విద్యార్థి: మాలో కొందరం మా తలిదండ్రుల గొడవల్లో చిక్కుకుంటున్నాం. దురదృష్టవశాత్తు వారిలో ఎవరో ఒకరి తరుపున ఉండాల్సివస్తుంది. ఇది నిజంగా చాలా గందరగోళంగా ఉంటుంది. ఇటువంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలి?

సద్గురు: మానవ సంబంధాలు అవి ఎంత అందంగా ఆనందకరంగా ఉంటాయో వాటిని సరిగా నిర్వహించ లేకపోతే జీవితంలో అంత అసహ్యకరంగా తయారౌతాయి. మనం ఎల్లప్పుడూ ఏదో తప్పు చేస్తున్నామని కాదు. చాలా సందర్భాల్లో విషయం ఏమీ ఉండదు. కానీ ఒకదానికొకటి జతపడిపోయి, మనుషులు విడిపోవటం, చాలా చికాకైన విషయాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ ఏవో రాజ్యాలకోసం కొట్టుకోవటంలేదు. ఏవో చిన్న చిన్న విషయాలపై దెబ్బలాటలు. ఈ చిన్న చిన్న చికాకులే ఎంత అసహ్యంగా తయారవుతాయంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి జీవితం భరించలేనట్లు అయిపోతుంది. వారు ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఇష్టంతో దగ్గరౌతారు. కానీ అవన్నీ ఇలా మారిపోతాయి. మీరు జీవితం మొదట్లోనే ఇలాంటి వాటిని చూడవలసి వస్తే అందులో మీరూ చిక్కుకోకుండా, మీ జీవితాలను మాత్రం అలా గడపకూడదని నిశ్చయించుకోండి. ముళ్ళపంది సంకటం: ఇలా భార్యాభార్తల మధ్యే కాదు.

ఏ సంబంధమైనా, అవతలివారు ఏదైనా చేస్తే - అది పొరపాటున చేసినా సరే, మీరు ముళ్ళపందిలా తయారౌతారు. నేను ‘ముళ్ళపంది’ అనే పదాన్ని ఎందుకు వాడానంటే, ఒకసారి నేను ముళ్ళపందిని ముఖాముఖి ఎదుర్కోవలసి వచ్చింది. చాలా చెత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం వాటిని అధిగమించి ఎదిగినప్పుడు మనం మానవులుగా విజయం సాధించగలం. నేను ఏదో ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఒక ఇరుకైన గుహలో చిక్కుకున్నాను. నా రెండు చేతులూ ఇరుక్కోపోయానయి. ఆ గుహలో ఒక ముళ్ళపంది ఉంది. అది రెచ్చిపోయి నామీద దాడిచెయ్యటం మొదలు పెట్టింది. నా రెండు చేతులూ ఇరుక్కొని పోవటం వల్ల నేను వెనక్కి పాకి పోలేను. వాటికి కోపం వచ్చినప్పుడు అవి బోలెడంత దుమ్మురేపుతాయి. అది నామీద దుమ్ము రేపడంతో నేను కళ్ళు మూసుకోవాలనుకున్నాను.

