విడాకులు తీసుకోవడం భావోద్వేగ భద్రతను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది?
అమెరికాలో విపరీతంగా ఉన్న విడాకుల ప్రాబల్యం ఇంకా దాని వలన ప్రజలు భావోద్వేగ పరంగా ఎలా నష్టపోతున్నారన్న అన్న విషయం మీద సద్గురు సమాధానమిచ్చారు.
ప్రశ్న: ఇక్కడ అమెరికాలో మేము విడాకుల వల్ల చాలా ప్రభావితమయ్యాం. మీరు ఇంతకు ముందు ఇద్దరు విడిపోవడం వల్ల విపరీత పరిణామాలు ఉంటాయని అన్నారు. ఇంతకు ముందే సంభవించిన ఒక విడాకుల వల్ల ఏర్పడిన పరిణామాలను ఎలా సరిదిద్దుకోవాలి? ఈ విషయంపై ప్రజలు ఒకరినొకరు సంరక్షించుకునేటట్లు ఎలా అవగాహన తీసుకురావాలి?
సద్గురు: మరునాడు తన భార్య పుట్టిన రోజు అనగా, భర్త ఇంటికొచ్చి ఇలా అడిగాడు. “డార్లింగ్, నీ పుట్టిన రోజుకి ఏమి కావాలి? బీ.ఎం.డబ్ల్యూకారు, మింక్ కోట్, యాచట్ (ఒక చిన్న విహార నౌక)”. “నాకవేమీ వద్దు. నాకు విడాకులు కావాలి” అని ఆమె అంటుంది. అప్పుడు అతను అంటాడు “నేను అంత ఖరీదైన దాని గురించి ఆలోచించట్లేదు” అని. చాలా మంది విడాకులను చెడ్డదిగా చూడటంలేదు. వాళ్ళ స్వతంత్ర భావాలు వాళ్ళని ఇంకా ఇంకా లోతుగా చిక్కుకునేట్టు చేస్తున్నాయి. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంత భౌతిక స్వేచ్చ అమెరికాలోని స్త్రీలకు ఉంది. కానీ ప్రపంచంలో స్త్రీలు ఎవరైనా, అమెరికాలో ఉన్న స్త్రీలలాగ ఉద్విన్నంగా, ఆత్రుతగా ఇంకా ఆందోళనగా బహుశా ఉండరేమో.స్వేచ్చ అనే భావన
ఇది స్వేచ్చ కాదు. ఇది ఒక సజావుగా సాగలేని స్వేచ్చకి భావం. అంటే దానికి అర్థం మనం మళ్ళీ స్ర్తీలను క్రూరంగా దోపిడీ చేసే ఆ నిరంకుశత్వ రోజుల్లోకి వెనక్కి వెళ్ళిపోవాలని అర్థం కాదు. మీరు ఇంకా పరిపక్వ ఆలోచన ఉన్న స్వతంత్ర భావన కలిగిఉండాలని, ఇంకా అది ఉపయోగపడేలా ఉండాలని. ఏదైనా ఆలోచన పని చేసి ఫలితాలని సాధిస్తేనే అది ఉపయోగం. అది మనుషలను విడగొట్టి, జనాభాలో సగం మంది మానసిక వ్యాధుల మందులు ఉపయోగిస్తుంటే, అది పని చేయట్లేదు అన్నమాట. మీరు ఎంత విద్యావంతులైనా, తెలివైనవారైనా, మీలోని భావోద్వేగ స్థితి మీరు ఎవరో చెపుతుంది. మీలోని భావోద్వేగాలు ఉద్రిక్తమైనపుడు అవి మీలో చాలా శక్తిమంతమవుతాయి. మీ ఆలోచనలు అంత శక్తిమంతమైనవి కావు. సంతోషపరిచే భావోద్వేగాలు అంత శక్తిమంతం అయినవి కావు. కానీ కోపం, భయం, ఆందోళనలు మాత్రం చాలా శక్తిమంతమైనవి కానీ ఈ ఉద్వేగాలన్నీ అదుపు తప్పి ఉంటాయి.
ఒకవేళ మీరు భావోద్వేగాలు లేకుండా ఉంటే ఇప్పుడు నేను చెప్పేవి పట్టించుకోవక్కర్లేదు. కాని భావోద్వేగం అనేది మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమై, ఒకవేళ మీరు దాన్ని పట్టించుకోకపోతే మీరే బాధ పడతారు. మీరు ఎక్కడన్నా పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేదా ఒక ధనవంతుడిని వివాహం చేసుకున్నా, మీరు ఏదో విధంగా మిమ్మల్ని మీరు భౌతికంగా సంరక్షించుకోగలరు. ఒకవేళ భౌతిక జీవితం చాలా బాగానే సాగుతూ, అంటే మీరు బాగా తింటూ, మీ సంరక్షణ బాగానే జరుగుతున్నా, ఇంకా మీకు బీ.ఏం.డబ్ల్యు .కారు, మింక్ కోట్, యాచట్ (ఒక చిన్న విహార నౌక) ఉన్నాయనుకుందాం. అయినా సరే మీ భావోద్వేగాలు అణచబడుతూ ఉంటే మీరు అక్కడ ఉండలేరు. కనుక సమాజం కేవలం ఆర్థిక భద్రత కోసమే కాక భావోద్వేగ భద్రత ఉండేలా పని చేయాలి. అమెరికాలో అది ప్రస్తుతం కనపడడం లేదు, ఇది కేవలం స్త్రీలకే కాక పురుషులకి కూడా. అక్కడ భావోద్వేగ భద్రత లేనందువలన అమెరికా ఆర్థికంగా పతనమౌతుంది.
