత్తి, కుటుంబ జీవితంలో నిమగ్నమై ఉన్న వారి కోసం, ప్రపంచంలో చాలా పనులు చేయాలనుకున్నవారి కోసం రూపొందించబడినది.
మానవుడు తన పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోవడాన్ని నిరోధించే వాటిలో ముఖ్యమైనది ఘర్షణ. ఘర్షణ అంటే మీరు ఒకరితో గొడవపడుతున్నారని కాదు. మీరు ఎంత ఎక్కువ క్రియాశీలంగా ఉండాలని ప్రయత్నిస్తే, అంతగా అది మీ చుట్టూ ఏర్పడుతుంది. మీ జీవితంలో ఘర్షణ ఎంత తక్కువగా ఉంటే, అంతగా మీరు మీ జీవితంలో ముందుకు పోగలుగుతారు. ఘర్షణ పెరిగితే, మీరు చేసే పనులనుండి దూరంగా ఉండాలనుకుంటారు లేదా మీరు పెద్ద గందరగోళంలో పడిపోతారు. ఒక నిర్దేశిత లక్ష్యం మీకు ఎంత ముఖ్యమో అన్న దానితో సంబంధం లేకుండగా, మీరు ఎదో చేయాలనుకొని అడుగు బయటికి వేసిన ప్రతి రోజూ ఘర్షణ ఎదరవుతుంటే, మీకు ఇష్టమైన ఆ లక్ష్యం పట్ల మీకు మెల్లగా విరక్తి కలుగుతుంది. 80% మానవులు వారు చేయగలిగిన పనులను చాలా ముందే ఆపేస్తారని నేను అంటాను. ఎందుకంటే వారు ఏవైనా పనులను చురుకుగా చేసేటప్పుడు వారి చుట్టూ సహజంగానే ఏర్పడే ఘర్షణను వారు తట్టుకోలేరు. అది తెలివైన పద్ధతి కాదు. ఎందుకంటే ఘర్షణ ఉన్నప్పుడు, మీరు దానిని తగ్గించడానికి బదులు ఇంజిన్ని (engine) ఆపివేస్తున్నారు.
లింగ భైరవిదేవి దయతో వారి చర్యల వల్ల కలిగే ఘర్షణను తగ్గించుకోవాలని ప్రయత్నించే వారి కోసం భైరవి యంత్రాన్ని సృష్టించాము. వారు ఏ పనులను చేపట్టినా ఘర్షణ ఏర్పడడకుండా ఇది సహాయం చేస్తుంది. దేవి దయతో అది సాధ్యమవుతుంది.
ప్రశ్న: రెండు రకాల లింగ భైరవి యంత్రాలను ఇస్తున్నారు. మీరు భైరవి యంత్రం గురించి మాట్లాడారు. రెండవదైన అవిఘ్నయంత్రానికి దీనికి తేడా ఏమిటి?
సద్గురు: రెండు యంత్రాలు ఒక్కటే. రెండింటికి కేవలం పరిమాణంలోనే తేడా. గృహ వైశాల్యం 2000-2500 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉంటే భైరవి యంత్రం సరిపోతుంది. అంతకన్నా పెద్ద గృహాలకు, అది సరిపోదని అవిఘ్న యంత్రాన్ని ఇస్తున్నాం. అవిఘ్న యంత్రం కాస్త వ్యాపార సంబంధమైనది, అది విజయం, సౌభాగ్యం కలిగించటానికి సహాయపడుతుంది. ఎవరు ఏమి చేయాలనుకున్నా కూడా చాలా అడ్డంకులు ఉంటాయి. వారి జీవితంలో వారు ఆ అడ్డంకుల్ని దాటారా లేదా అన్నదే వారి విజయానికి కొలమానం. అవిఘ్న యంత్రం వారి జీవితాలలోని అడ్డంకుల్ని తోక్కిపారేయటానికి తయారు చేయబడింది. అది అడ్డంకుల్ని తీసివేసే ఒక ప్రత్యేకమైన రూపం.
ఆధ్యాత్మికత కోసం ఉపయోగించుకోవాలనుకునే వారు దానిని అలా కూడా ఉపయోగించుకోవచ్చు. అసలు అదే ప్రాధమికాంశం. మనుష్యులు ఏమి చేయాలనుకున్న వారు చేసేదానిలో వారికి సహాయాన్ని అందించాలన్నదే అసలు ఉద్దేశం. అందువలన అవిఘ్న యంత్రం చాలా వాటి కోసం రూపొందించబడినది. దానిలో ఒక ప్రాధమిక ఆధ్యాత్మిక అంశం ఉంది. కానీ మీరు ఆధ్యాత్మికతని పట్టించుకోకుండగా కేవలం డబ్బు మాత్రమే సంపాదించుకోవాలనుకున్న కూడా ఈ యంత్రం మీ ఇంజన్ని లూబ్రికేట్ చేస్తుంది. మీరు మీ కారుని ఎక్కడికి డ్రైవ్ చేయాలనుకుంటారు అనేది మీ ఇష్టం.
