విజయవంతమైన జీవితానికి 6 సూత్రాలు!

ArticleJun 9, 2016
రండి! విజయవంతమైన జీవితాన్ని ఎలా తయారుచేసుకోవలో ఈ ఆరు సూత్రాల ద్వారా తెలుసుకుందాం!
- కోరిక ఉన్నంత మాత్రాన మీకు విజయం లభించదు. మీరు అది నెరవేరడానికి తగ్గ పనులు చేసినప్పుడే మీకు విజయం లభిస్తుంది.

- మీ దగ్గర ఓ ప్రణాళిక ఉందా లేక మీరు జోస్యాలను నమ్ముతారా అన్నదే మీ విజయం తథ్యమా, యాదృచ్ఛికమా అన్న తేడాను నిర్ణయిస్తుంది.

- మీరు విజయాన్ని ఆస్వాదించాలనుకుంటే, పరిస్థితులను సరిదిద్దే ముందు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి.

- మీరు విజయం సాధించాలనుకుంటే, విజయాన్ని కోరుకోకండి - సామర్థ్యం, సాధికారతలను కోరుకోండి; అలాగే శక్తివంచన లేకుండా కృషిచేయండి.

- మీరు మీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే, విజయం సులభంగా వస్తుంది.

- విజయం అంటే ఎక్కువ పనులు చేయడం కాదు. విజయం అంటే సరైన పనులు చేయడం.
