మీ గురువుకు మీరు మీ కృతజ్ఞతను ఎలా తెలియపరచాలి?
2018 జూలై నెలలో ఈశా యోగా కేంద్రంలో జరిగిన ‘లాప్ ఆఫ్ ది మాస్టర్’ కార్యక్రమంలో పాల్గొన్న ఒకరు, ‘మా గురువుకి కృతజ్ఞత ఎలా తెలియపరచాలి?’ అని ‘సద్గురు’ను అడిగారు. అందుకు సద్గురు మనం ఇప్పుడు ప్రపంచమంతా చేరుకునే, అందుకునే సమయం ఆసన్నమైంది, ఒకవేళ మీ హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయివుంటే, దానిని ఆడుకునే సమయం ‘ఇదే’ అని చెబుతున్నారు.

ప్రశ్న: నమస్కారం సద్గురూ! మీలాంటి గురువు వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను నా సాధనను, వాలంటీరంగ్ కూడా చేస్తున్నాను. కానీ అంతకన్నా మీకు కృతజ్ఞతను తెలిపే విధానం ఏమిటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. దయచేసి తెలియపరచండి.
సద్గురు:కృతజ్ఞత అనేది మీరు చూపవలసినది కాదు. దానికై ఎదురు చూస్తున్న వారికి మీరు దానిని చూపాలి. ఎందుకంటే వారు ఎవరో? వారు ఏమిటో? వారి విలువ ఏమిటో? వారికి తెలియదు. ఇతరులు చెప్పిన మంచి మాటల వలన వారి జీవితాలు మెరుగవుతాయి. నేను ఖచ్చితంగా చెప్పగలిగింది ఏమిటంటే, మీరు లేక ఇతరులు చెప్పే మంచి మాటలు నా జీవితాన్ని మేరుగుపరచవు, ఒకవేళ వారు నా గురించి ఘోరంగా మాట్లాడినా, అది నా జీవితాన్ని తగ్గించదు. అందువల్ల మీరు నా పట్ల కృతజ్ఞత అన్న ఈ విలువైన భావనను వ్యక్తపరచడం వృధా అవుతుంది.అందుకే, మీరు మీ కృతజ్ఞతలు మీ గుండెల్లోనే ఉంచుకుంటే, అది హృదయాన్ని కరిగించి, అసలైన జీవాన్ని బయటకు తెస్తుంది. అది మీలోని దంతా కరిగించేస్తుంది.మీరు కరిగిపోతే సహజంగానే అన్నిచోట్లకు చేరుతారు. మీరు చేయగలిగిన అత్యుత్తమమైనది అదే. కానీ మీరు ఇంకా ఏదో చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, చేయాలనుకుంటున్నారు కాబట్టి, నేను ఈ అవకాశాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి?
హఠాత్తుగా జరిగన కొన్ని సంఘటనలు
నేను ఈ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు, భారతీయ వాయుసేనను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. దేశంలో మూడు వేలకు పైగా విద్యాలయాలు నడుపుతున్న ఎయిర్ ఫోర్స్ అధ్యాపకులు వారు. ఆ ప్రసంగం తర్వాత నేను సభా ప్రాంగణం విడిచి కారు ఎక్కబోతున్నాను. అప్పుడు సంవత్సరాల ఆడపిల్లలు నలుగురు ‘సద్గురు’ ‘సద్గురు’ అని అరుస్తున్నారు. నేను వారి వంక చూసి ఎందుకు ‘సద్గురు’ ‘సద్గురు’ అంటున్నారు? నేను మీకు ఎలా తెలుసు? అని అడిగాను. వారంతా ‘సద్గురూ, మేము మీ ప్రసంగాలు వింటుంటాము’ అన్నారు. ‘బహుశా, మీకు బోరు కొడుతుంటుంది’ అన్నాను. అందుకు వారు ‘లేదు, లేదు, మాకెంతో ఇష్టం. నిజంగా ఎంతో గొప్పగా మాట్లాడుతారు’ అని అరుస్తున్నారు.
