అలవికాని బాలునిగా, మహా తుంటరిగా, మురళీ మోహనునిగా, సొగసైన నృత్యకారునిగా, తిరుగులేని ప్రేమికునిగా, ప్రబల యోధునిగా, తన శత్రువులను క్రూరంగా అంతమొందించే వాడిగా, ఇంటింటా భగ్న హృదయాలను మిగిల్చిన వానిగా, రాజకీయ దురంధరునిగా, పూర్తి మర్యాదస్థునిగా, పరమోత్తమ యోగిగా - కృష్ణుడిది ఎంతో మనోరంజకమైన భగవదవతారం

KrishnaQuotes_1

 

మనం ఆ కృష్ణచైతన్యంతో స్పృశించబడాలంటే, మనకు లీల అవసరం – ఉల్లాసభరితమైన జీవన శైలి.

KrishnaQuotes_2

 

కృష్ణ – ముద్దులొలికే తుంటరి 

బాల్యంలో కృష్ణుని జీవితం ఎలా ఉండేదంటే, ఆయన మొత్తం గోకులాన్ని తనపై ప్రేమతో పరవశించి పోయేలా చేశాడు. ముగ్ధ మనోహరమైన అతని రూపం, అతని చిద్విలాసం, అతని వేణుగానం, అతని నడకలోని భంగిమ ప్రజలను మునుపెన్నడూ ఎరుగని కొత్త ప్రపంచంలోనికి తీసుకు వెళ్ళాయి.

KrishnaQuotes_3

 

కృష్ణుడు జన్మించిన మొదటిరోజు నుండే, ఆయనను అంతమొందించే ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, జీవితం అంతా ఆయన ఓ వినోదంలా గడిపాడు. ఈ విధానమే భారతదేశ సంస్కృతీ-సాంప్రదాయాల్లో కృష్ణుడిని ఒక అంతర్భాగం చేసింది.

KrishnaQuotes_4

 

కృష్ణుడు తన జీవితాన్ని ఒక వేడుకలా జీవించాడు. బాల్యంలో కూడా తన గురించి ఎన్నోఅద్భుతమైన విషయాలు చెప్పేవాడు. వాటిలో ఒకటి ఏమిటంటే – ‘ఉదయం లేవగానే, గోవుల అరుపులు, పాలు పితికే ముందు ప్రతి ఆవుని మా అమ్మ పేరు పేరునా పిలవడం ఎప్పుడు వింటానో, నేను కళ్ళు నులుముకుని నవ్వే సమయం అది అని నాకు అర్థమవుతుంది.
 

KrishnaQuotes_5

 

సంగ్రామానికి వెళ్లినప్పుడు కూడా కృష్ణుడు నెమలి పింఛం ధరించాడు. అయన ఆడంబరాలకు పోయే మనిషి కాదు, కాని తన జీవితంలోని ప్రతి అంశాన్ని వేడుకగా మార్చాలనుకునే నిబద్ధతతో ఉన్నవాడు. మానసికంగా, భావ పరంగా ఇంకా క్రియాశీలత లేదా వస్త్ర ధారణలో దేనిలోనైనా సరే – ఆయన తన చుట్టూ ఉన్న వారందరి కోసం తాను ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకునేవాడు. ఇదే ప్రేమ..

KrishnaQuotes_6

 

గోపాలుడు – మనోహరమైన పశువుల కాపరి 

ప్రజలు సాధారణంగా గొప్ప యోగులు లేదా రాజులలో మాత్రమే దివ్యత్వాన్ని గుర్తిస్తారు. కృష్ణుడు కేవలం పశువుల కాపరి మాత్రమే అయినప్పటికీ, వారు అతని అందం, వివేకం, బలం ఇంకా శౌర్యాన్ని విస్మరించలేకపోయారు.

KrishnaQuotes_7

 

మనం కృష్ణుడిని గోపాలుడు అన్నప్పుడు, ఆయనను ఎంతో ప్రేమపూర్వకంగా పిలుస్తాము, అదే గోవిందుడు అన్నప్పుడు, దైవ స్వరూపంగా నమస్కరిస్తాము.

KrishnaQuotes_8

 

నిరాడంబరంగా, హుందాగా కృష్ణుడు జీవించిన విధానం, ఆయన తన చుట్టూ ఉన్నవాటిని చూసే విధానం, ఆయన నడవడి, ఇంకా ఆయన శారీరక మానసిక సమతుల్యత, ప్రజలు తమ దృష్టిని మరల్చలేనంతగా కట్టిపడేసేవి.

KrishnaQuotes_10

 

కృష్ణుడి చుట్టూ ఉన్న నీలిరంగు ఓజస్సు ఆయనను చెప్పలేనంత ఆకర్షణీయునిగా చేసింది.

