FILTERS:
SORT BY:
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి, ఏకాంతంగా ఉండడం, ఇతరులకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం అనేవి సమస్యలు కాదు - అవి అవకాశాలు.
జీవితం యోక్క బాహ్య పార్శ్వాలు మీకు సుఖ సౌకర్యాలు తీసుకురావచ్చు. పరిపూర్ణతను ఇవ్వగలిగేది మాత్రం ‘అంతర్గత పార్శ్వమే’.
మీరు ఎవరు అనేది మీరు చేసుకునేదే. ఒకసారి ఇది అర్థం చేసుకున్నాక, మిమ్మల్ని మీరు కనీసం మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవాలి.
పిల్లలను కులం, మతం, వర్గం అనే చట్రాల్లో ఇమడ్చాల్సిన అవసరం లేదు. వారు తమ సహజ స్వభావంతో వికసించాలి.
నిర్బంధత అంధకారం వంటిది – దానితో మీరు పోరాడలేరు. మీరు కేవలం చైతన్యమనే జ్యోతిని వెలిగించాలి.
భయం, కోపం, బాధ, నిరాశ, నిస్పృహ ఇవన్నీ మీరు అధీనం చేసుకోని మనస్సు యొక్క ఉత్పత్తులే.
స్వభావికంగానే మీరు ఆనందంగా ఉంటే, మీ ఉత్తమ స్థాయిలో పని చేస్తారు, ముఖ్యమైనది అదే.
మీ చుట్టూ ఉన్నవారికి మీరు చేయగలిగిన అతిగొప్ప ఉపకారం: మీరు అద్భుతమైన వ్యక్తి కావడం.
ఓ ఉద్దేశ్యం ద్వారా పనులు జరగవు. అది దిశానిర్దేశనం మాత్రమే చేస్తుంది. పయనం మాత్రం మీరింకా చేయాల్సిందే.
ఏ సంబంధమూ సుస్థిరంగా ఉండదు, అది ఎప్పుడూ అస్థిరమైనదే. దానిని మీరు అనునిత్యం చక్కబరచుకుంటూ ఉండాలి.
కేవలం ధనార్జన గురించే ఆలోచించకండి - చక్కగా జీవించాలనుకోండి. చక్కగా జీవించడంలోని అతి ముఖ్యమైన అంశం, మీరు నిజంగా విలువైనదిగా భావించేదే చేయడం.
మీలో మీరు ఆనందంగా ఉంటే, మీరు చేసే పనులు సహజంగానే ప్రేమపూర్వకంగా, మృదువుగా, ఉదారంగా మారుతాయి.