Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
అన్ని సమస్యలకు మూలం మీలోనే ఉంది. అలాగే పరిష్కారాలు కూడా మీలోనే ఉన్నాయి.
సుఖం బాగుంటుంది, కానీ అది కట్టిపడేస్తుంది. ఆనందం అద్భుతంగా ఉంటుంది, అన్నింటికీ మించి అది స్వేచ్ఛనిచ్చేదిగా ఉంటుంది.
కొన్నిసార్లు ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. కాని మీకు మీరే వ్యతిరేకులైతే, అసలు పరిష్కారం లేదు.
ఆనందంగా ఉన్నవారికి జీవితం చాలా చిన్నది. బాధలో ఉన్నవారికి అది నరకప్రాయంగా సుదీర్ఘమైనదిగా ఉంటుంది.
చాలా కొద్ది మంది మాత్రమే తమ జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారు. మిగతా వారందరూ కేవలం బ్రతుకుదెరువు కోసమే జీవిస్తున్నారు.
పిల్లలు బోధనలు ఇంకా తత్వాల వల్ల కాదు, పరిశీలన ఇంకా భాగస్వామ్యం ద్వార ఎదుగుతారు. మీ పిల్లవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, మీరు అలా అవ్వండి.
బాగా జీవించడం అంటే విలాసవంతంగా అనికాదు. బాగా జీవించడం అంటే మీరు రాయి మీద కూర్చున్నా, మీకు ఆనందంగా ఎలా కూర్చోవాలో తెలుసని.
మీరు మీ మనసును ఆడించాలి. మీ మనసు మిమ్మల్ని ఆడించ కూడదు.
జీవితం ఒక శాపమా లేక వరమా అనేది, మీ మనస్సు మీ నుంచి సూచనలు తీసుకుంటోందా లేదా అనే దానిపై అధారపడి ఉంటుంది.
భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోవడం ఒకటి – కాని ఇంకా రాని భవిష్యత్తు గురించి బాధ పడడం మరొక విషయం.
ప్రజలు ఎప్పుడూ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వ్యక్తిని కలవాలని కోరుకుంటారు. మీరే ఆ అద్భుతమైన వ్యక్తి ఎందుకు కాకూడదు.
మీరు ఎరుకతో స్పందిస్తే, మీకు కావలసింది జరుగుతుంది. మీరు నిర్బంధంగా ప్రతిచర్యగా ప్రతిస్పందిస్తే, ఇతరులకు కావలసిన విధంగా జరుగుతుంది