KrishnaQuotes_11

 

కృష్ణుడు ఎంతటి ఆకర్షణీయవంతుడంటే, పసివాడైన కృష్ణుణ్ణి చంపడానికి వచ్చిన పూతన అనే హంతకురాలు కూడా ఆయన ప్రేమలో పడింది.

KrishnaQuotes_13

 

తెలిసో, తెలియకో కృష్ణుడి చుట్టూ ఉండేవారంతా మధురంగా, ప్రేమగా మారిపోయారు. కృష్ణుడు వారిలోని మాధుర్యాన్ని ప్రేరేపితం చేశాడు.

KrishnaQuotes_14

 

కృష్ణుడి సాధన ఇదే - ఆయన తన చుట్టూ ఉన్న జీవంతో పూర్తి సమతాళంలో ఉండేవాడు. మీరు ఎవరితోనైనా అలా అనుసంధానమై, పూర్తి సమతాళంలో ఉంటే అప్పుడు వారి ఉనికి మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది, లేకపోతే అది అసౌకర్యంగా ఉంటుంది.

KrishnaQuotes_16

 

కృష్ణుడిని శ్యామ సుందరునిగా పిలిచేవారు. ఆయన సాయం సంధ్యలాంటివాడు. సూర్యుడు అస్తమిస్తుండగా, లేత నీలి రంగులోని ఆకాశం, నల్లటి ఛాయలు కలిగిన శ్యామ వర్ణంగా పరిణమిస్తుంది - అదే ఆయన రంగు.

KrishnaQuotes_10

 

కృష్ణుడి చిన్ననాటి చెలి రాధ. రాధ అనుభూతి ఎలా ఉంటుందంటే, ఆమె "కృష్ణుడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు, అతను ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, అతను నాతోనే ఉన్నాడు" అంటుంది.

KrishnaQuotes_17

కృష్ణుడు పెద్దవాడయ్యాక:

 

కృష్ణుడు తన వేణుగానంతో ఎటువంటి వ్యక్తినైనా కరిగించి, ముగ్ధుల్ని చేయగలడు, చివరికి జంతువులనైనా సరే. కానీ అతడు ధర్మ స్థాపనకై తన పల్లెని విడిచినప్పుడు, తన మురళిని రాధకి ఇచ్చేశాడు, ఇక ఆపై ఎన్నడూ ఆయన వేణుగానం చేయలేదు. ఆ రోజునుంచి రాధే కృష్ణుడిలా వేణుగానం చేసింది.
KrishnaQuotes_21

 

ఎప్పుడూ పట్టు పీతాంబరాలు, వజ్రపు కిరీటం, నెమలి పింఛంతో వైభవంగా ముస్తాబయ్యే కృష్ణుడు, కేవలం లేడి చర్మం ధరించి, ఒక పరిపూర్ణమైన బ్రహ్మచారిగా మారిపోయి, తన ఈ కొత్త సాధనకి నూరు శాతం అంకితమయ్యాడు. ప్రపంచం ఇంతకు ముందెన్నడూ ఇంతటి తేజోవంతుడైన బిక్షువుని చూడలేదు.

KrishnaQuotes_22

 

కృష్ణుడికి బోధన చేయడానికి గురువైన సాందీపునికి నోరు తెరవాల్సిన అవసరం కూడా రాలేదు. అంతా అంతర్గతంగానే బోధించబడింది, గ్రహించబడింది, పొందబడింది.

KrishnaQuotes_23

ధర్మగోప్త – ధర్మ పాలకుడు

కృష్ణుడు ధర్మగోప్తగా పిలవబడ్డాడు. న్యాయ, ధర్మాల చక్రవర్తి. కావలసిన శక్తి, సామర్ధ్యాలు ఉండి కూడా ఆయన ఎన్నడూ, ఏ రాజ్యాన్ని పాలించలేదు.

KrishnaQuotes_24

 

ఆయన కాలంలో, ఇంకా ఇప్పటికీ, చాలా మంది కృష్ణుడిని ఒక మోసగాడిగా, నయ వంచకునిగా చూసేవారు - ఎందుకంటే ఆయన ఆ కాలపు నైతిక నియమాలను పాటించలేదు; ఆయా సందర్భాలలో ఏది ఉచితమో, ఫలితాలని ఏది ఇస్తుందో కేవలం ఆపనే చేసేవాడు.