కానీ దాని ఈకలు ఎక్కడకు వస్తున్నాయో తెలుసుకోవాలి కనుక కళ్ళు తెరిచే ఉంచాలనుకున్నాను. అదృష్ట వశాత్తు అది ఉత్తుత్తి దాడి అయింది. ముందుగా అవి తమ ముళ్ళను నిక్కించి ఉత్తుత్తి దాడి చేయడమనేది ఇళ్ళలో జరిగే కొట్లాటలకు సరైన ఉదాహరణ. ఒకటి రెండు దాడుల తరువాత ఎప్పుడో తన నియంత్రణతప్పిపోయి అది నిజం దాడిగా మారిపోతుంది. ఇతరులు మీ మీద అసత్య ఆరోపణలు చేసినప్పుడు, మీకేవో అపకారాలు చేసినప్పుడు, వాటిని పట్టించుకోకుండా మీతోవన మీరు హుందాగా సాగిపోవటం మీ వివేకాన్ని తెలియజేస్తుంది. దేశంలోనో, సమాజంలోనో, కుటుంబంలోనో జరిగే చికాకులన్నింటిలో తలదూర్చటం కన్నా ఇటువంటి వివేకాన్ని కలిగి ఉండటం మేలు. చాలా చెత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం వాటిని అధిగమించి ఎదిగినప్పుడు మనం మానవులుగా విజయం సాధించగలం. ఎవరో ఎదో చెత్త విషయం మాట్లాడుతారు, ఎందుకంటే వారిలో ఏదో చెత్త ఆలోచన రగులుతూ ఉంటుంది. మీలో పనికిరాని విషయం ఏదో తిరుగుతూ ఉన్నందునే అలా పనికిరాని మాటలు ఇతరులపై రువ్వుతారు. ఒకరు ఏదో చికాకైన మాటలను అంటున్నారంటే వారికి మీరు ఇవ్వాల్సింది మీ ప్రేమ లేదా మీ కరుణ అదీ కాదంటే వారిని దూరం పెట్టడమే. ముందు మీరు ప్రేమతో ప్రయత్నిస్తారు. అది పనిచెయ్యకపోతే కరుణతో ప్రయత్నించండి, అప్పటికి కుదరకపోతే దూరం జరగండి.

కానీ ఆ చెత్తలో కూరుకుపోకండి, ఎందుకంటే దానికి అంతూ పొంతూ లేదు. అది మిమ్మల్ని లాగేస్తుంది. ఎంతో సామర్థ్యం కలిగి ఉండి, తెలివైన వారయ్యుండి ఇలా చికాకైన సంబంధాల్లో చిక్కుకుపోయి మురికి గుంటల్లోకి జారిపోయిన వారిని ఎంతో మందిని నేను చూశాను. మీరు చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల మధ్య జరిగే విషయం మీకు పెద్ద సమస్య కావచ్చు. కానీ ప్రతీ తరంలోని వారికీ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ కొంత కాలం గడిచాక వారేమి చేశారు ఏమి చేయలేదు అనే విషయం మీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చెయ్యదని మీకు అర్థమౌతుంది. మీరు దానికి అతీతంగా ఎదుగుతారు. ఇటువంటి విషయాలకు అతీతంగా ఎదగటానికి మీ తలిదండ్రులు ఇప్పుడే అవకాశం ఇస్తూ ఉంటే దయచేసి ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. మీకు జీవితంలో ఏది ఎదురైనా దాన్ని మీ ఎదుగుదలకు ఒక మెట్టుగా మలచుకోండి.

 

తెలివైన గాడిద:

ఒకప్పుడు తెలివైన గాడిద ఒకటి ఉండేది. ఒకప్పుడు ఇలా జరిగింది. శంకరన్ పిళ్ళై దగ్గర ఒక ముసలిగాడిద ఉండేది. అది చాలా ముసలిది అయిపోయింది. అందుకని దాన్ని అమ్మి వెయ్యాలని అనుకున్నాడు. కాని అది ముసలిది అవటం వల్ల దాన్ని ఎవరూ కొనటంలేదు. ఒకరోజు ఆ గాడిద ఎండిపోయిన బావిలో పడి భయంకరంగా ఓండ్ర పెట్టటం ప్రారంభించింది. భయపడిపోయిన ఆ గాడిద బయటకు రావాలని అలా అసహ్యంగా అరుస్తూనే ఉంది. శంకరన్ పిళ్ళై స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి చూశారు. “ఇది పనికి మాలిన ముసలి గాడిద. దీన్ని రక్షించటంలో అర్థం లేదు. ఎండిపోయిన ఈ బావిని పూడ్చాలని మేము చాలాకాలంగా నీకు చెపుతున్నాం.

