గురువుగారి పాదుకల మహిమను గానం చేసే మహా శక్తివంతమైన శ్లోక రచన-గురుపాదుకా స్తోత్రం. అవధులు లేని సంసార సాగరాన్ని దాటించే నావకు ప్రతీకగా గురువు గారి పాదుకలను సూచిస్తారు. ఈ స్తోత్రం సాధకుడిని, గురువు అనుగ్రహం పొందేందుకు తగిన విధంగా తయారు చేస్తుంది. ఈశా బ్రహ్మచారులు గానం చేసిన గురుపాదుకా స్తోత్రం, వైరాగ్య ఆల్బంలో భాగంగా లభ్యమవుతుంది. దీన్ని ఉచితంగా డౌన్లోడ్. చేసుకోవచ్చు. ఇది Isha Chants app. లో కూడా లభ్యమౌతోంది. సంస్కృత భాషలో రచించిన ఈ స్తోత్రాన్ని క్రింద చూడండి.

Sadhguru: గురువు అనుగ్రహం మీకు లభించనప్పుడు లేక మీరు వారి అనుగ్రహం పొందడానికి సిద్ధంగా లేనప్పుడు, మీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఇంకా ఏమేమి ఉన్నా కూడా, మీరు జీవితాన్ని అందంగా గడపలేరు. గురువు అనుగ్రహం అంటే అదేదో మీరు ఊహించుకున్నట్టుగా గాలిలో తేలే విషయం కాదు. నిజంగా భౌతికంగా ఉనికి కలిగి ఉన్నది. మీరు స్పృశించే గాలి లాగా, సూర్యుని వెలుగు లాగా భౌతికమైనది.

మీరు గురువు అనుగ్రహాన్ని అందుకోవడానికి సంపూర్ణంగా సంసిద్ధులైతే, మీకు ఇక ప్రతి పనీ సులభంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీ ఉనికి ఒక మృదువైన అస్థిత్వం.

మీరు గురువుగా భావించేది నిజానికి ఒక విధమైన శక్తి. ఒక సంభావ్యత. అది ఒక వ్యక్తి కాదు. ఆ శక్తి ఇంకా పరిమాణానికి ప్రతీకగా ఒక మనిషి నిలిచాడు. మీరు దేన్నైనా చూడాలనుకుంటే మీకు కావలసినది వెలుగు కానీ, లైట్ బల్బు కాదు. అయితే ప్రస్తుతానికి ఆ లైట్ బల్బ్ ఆ వెలుగును సృష్టిస్తుంది. కాబట్టి మీరు అనుకుంటారు "లైట్ బల్బు లేకపోతే నేను ఉండలేను", అని. ఒక స్థాయిలో అది నిజమే. కానీ గురువు యొక్క తత్త్వం, ఒక కాలానికి- ఒక ప్రదేశానికి పరిమితమైనది కాదు. కాబట్టి, లైట్ బల్బు పక్కనే కూర్చోవడం వల్ల అత్యధికంగా కాంతి లభిస్తుంది అనుకోవద్దు. మీరు వేల మైళ్ల దూరంలో ఉండొచ్చు అయినా కూడా ఆయన పక్కనే కూర్చుని ఉన్న వారి కన్నా ఎక్కువ అనుగ్రహాన్ని మీరు స్వీకరించగలరు.

అనుగ్రహం లేకుండా విజయం లభించదు. ఏదో ఒకరకంగా, అనుగ్రహాన్ని పొందే విధానాన్ని మీరు నేర్చుకోవాలి. కేవలం మీ మానసిక స్థితి మిమ్మల్ని అనుగ్రహాన్ని అందుకోగలిగేలా చేయొచ్చు. మీ శరీరాన్ని ఉంచుకునే విధానం మిమ్మల్ని గురువు అనుగ్రహానికి పాత్రులను చేయొచ్చు. మీ భావోద్వేగాలను నిలుపుకునే విధానం మిమ్మల్ని గ్రహణశీలురను చేయగలదు. ఇవికాక ఇంకా సంక్లిష్టమైన పద్ధతులు కూడా ఉండవచ్చు. అవి ఎలా పనిచేస్తాయి అన్నది అర్థం చేసుకుని మీరు గ్రహణశీలురుగా మారవచ్చు. అంతేగాని అనుగ్రహం లేకుండా విజయం మాత్రం లభించదు. మీరు గొప్ప మేధావులు కావచ్చు, కానీ సాఫల్యం పొందలేరు. మీరు చాలా గొప్ప సామర్థ్యం కలిగినవారే అయి ఉండొచ్చు కానీ, జీవితంలో వైఫల్యం పొందిన వారుగా మిగిలిపోతారు

Isha Chants – Free Mobile App
Vairagya - mp3 download

గురుపాదుకా స్తోత్రం

అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తితాభ్యాం|
వైరాగ్య సామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 1 ‖

కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యాం|
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 2 ‖

నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 3 ‖

నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 4 ‖

నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం |
నృపత్వదాభ్యాం నతలోకపంక్తే : నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 5 ‖

పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం |
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 6 ‖

శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యాం |
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 7 ‖

స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యాం |
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 8 ‖

కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధీప్రదాభ్యాం |
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం‖ 9 ‖


Editor’s Note: To read about the significance of mantras, visit Sadhguru Spot on Becoming A Mantra.

You can find the other Mystic Chants here.