KrishnaQuotes_27

గోవిందా – కృష్ణుడు పరమాత్మగా

కృష్ణుడి, సర్వ జనీనత ఎలాంటిదంటే, అతనితో కూర్చున్న బద్ధ శత్రువులు సైతం తెలియకుండానే అతని వశం అయిపోతారు. తనని దూషించి, చంపేందుకు కుట్ర పన్నిన వారిని సహితం ఆయన చాలా సునాయాసంగా తిప్పేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

KrishnaQuotes_15

 

ప్రజలు కృష్ణుడిని, "ఓఁ ప్రభూ! మీరే విమోచకులని అంటారు. మాకు మరి మార్గం ఏమిటి?" అని అడిగినప్పుడు. కృష్ణుడు వాళ్ళ వైపు వింతగా చూస్తూ, 'మార్గం ఏమిటా? నేనే మార్గం' అనేవాడు.

KrishnaQuotes_32

కృష్ణుడు జనులతో ఎన్ని పరిహాసాలు చేసినా సరే, అందరూ ఆయనని ప్రేమిస్తూనే ఉండేవారు. ఎందుకంటే, ఆయన వారితో ఇంకా తన చుట్టూ ఉన్న జీవంతో సమతాళంతో ఉండేవాడు.

 

'రాధే' అనే పదానికి ప్రేమ లేదా జీవితం యొక్క మకరందాన్ని అందించేది అని అర్థం. తన ప్రేమతో ఆమె శ్రీకృష్ణుని తనలో భాగం చేసుకున్నది. ఒక నానుడి ఏమిటంటే రాధ లేకుండా కృష్ణుడు లేడు, అంతేకాని కృష్ణుడు లేకుండా రాధ లేదు అని కాదు. అందుకే రాధేకృష్ణ లేక రాధేయ అంటాము.

KrishnaQuotes_18

 

స్త్రీత్వం అనేది ఒక గుణం; అది స్త్రీలలో ఎంత సజీవంగా ఉంటుందో పురుషునిలో కూడా అంతే సజీవంగా ఉంటుంది మీరు కృష్ణుని తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే మీలోని స్త్రీత్వాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి సిద్ధం కావాలి. అది అన్యోన్యమైన, రసభరితమైన మార్గం, ఈ మార్గంలో కానిది ఏదీలేదు.

KrishnaQuotes_19

 

కృష్ణుడు ఏదైనా చేయాలి అనుకుంటే ఆ పని ఎలా చేయాలో, అలాగే చేసేవాడు. ఎవ్వరు ఏమనుకున్నా సరే. సంఘంలో ఆయనను ఒక సహజసిద్ధమైన నాయకుడిలా చేసిన సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి.

KrishnaQuotes_25

 

కృష్ణుడు పాండవులను పూర్తి నిష్కల్మషులుగానూ, లేదా కౌరవులను పూర్తిగా దుర్మార్గులుగాను భావించలేదు. ఆయన ఎవరి గురించీ మంచి-చెడు అంటూ అభిప్రాయాలు ఏర్పరచుకునే నీతిమంతుడు కాదు.

KrishnaQuotes_26

 

శ్రీ కృష్ణుడు కొందరితో కరుణతో, మరికొందరితో ఎంతో కఠినంగా ఉండేవారు. చేయవలసి వస్తే అది సంరక్షణైనా, సంహారమైనా ఏదైనా చేసేవాడు. అవసరాన్ని బట్టి జీవితంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించేవాడు, ఎందుకంటే ఆయనకు తన విధానం అంటూ ఏదీ లేదు. ఆయన కేవలం జీవ స్వరూపం.

KrishnaQuotes_28

 

మనం కృష్ణుడు అని దేనినైతే అంటున్నామో అది ఒక మనిషి కాదు, అది ఒక చైతన్యం.

KrishnaQuotes_29

 

ఒకసారి ఉద్ధవుడు కృష్ణుడితో, ‘‘మీరే పరమాత్మ అయినప్పుడు మనుషుల కష్టాలను ఒక్క చిటికెలో ఎందుకు తీర్చలేరు?’’ అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ ‘అందుకునేవారు పూర్తి విశ్వాసంతో లేనప్పుడు ఎవ్వరూ అద్భుతాలు సృష్టించలేరు’ అన్నాడు.

KrishnaQuotes_30

 

తన జీవిత కాలంలో, కృష్ణుడు స్వయంగా చాలా మందిలో విశ్వాసాన్ని నింపాడు. అయినప్పటికీ, ఆయన సామర్థ్యంతో పోలిస్తే అది తక్కువే. ఇది ఎప్పుడూ ఇలానే ఉంటుంది, ఎందుకంటే ఎంత గొప్పవారు భూమిపైకి వచ్చినప్పటికీ, గొప్పవేమీ జరగలేదు, ఎందుకంటే వారు చాలా ఉన్నతులు.

KrishnaQuotes_31