సద్గురు దీపావళి సందేశం 2019 - తప్పక చూడండి

సద్గురు: దీపావళి దీపాల పండగ. దీపావళి రోజున పల్లె పట్నం భేదం లేకుండా ఎక్కడ చూసినా వేలకొద్దీ దీపాలను వెలిగిస్తారు. కాని ఈ ఉత్సవం కేవలం బయట మాత్రమే దీపాలను వెలిగించటం కాదు. మన లోపల కూడా కాంతి ప్రకాశించాలి. కాంతి అంటే స్పష్టత. స్పష్టత లేనప్పుడు మీకు ఉన్న ఏ గుణమైనా కీడునే చేస్తుంది.అది మీకు భగవంతుడు ఇచ్చిన కానుక కాదు. ఎందుకంటే స్పష్టతలేని ఆత్మవిశ్వాసం అనర్థదాయకం. ఈ నాటి ప్రపంచంలో స్పష్టత లేకుండానే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అవసరమైన స్పష్టత లేకుండా మీరు ఏమి చెయ్యాలని ప్రయత్నించినా అనర్థమే జరుగుతుంది. కాంతి మీ దృష్టికి స్పష్టతను ఇస్తుంది--అంటే భౌతికంగా మాత్రమే కాదు. మీ చుట్టూ ప్రపంచాన్ని మీరు ఎంత స్పష్టంగా చూస్తారో దానిమీద మీరు మీ జీవితాన్ని అంత వివేకంతో గడుపుతారో ఆధారపడి ఉంటుంది. దీపావళి రోజున చీకటి శక్తులు అంతమొంది, కాంతి ప్రకాశించింది. ఇది కూడా మానవ జీవనపు సంకటాల్లో ఒకటి. సూర్యకాంతిని అడ్డుకుంటూ వాతావరణంలో కారు మబ్బులు కమ్ముకొంటాయి. మానవుడు కాంతిని ఎక్కడ నుండో తెచ్చుకోవలసిన పనిలేదు. తనలో తానూ కమ్మనిచ్చిన నల్లమబ్బులను తొలగిస్తే చాలు కాంతి అదే వస్తుంది. దీపాల పండుగ ఈ విషయాన్నే గుర్తుచేస్తుంది.
మనలో ఇలా కాంతి ప్రకాశించటానికి, ఈ దీపావళికి సద్గురు ఒక ప్రత్యేకమైన కానుకను అందజేస్తున్నారు. దీపావళి కాలంలో మూడు రోజుల పాటు ఆన్ లైన్లో అందరికీ ఉచితంగా ఇన్నర్ ఇంజనీరింగును అందిస్తున్నారు.
ఇన్నర్ ఇంజనీరింగ్:
ఇన్నర్ ఇంజనీరింగ్ యోగశాస్త్రం నుండి రూపొందించిన విజ్ఞానం. ఇన్నర్ ఇంజనీరింగు మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే, మీ జీవితాన్ని, మీ పనిని, మీరు జీవించే ఈ ప్రపంచాన్ని మీరు చూచి అనుభవించే విధానాన్ని సంపూర్ణంగా మార్చివేసే సమగ్రమైన కోర్సు ( పాఠ్యక్రమం). ఇది ఒక శక్తిమంతమైన ప్రక్రియ ద్వారా స్వయంగా రూ పాంత రంచెంది, మీ లోనే దాగిన మీ శక్తిని మీరే కనుగొ నటం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది ప్రాచీన యోగ శాస్త్రపు సారం. జీవితపు కోణాలను అర్థం చేసుకొనే ధ్యానాలు , ప్రాచీన విజ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపుతుంది. జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా గడపటానికి వీలుగా ఎవరిని వారు కనుగొని, రూపాంతరం చెందటానికి వీలైన ఒక అపురూపమైన అవకాశాన్ని ఇన్నర్ ఇంజనీరింగు కోర్సు ఇస్తుంది.
ప్రయోజనాలు:
• రోజంతా శక్తి మంతంగా, హెచ్చరికగా ఉండటం.
• సమాచార సామర్థ్యం పెరగటం వల్ల వ్యక్తుల మధ్య సంబంధాల్లో మెరుగుదల
• మానసికంగా స్పష్టత కలగటం, ఉద్వేగాల సమతౌల్యం, ఉత్పత్తి సామర్థ్యం పెరగటం.
• వత్తిడిని , భయాన్ని, ఆందోళనను తొలగించటం.
• ఎలర్జీలు, నిద్రలేమి, రక్తపోటు,మధుమేహం,నడుము నొప్పులతో సహా దీర్ఘకాల రోగాలనుండి ఉపశమనం.
• ఆనందాన్ని, శాంతిని , పరిపూర్ణత్వాన్ని పొందటం.