అనుభవాలుభైరవి యంత్రాన్ని వారి గృహాలలో, పని చేసే చోట ఉంచుకున్న వారు వాటి వల్ల సమూలంగా మారిపోయిన వారి జీవితపు అనుభవాలను మాతో పంచుకున్నారు:
కల్పన మనియర్, హెడ్డ్ బిజినెస్ సొల్యుషన్స్ అండ్ ఐటీ, ఈడెల్వైస్ కాపిటల్ లిమిటెడ్, లింగ భైరవి యంత్రాన్ని వారి గృహంలో ఉంచుకోవడం వలన పొందిన అనుభవాన్ని ఇలా వివరించారు: “ దేవి మా ఇంటిలో అడుగుపెట్టడం ఒక అద్భుతమైన అనుభవం. మా ప్రతీ రోజు ఆమెతో మొదలయ్యి ఆమెతోనే ముగుస్తుంది. ఆమె ఉనికి మా ఇంటిని నింపుతుంది. క్లిష్టమన పరిస్ధితులలో కూడా పనులు కావలిసిన విధంగా జరిగిపోతున్నాయి. ఆమె అమూల్యమైన ప్రశాంతతని, ఆనందాన్ని తనతో పాటు తీసుకువచ్చారు. బయటి నుండి వచ్చినవారు కూడా మా ఇంట్లో ఆమె సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. మా ఇంటి మీద, మా కుటుంబం మీద దయ చూపించిన ఆ దేవికి, సద్గురుకి నేను జీవితాంతం ఋణపడి ఉండటం, పాదాభివందనం చేయడం తప్ప, ఇంకా ఏమి చేయగలను. ఆమెతో పాటు ఒకే చోట కలిసి ఉండే సౌభాగ్యాన్ని పొందినందుకు మేము నిజంగా చాలా అదృష్టవంతులం.”
విపుల్ రాయ్ రాథోడ్, ఎండోస్కోపీ సర్జన్, ముంబై లోని వారి ఎండోస్కోపీ ఏషియా క్లినిక్‌లో అవిఘ్న యంత్రాన్ని ప్రతిష్టించుకున్నారు. వారి క్లినిక్‌లో ఈ యంత్రం యొక్క ఎనలేని ప్రభావం గురించి మాట్లాడుతూ, “సద్గురు ఈ లింగ భైరవి అవిఘ్న యంత్రంతో మమ్ముల్ని ఆశీర్వదించినప్పటి నుండి మా జీవితంలో నమ్మలేని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఒక సర్జన్‌ని. రోగులు మా యూనిట్ వద్దకు వచ్చినప్పుడు చెప్పలేని ప్రశాంతతను, మనస్థిమితాన్ని పొందుతున్నారు. ప్రతిష్టించబడిన చోట జీవించడం, పనిచేయడంలోని ప్రాధాన్యత గురించి సద్గురు ఎల్లప్పుడూ ఎందుకు ప్రస్తావిస్తారో ఇప్పడు నేను అర్ధం చేసుకున్నాను.”
అతని భార్య పూర్ణిమ మాట్లాడుతూ ఈ యంత్రం వారి జీవితాలను ఎలా మార్చివేసిందో ఇలా తెలియజేశారు. “ ఈ యంత్రం వచ్చినప్పటి నుండి మేము మా జీవితంలోని అన్ని అంశాలలో చెప్పలేనంత సౌభాగ్యాన్ని పొందాము: మా శారీరక ఆరోగ్యం, మానసిక స్థిమితత్వం, ఆధ్యాత్మిక ఎదుగుదల, సంపద, అన్నీ మెరుగయ్యాయి.”
లింగ భైరవి యంత్రం సంవత్సరానికి రెండు సార్లు పౌర్ణమి లేదా అమవాస్య రాత్రి యోగి, మర్మజ్ఞుడు ఐన సద్గురు సమక్షంలో ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం డిసంబర్ 21న ఈ కార్యక్రమం జరుగుతుంది.వారి నుండి యంత్రాన్ని ప్రత్యక్షంగా అందుకునేటప్పుడు మీరు ఒక శక్తివంతమైన ప్రక్రియలోకి ఉపదేశింపబడుతారు.
లింగ భైరవి యంత్రం గురించి మరిన్ని వివరాలకు కింది మార్గాల ద్వారా సంప్రదించండి.
ఫొన్: +91 8300030555
Email: yantra@lingabhairavi.org