‘‘ఇంకా మా క్లాసులో అందరికీ మీరు తెలుసు, మేరెంతో బాగా మాట్లాడతారు సద్గురూ."ఆ తర్వాత ‘ర్యాలీ ఫర్ రివర్స్’ బోర్డు మీటింగ్ కి నేను బెంగళూరు వెళ్లాను. ఆ తర్వాత అక్కడ ఒక ఉద్యానవనంలో ఎవరితోనో కలిసి మాట్లాడుతున్నాను. అప్పుడు 10,11 ఏళ్ల బాలురు ముగ్గురు, నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ‘సద్గురూ, మేము మీతో ఒక ఫోటో దిగావచ్చా?’ అని అడిగారు. నేను వారితో ‘నేనెవరో మీకు ఎలా తెలుసు?’ అని అడిగాను. అందుకు వాళ్ళు ‘మేము మీ వీడియోలు చూస్తుంటాము’ అన్నారు. ‘ఏంటి పెద్దవాళ్ళు ఏమన్నా చూడమని మిమ్మల్ని బలవంత పెడుతున్నారా?’ అని అడిగాను. ‘లేదు, లేదు, మా స్కూల్లో అందరం చూస్తాము’ అన్నారు. నేను నిజంగా ఆ విషయం నమ్మ లేకపోయాను. వాళ్ళు ‘‘ఇంకా మా క్లాసులో అందరికీ మీరు తెలుసు, మేరెంతో బాగా మాట్లాడతారు సద్గురూ.’’ అన్నారు. పది సంవత్సరాల పిల్లు వారంతట వారు ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం. నాకు ఇదేదో గొప్ప విషయం అనిపించింది.
మునిగి పోయేటప్పుడు గడ్డిపోచ పట్టుకోవడం’ వంటి స్థితి నుంచి జీవితానుభూతి స్థితికి చేరడం
మొదటినుంచి నా లక్ష్యం అదే, ఆధ్యాత్మిక ప్రక్రియను ఆకర్షణీయంగా తయారుచేయటమే. అదేదో చచ్చిపోయే వారికోసం కాదు, చచ్చిపోయే ముందు వాళ్ళు ‘రామ, రామ, రామ’ అనుకోవడం కాదు. అటువంటిది కాదు ఆధ్యాత్మికత. బాగా బ్రతకాలన్న ఇచ్ఛ ఉన్నవారే ఆధ్యాత్మిక ప్రక్రియను అందుకోవటం. ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ఒక మామూలు జీవన ప్రక్రియ కావాలి. ప్రజలు జీవించే విధానమే ఆధ్యాత్మికం కావాలి.
చైతన్యం అనేది ఎక్కడో భద్ర పరచవలసిన వస్తువు కాదు. చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి సజీవంగా ఉండాలి. ఎప్పుడైతే 10 ఏళ్ల పిల్లలు ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రసంగాలు మొదలెడతారో, అది మంచి మార్పు.11 ఏళ్ల వయసులో నాకు అది అసలు లేనేలేదు. నిజానికి నేను అసలు వేరే విధంగా ఉన్నాను. ఎంతో శారీరక దృఢత్వం ఉన్న ఒక వ్యక్తిని నేను కలిశాను. ఆయన దిగుడు బావి లోకి దూకి, స్పైడర్ మాన్ లాగా పాకుతూ పైకి వచ్చాడు. దానితో ఆయన మీద నాకు ఆసక్తి కలిగింది.. అంతేకాని అదేదో ఆధ్యాత్మిక కారణాల వల్ల కాదు. ఆయన నన్నేదో సూపర్ హీరో చేస్తాడని ఆలోచన వల్ల. నేను చెప్పే మాటలేవో, చిన్న పిల్లలకు పనిచేస్తున్నది అని తెలుస్తోంది. అందుకు నాకు చాలా సంతోషం కలిగిస్తోంది.
మనం ఇప్పుడు ఈ రకంగా, ప్రపంచ వ్యాప్తం కాబోయే దశలో ఉన్నాము. మీరు దీనిని ఈశాకో, సద్గురుకో గొప్ప విషయంగా చూడవద్దు. అది ప్రధానం కాదు. విషయం ఏమిటంటే, చిన్నపిల్లలు ఆధ్యాత్మిక ప్రక్రియల వైపు శ్రద్ధ చూపిస్తున్నారు. అది ఎంతో గొప్ప విషయం. ఇన్నాళ్లు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే అదేదో ముసలివారికి, చచ్చిపోయేవారికి సంబంధించిన విషయం అనుకుంటున్నాము. మునిగిపోయేవాడు గడ్డిపోచ ఆధారం చేసుకుని ఈదే ప్రయత్నం చేయడం కాదు.
