FILTERS:
SORT BY:
మీరు ఎవరు అనేది మీరు చేసుకునేదే. ఒకసారి ఇది అర్థం చేసుకున్నాక, మిమ్మల్ని మీరు కనీసం మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవాలి.
పిల్లలను కులం, మతం, వర్గం అనే చట్రాల్లో ఇమడ్చాల్సిన అవసరం లేదు. వారు తమ సహజ స్వభావంతో వికసించాలి.
మీ గత అనుభవాలు, మీ భవిష్యత్తును కమ్మేసేలా అనుమతిస్తే, మీరు భవిష్యత్తు అనేదే లేకుండా చేసుకుంటున్నారని అర్థం – గతాన్నే మళ్లీ మళ్లీ పునరావృతం చేసుకుంటున్నారు.
స్వభావికంగానే మీరు ఆనందంగా ఉంటే, మీ ఉత్తమ స్థాయిలో పని చేస్తారు, ముఖ్యమైనది అదే.
మీ చుట్టూ ఉన్నవారికి మీరు చేయగలిగిన అతిగొప్ప ఉపకారం: మీరు అద్భుతమైన వ్యక్తి కావడం.
శ్రేష్ఠత అంటే మరొకరికంటే మెరుగ్గా ఉండడం కాదు. దానర్థం మీరు మీకు చేతనైనంత ఉత్తమంగా, ఎంతో కుదురుగా వ్యవహరించడం.
కేవలం ధనార్జన గురించే ఆలోచించకండి - చక్కగా జీవించాలనుకోండి. చక్కగా జీవించడంలోని అతి ముఖ్యమైన అంశం, మీరు నిజంగా విలువైనదిగా భావించేదే చేయడం.
మీలో మీరు ఆనందంగా ఉంటే, మీరు చేసే పనులు సహజంగానే ప్రేమపూర్వకంగా, మృదువుగా, ఉదారంగా మారుతాయి.
ఈ దీపావళి కేవలం మన చుట్టూ వెలిగేదీపాల సంబరం మాత్రమే కాకుండా,జ్ఞానోదయం అనే పరిపూర్ణమైన స్పష్టత వైపువేసే ఒక అడుగు కావాలి!ప్రేమాశీస్సులతో,