యోగాకు సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleNov 6, 2016
రండి..! సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా యోగా అంటే ఏంటో తెలుసుకుందాం.
- యోగ ఓ సాంకేతిక పరిఙ్ఞానం. దాన్ని ఉపయోగించడం మీరు నేర్చుకుంటే, మీరెక్కడివారైనా, మీరేమి నమ్మినా, ఏమి నమ్మకపోయినా అది పనిచేస్తుంది.

- యోగాలో గొప్ప అనుభవాల ఉద్దేశ్యం ఒక్కటే - మిమ్మల్ని ఆ మార్గంలొ నిలపడానికే!

- యోగా అనేది బాగా జీవించడం గురించి మాత్రమే కాదు, అది జీవిత మూలాన్ని అన్వేషించడం గురించి.

- నాయకులు, న్యాయనిర్ణేతలు, సైనికులు, అధికారులు - వీరు దేశానికి నాలుగు అవయవాలు. వీరందరూ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ, చురుకుగా ఉండాలి. అందుకు తగిన యోగా వారికి కావాలి.

- యోగా ఎప్పుడూ శరీరాన్ని పరివర్తన చేయడానికే ప్రయత్నిస్తుంది, ఎందుకంటే శరీరం పరివర్తన చెందితే, మనసు దానంతట అదే పరిపక్వమవుతుంది.