ఇప్పుడు అమెరికాలోని యునివర్సిటీలలో అందరి కంటే భారత కమ్యునిటీ బాగా ముందుంది. తరువాత యూదుల సమూహం. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి భావోద్వేగ భద్రత ఉంది. వాళ్ళకి 25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ, యునివర్సిటీ ముగించేవరకూ, వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చబడతాయి. వాళ్ళు దేని కోసం పోరాడక్కర్లేదు. తల్లితండ్రులు పిల్లల పట్ల నిబద్ధత కలిగి ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయులై ఉంటారు. వాళ్ళు ఇంక జీవితంలో ఏ ఇతర విషయం చూసుకోవక్కర్లేదు. అమెరికా పిల్లల విషయంలో అలా కాదు. వాళ్ళ యూనివర్సిటీ చదువు ముగించేసరికి వాళ్ళు ముగ్గురూ బాయ్ ఫ్రెండ్లు లేదా గర్ల్ ఫ్రెండ్లు చూసి ఉంటారు – భావోద్వేగ కలవరాలు, అసూయలు, సమస్యలు మరియు ఘర్షణలతో. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే లోపల, మితి మీరిన జీవితం చూసేసి ఉంటారు, అది వాళ్ళని అసమర్ధులుగా చేస్తోంది.
యునివర్సిటీలో ఏమి జరుగుతోందో అన్నిటినీ నిర్ణయించక్కర్లేదు, కానీ వాళ్ళు సరిగా నిర్వహించలేక పోతున్నారని సూచిస్తోంది. మీరు అమెరికాలో ఎవరైనా ఇరవై మందిని తీసుకుంటే అందులో కనీసం 8 మంది ఏ విధమైన ఫలవంతమైన పని చేయడం లేదు. దానికి ముఖ్య కారణం వాళ్ళు 12-13 సంవత్సరాల వయస్సు నుంచే భావోద్వేగ కలవరాలను ఎదుర్కోవడం, వాళ్ళు వాళ్ళ వయకు మించిన విషయాలను నడిపించాల్సి వస్తూ ఉండడం. దాని కారణంగా ఎవరికీ భావోద్వేగ భద్రత లేదు.
ఈ రోజు ఎవరో మిమ్మల్ని ప్రేమించాను అంటారు. రేపు ఉదయం వాళ్ళు వేరొకరితో వెళ్ళిపోతారు. ఆడ, మగ ఇద్దరిలో ఈ భయం వాళ్ళని ఏ పని చేయడం మీద దృష్టి కేంద్రేకరించనివ్వదు. భారతీయ వ్యాపార సముదాయంలో అబ్బాయి 21 సంవత్సరాలు, అమ్మాయి 18 సంవత్సరాలు వచ్చేసరికి వివాహం చేస్తారు. వాళ్ళు వివాహం అయి, ఒకళ్ళకి ఒకరు నిబద్ధత కలిగి ఉంటూ, యునివర్సిటీకి వెడతారు. వాళ్ళకి 23, 24 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వాళ్ళు వ్యాపారంలోకి దిగి సురక్షిత జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు జీవితానికి కట్టుబడి ఉంటారు, దానికిక రెండో మార్గం ఉండదు. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ భార్య ఇంట్లో ఉంటుందా లేదా అన్న ఆలోచనే మీకు రాదు. పూర్తిగా ఒకరికొకరు నిబద్ధత కలిగి ఉండడం వలన అటువంటిది జరుగదు. ఆ ఒక్క అంశంలో సంపూర్ణ భద్రత మిమ్మల్ని ఏదైనా చేయడానికి సామర్ధ్యాన్నిస్తుంది. ఒక మగవాడు తను బయటకు వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుందో అని భయపడితే అతను ఉత్పాదకతను కలిగి ఉండలేడు. ఒక స్త్రీ, మగవాడు బయటకి వెడితే తిరిగి వస్తాడా అని భయపడుతూ ఉంటే ఆమె ఉత్పాదకతను కలిగి ఉండలేదు.
భావోద్వేగ భద్రత ఎంతవరకు ముఖ్యం?