 

గాడిదను లోపల ఉంచేసి మనం ఈ బావిని పూడ్చేద్దాం” అన్నారు. ఇతరులు మీకు ఏమి చేశారు అన్నది ప్రశ్న కాదు. “మీరు మీ కోసం ఏమి చేసుకున్నారు?” అనేదే పెద్ద ప్రశ్న. మీకు ఏది ఉత్తమమో అది చెయ్యాలి. తెలివైన గాడిదగా ఉండండి. ఇక వారందరూ తట్టలతో మన్ను తెచ్చి బావిలో వెయ్యటం మొదలు పెట్టారు. ఒక తట్టెడు మన్ను పడినప్పుడల్లా గాడిద దాన్ని దులిపేసుకుని ఆ మట్టిపైన నిల్చోవటం మొదలు పెట్టింది. అలా వాళ్ళు మట్టి వేసినకొద్దీ గాడిద పైకి రావటం మొదలు పెట్టింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. “భలే! ఇది చాలా తెలివైన గాడిద” అని వారు అనుకున్నారు. వారు ఇంకా ఇంకా మట్టి పోశారు, గాడిద ఇంకా ఇంకా పైకి వచ్చింది. అలా పైకి వచ్చి వచ్చి బావిలోంచి బయటపడింది. ఇప్పుడు శంకరన్ పిళ్ళైకి ఆ తెలివైన గాడిద మీద నిజంగా ఎంతో ప్రేమ కలిగింది. అతను వెళ్లి దాన్ని కౌగలించుకోబోయాడు. కానీ అది వెనక్కి తిరిగి అతని ముఖం మీద తన్ని గబగబా అక్కడనుండి వెళ్ళిపోయింది. కాబట్టి మీరూ ఆ గాడిదలాగా ఉండండి. సరేనా? జీవితం మీ మీద ఏమి విసిరింది అనేది అంత ముఖ్యం కాదు, మీరు దాన్ని దులిపేసుకుని దానిమీద నిలబడండి. జీవితంలోని ప్రతి అనుభవం మనలను మెరుగు పరచాలి. మనం మధురానుభవాలకోసం ఎదురు చూడకూడదు.

మన మార్గంలో ఏది ఎదురుపడినా దాన్ని మన ఎదుగుదలకు, పరిణితికి, శ్రేయస్సుకు ప్రాతిపదికగా తీసుకోవాలి. ప్రపంచం మీపై ఏమి విసురుతుందో దాన్ని మీరు నిర్ణయించలేరు. కానీ దానితో మీరు ఏమి చేస్తారన్నది ఎల్లప్పుడూ నూటికి నూరుశాతం మీ చేతుల్లోనే ఉంది. జీవితంలో మీకు ఎదురు పడిన ప్రతిదానితో వీలైనంత పురోగతి సాధించాలి. మీకు మరీ చిన్నతనంలోనే అసహ్యకరమైన అనుభవాలు ఎదురైతే మీరు ఇతరులకన్నా మరింత వివేకవంతులు కావాలి. కానీ చాలామంది గాయపడి ఊరుకుంటారు. మీరు మీ గాయాలను ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళలేరు. మీరు మరణించినప్పుడు శరీరాన్ని వదలివేస్తారు. దాన్ని ఒక బాడ్జిలా పెట్టుకోలేరు. చాలా మంది తమ గాయాలను ఒక బాడ్జిలాగా ధరిస్తారు. “నాకేం జరిగిందో మీకు తెలుసా” అంటూ. మీకేం జరిగితేనేం? మీరు మీకు ఏమి చేసుకున్నారు? ఇది ఒకటే ప్రశ్న. ఇతరులు మీకు ఏమి చేశారు అన్నది ప్రశ్న కాదు. “మీరు మీ కోసం ఏమి చేసుకున్నారు?” అనేదే పెద్ద ప్రశ్న. మీకు ఏది ఉత్తమమో అది చెయ్యాలి. తెలివైన గాడిద..

ప్రేమాశీస్సులతో,

సద్గురు