Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
మనిషి మనస్సు అందం ఏంటంటే అది ఊహించగలదు. అదే మనస్సు వికారం ఏంటంటే అది ఆ ఊహల్లోనే కొట్టుకుపోవచ్చు.
మీ ప్రస్తుత పరిస్థితికి మరెవరో బాధ్యులు అని మీరు భావించినంత కాలం, మీరు కోరుకుంటున్న విధంగా మీరు మారలేరు.
ప్రేమ ఓ లావాదేవి కాదు; అది మీ మనోభావంలోని ఒక విధమైన ఉల్లాసం, మాథుర్యం.
There is no need to do what others are doing. You must do what truly matters to you.
కరుణ అనేది భావోద్వేగాలలో అత్యంత స్వేచ్ఛాదాయకమైనది.
యోగాలోని మూల అంశం గ్రహింపు. మీ గ్రహింపు ఎంత లోతుగా ఉంటే మీ జీవితానుభవం అంత ప్రగాఢంగా ఉంటుంది, మీ జ్ఞానం అంత సుసంపన్నంగా ఉంటుంది.
పరమాణువు నుండి అనంత విశ్వం వరకు ఉన్న ప్రతిదీ మీ అవగాహనకు మించినదని గ్రహించినప్పుడు, మీరు సహజంగానే వినమ్రులై, ఎంతో సౌమ్యంగా నడుచుకుంటారు.
మీ బాంధవ్యాలు ఒకరి నుండి సంతోషాన్ని పిండుకునేలా కాకుండా, సంతోషాన్ని పంచుకునేలా ఉన్నప్పుడు, మీకు ఎవరితోనైనా సరే అద్భుతమైన అనుబంధం ఉంటుంది.
నిజానికీ శారీరిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అని రెంటినీ వేరు చేయలేరు. ఆరోగ్యం అనేది అన్ని స్థాయిల్లో జరిగే సమగ్రమైన ప్రక్రియ.
మహాత్మా అంటే మహోన్నతమైన వ్యక్తి అని అర్థం. ఒకరు అన్ని గుర్తింపులకూ అతీతంగా ఒక జీవంగా మసులుకున్నపుడు మాత్రమే మహోన్నతమైన వ్యక్తిగా అవుతారు.
మీరు అహంభావంతో నిండివుంటే, మీరిక గ్రహణశీలత్వంతో ఉండలేరు. మీలో అహం ఎంత తక్కువ ఉంటే, అంత ఎక్కువ స్వీకరిస్తారు. మీలో అహం ఎంత ఎక్కువ ఉంటే, అంత తక్కువ స్వీకరిస్తారు.
అంతర్ముఖులు కావడం అనేది ఒక ప్రయాణం కాదు. అక్కడ ఎలాంటి దూరమూ లేదు.