Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
జనం మిమ్మల్ని ప్రేమించడం కాదు, మీరు ప్రేమపూర్వకంగా ఉండడమే అసలు ముఖ్యమైనది.
మీ బంధనం కేవలం మీరు ఇష్టపడే వారితోనో, ప్రేమించే వారితోనో మాత్రమే ముడిపడి లేదు. మీరు ఇష్టపడని, ద్వేషించే వారితో మీకున్న బంధం మరింత గాఢంగా ఉంటుంది.
వయస్సు పెరిగేకొద్దీ మీ శారీరక చురుకుదనం తగ్గొచ్చు, కానీ మీ ఉత్సాహం తగ్గనక్కర్లేదు.
మీ జీవితంలో మీకు అత్యంత సన్నిహితులూ, అతి ప్రియమైనవారికే మీలోని అత్యంత అసహ్యకరమైన వైఖరిని భరించాల్సి వస్తుంది. దారిన పోయే ఏ అపరిచితుడికీ అంత దుర్భరమైన అనుభవం ఎదురుకాదు.
పూర్తి స్పష్టత ఉన్నప్పుడు ధైర్యంతో పనిలేదు. ఆ స్పష్టతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
మనమందరం పుట్టుకతోనే జ్ఙానులం. అజ్ఞానం అనేది మనం ఎంచుకున్నదే.
ఇతరులతో పోల్చుకుంటూ మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నిన్నటికన్నా కాస్తంత మెరుగ్గా ఉన్నరో లేదో చూసుకోండి చాలు.
మీరు చేసే పని మీరు ఎవరన్నది నిర్ధారించకూడదు. మీరు ఎవరు అనేదే, మీరు చేసే పనిని నిర్ధారించాలి.
ఇతరులెవరూ మీకు మానసికంగా బాధ కల్గించలేరు. మీకు మీరే - మీ చుట్టూ జరుగుతున్న వాటికి ప్రతిచర్యగా చేసుకుంటున్నారు.
జీవం హాయిగానే ఉంది. మనసే ఒత్తిడిలో ఉంది.
ప్రపంచంలో చాలామంది నిజంగా బిజీగా లేరు – వారు కేవలం ఇతర ఆలోచనలలో మునిగిపోయి ఉన్నారు.
దేవుడికి మీ భక్తి అక్కరలేదు. మానవ హృదయానికే ఆ అత్యున్నత మనోభావాన్ని అనుభూతిచెందవలసిన అవసరం ఉంది.