ఇన్నాళ్లూ వారు తమ జీవితాలను ఏ మాత్రం ఎరుక లేకుండా జీవించారు. జీవితమంతా పనికిరాని పనులు చేశారు. జీవితమంతా వారు చేసింది ఏమిటంటే, ప్రోగు చేసుకోవడం, ప్రోగు చేసుకోవడం, ప్రోగు చేసుకోవటం. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు లేక సమాచారం కావచ్చు. వారు చివరకు తమ ప్రేమని, ఆనందాన్ని కూడా ఎవరికి పంచకుండా పోగు చేసుకున్నారు. వారు అంతా నిలవ చేసుకున్నారు. చివరికి తాము చనిపోతున్నామని తెలుసుకున్నప్పుడు, ఇతరుల కూడా చనిపోతున్నప్పుడు ఉత్త చేతులతోనే పోతున్నారని ఆఖరి నిమిషంలో గ్రహించి, అప్పుడు ‘రామా రామా రామా’ అంటున్నారు.
దురదృష్టవశాత్తు గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచమంతా, మన దేశంలో కూడా, అలాగే తయారయ్యింది. అందుకే, నేను బెంగళూరులో ఆ ముగ్గురు పిల్లలను చూశాక, ఎంతో ఉత్సాహపడ్డాను. పది, పదకొండు ఏళ్ళ పిల్లలు, ఆ వయసులో వారు ఒక గురువు పట్ల శ్రద్ధ చూపడం కూడా ఎంతో గొప్ప విషయం.
కృతజ్ఞతతో నిండిన హృదయం
మనం ఇప్పుడు ప్రపంచాన్ని అందుకునే దశలో ఉన్నాము. అందుకే మనం కొన్ని సరైన పనులు చేయాలి. అలా చేయాలంటే మనకు ఎన్నో చేతులు కావాలి. కృతజ్ఞతతో నిండిన హృదయాలు ఉంటే, మనం వాటిని సరిగా ఉపయోగించుకోవాలి. ఎప్పుడైనా, ఏదైనా చెయ్యాలని, ఒక్క క్షణమైనా మీకు అనిపిస్తే, అది ఈ క్షణమే. ఇటువంటి ఉద్యమం మరొకటి తయారుచేయటం సులభం కాదు. ఇదేదో నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇది నా గురించి కాదు. ఇది ఆధ్యాత్మికత గురించి. ఇంతకుముందు ఎప్పుడూ ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఇంత సార్వజనికంగా ఆమోదం పొందలేదు. కానీ అది ఇప్పుడు మన దగ్గర ఉన్నది.
నేను పోయాక మీరు ఏదో బంగారపు స్మారక భవనం కట్టవద్దు. బహుశా అటువంటిదేమీ కట్టకుండా నేనే ఏదో ఒకటి చేస్తాను. ఎందువలనంటే నేను ఎక్కడికి వెళ్ళానో, మీకు తెలియకుండా చేస్తాను. నేను ఇంకా ఆ విషయం గురించి నిర్ణయం తీసుకోలేదు. నేను చెప్పేది ఏమిటంటే నాకు అటువంటివి ఏమీ అక్కరలేదు. నిజంగా మీరేదో నన్ను ఒక స్మారక భవనం కావాలనుకుంటున్నారా? లేదు. ఇది ప్రపంచంలో ఒక ప్రాణ శక్తి కావాలి, అది అందరి హృదయాలలో జీవించాలి.
ఒకవేళ మీ హృదయం కృతజ్ఞతతో కొట్టుమిట్టాడుతుంటే, దాన్ని అక్కడే ఉంచండి, దానితో మీ తెలివి తక్కువ తనాన్ని మరిగించండి. మీరు ఎప్పుడైనా, ఏదైనా చేద్దామనుకుంటే, దానిని వచ్చే ఆరు మాసాలు లేక ఒక సంవత్సరంలో చేయండి. ఎందుకంటే ఆ తరుణం ఇదే.