Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
వ్యక్తిత్వం అనేది సామాజిక మనుగడ కోసం మీరు సృష్టించుకున్న ఒక ముసుగు. ఉన్న ఒకే సమస్య, ఆ ముసుగు ఇప్పుడు మీకే అతుక్కుపోయింది.
జీవితంలో చేయడానికి ‘అత్యుత్తమమైనది’ అంటూ ఏదీ ఉండదు. మీరు చేస్తున్న పనిలో మీ సర్వస్వాన్నీ పెడితే, అదే గొప్పది.
ఒక ఉపాధ్యాయుని ప్రాముఖ్యత కేవలం సమాచారాన్ని అందించడంలో లేదు, ప్రతి విద్యార్థిలో స్ఫూర్తిని నింపి, వారిని ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దడంలో ఉంది.
ఒకసారి మీకూ మీ శరీరానికీ, అలాగే మీకూ మీ మనసుకీ మధ్య కొంచెం దూరం ఏర్పడితే, అది భౌతికాతీతమైన దాన్ని అనుభూతి చెందే అవకాశాన్ని కలిగిస్తుంది.
విజయం అంటే ఏదైనా ఒక పనిని అది ఫలించే రీతిలో చేయడమే.
మనందరికీ ఈ ప్రపంచంలో ఏదో ఉపయోగకరమైనది చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి వంకనో చూసే బదులు, మీరు ఏమి చేయగలరో చూడండి.
మీరు మానవత్వంతో పొంగి పొర్లుతుంటే, దైవత్వం దిగిరావలసిందే.
సృష్టి, సృష్టికర్త ఒడిలోనే ఉన్నది, సృష్టికర్తే సృష్టి మౌలికభాగం.
మనిషిగా ఉండడం అంటే ప్రతి జీవరాశిని సున్నితత్వంతో చూడగల సామర్థ్యం కలిగి ఉండడం.
మీరు ఆహారం తీసుకునే విధానం, మీ శారీరక అరోగ్యాన్ని మాత్రమే కాదు, మీరు ఆలోచించే, భావించే ఇంకా జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని కూడా నిర్ణయిస్తుంది.
quotes about life - problems and possibilities