ఏ సమాజం అభివృద్ధి చెందాలన్నా, ఏ మానవుడి అభివృద్ధికైనా భావోద్వేగ భద్రత అత్యంత ముఖ్యమైనది. దురదృస్టవశాత్తు స్వంతంత్రం గూర్చి పరిపక్వత లేని భావన చేత మనం ఈ భావోద్వేగ భద్రత కోల్పోయాం. ఆ విధంగా మనం జనాన్ని ఏమీ చేయలేని అసమర్ధుల్ని చేస్తున్నాం. జనాబాలో కొంత శాతం మంది ముందుకు సాగి పనులు చేసేయగల సామర్థ్యంతో ఉంటారు, కానీ ఎక్కువమంది అస్థిరంగా తయారవుతారు. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు ఏదైనా తప్పుచేస్తే ఏమవుతుందో అన్న భయంతో ఉంటారు. ఉదాహరణకి మీరు ఈ వారంతంలో ఎక్కడకన్నా వెళదామనుకున్నారు కానీ ఏదో ఇంకొకటి చేయాల్సి రావడంతో వెళ్లలేకపోయారు అనుకోండి. సోమవారం మీకు విడాకులు నోటీసు రావచ్చు.
ఇది ప్రతి ఇంటికి వర్తించక పోయినా చాలా చోట్ల జరుగుతోంది. అమెరికాలో ఇది ఇప్పుడు కేవలం వ్యక్తిగత సమస్య కాదు సాంఘిక సమస్య. అటువంటి సమస్యలు ప్రతి సమాజంలోనూ కొంత మంది వ్యక్తులకు ఉంటాయి కానీ చాలా మంది అటువంటి సమస్యలే ఎదుర్కొంటున్నప్పుడు, అది ఒక పెద్ద సామాజిక సమస్య అయినప్పుడు, మనం వాళ్ళ భావోద్వేగ జీవితం ఎలా బలపరచగలమో చూడాలి. అది లేకపోతే జనం ఫలవంతమైన జీవితాలు సాగించలేరు. చాలా మంది దంపతులు మా కార్యక్రమాలకి వస్తూ ఉంటారు. భర్త గాని భార్య గాని అభద్రతా భావానికి లోనైతే, మొట్ట మొదటగా జరిగేది ఆ భర్త లేదా భార్య అవతలి వ్యక్తి ధ్యానం చెయ్యకూడదని అనుకుంటారు. “మీరు కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు?” అది హాస్యాస్పదం. మీరు పారిపోవట్లేదు, కేవలం కళ్ళు మూసుకుంటున్నారు. ఇది ప్రమాదకరం, ఒకసారి మీరు కళ్ళు మూసుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు.
నిబద్ధత కలిగిన సంస్కృతిని తిరిగి తీసుకురావడం చాలా ముఖ్యం. అమెరికాని మొదట ఎవరు నిర్మించారో వాళ్ళ జీవితాలు స్థిరంగా ఉండేవి. అది లేకుండా వాళ్ళు అంత గొప్ప దేశాన్ని నిర్మించి ఉండేవారు కాదు, ఎందువలన అంటే ఏ మగాడు లేదా స్త్రీ, వాళ్ళ భావోద్వేగాలు చంచలంగా ఉంటే, నిర్మాణాత్మకంగా ఉండలేరు. ఎంతో కొంత భావోద్వేగ సఫలీకృత భావం కలిగి ఉంటేనే మానవులు జీవితంలో గొప్పగా పని చేయగలరు. లేకపోతే చేయలేరు, ఒకవేళ వాళ్ళు వీటికి అతీతంగా అయిపోయి వాళ్ళకి ఇవేమీ పట్టక పోతే తప్ప. ఎవరన్నా జీవితంలో ఆ స్థానానికి చేరుకుంటే వాళ్ళకి ఏమీ పట్టదు.
రెండవ ఎంపిక
జనానికి ఈ రెండిట్లో ఒకటి జరిగి తీరాలి -- ధ్యానం లోకి దిగడం లేదా వాళ్ళకి భావోద్వేగ భద్రత కలిగి ఉండడం. ఇప్పుడు, అంత స్వేచ్ఛ ఉండి కూడా, ప్రజలకు మంచి జీవితం లేదు. వాళ్ళు నిరాశాజనకమైన జీవితాలు గడుపుతున్నారు. స్వాతంత్రం పేరుతో మీరు అడ్డంకు గుర్తులు అన్నీ తొలగించారు. అలాగే ప్రజలు బతుకుతున్నారు. అది ఒక భారతీయ రోడ్డు నాటకం, అమెరికన్ భావోద్వేగానికి జరుగుతున్నట్టు ఉంది. ప్రతివాళ్లు ఎక్కడికో వెళుతున్నారు, ఎవ్వరికీ ఎక్కడకు వెళుతున్నారో తెలియదు. స్వంతంత్రం గా ఉండడం మాత్రమే వారికి కావాలి. స్వతంత్రం పేరుతో మీకు దారి చూపించే వ్యవస్థలని మీరు కోల్పోతున్నారు.
ఒకవేళ భావోద్వేగ భద్రత కల్పించడం సాధ్యం కాకపోతే ఉన్న ఒకే మార్గం జనాన్ని ధ్యానం వైపు మళ్ళించడం, ఎందుకంటే అది అనేక విషయాలలో రక్షణ వహిస్తుంది. అది భావోద్వేగాలను స్థిర పరుస్తుంది, ప్రజలు ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతారు, వాళ్ళ బుర్రలు కూడా బాగా పని చేస్తాయి.