Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
మీలో భయాన్ని సృష్టించుకోవాలంటే, ఇంకా జరగని దాని గురించి మీరు ఊహించుకోవాలి. భయం నుండి విముక్తి పొందడానికి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
జనం మిమ్మల్ని ప్రేమించడం కాదు, మీరు ప్రేమపూర్వకంగా ఉండడమే అసలు ముఖ్యమైనది.
మీ బంధనం కేవలం మీరు ఇష్టపడే వారితోనో, ప్రేమించే వారితోనో మాత్రమే ముడిపడి లేదు. మీరు ఇష్టపడని, ద్వేషించే వారితో మీకున్న బంధం మరింత గాఢంగా ఉంటుంది.
వయస్సు పెరిగేకొద్దీ మీ శారీరక చురుకుదనం తగ్గొచ్చు, కానీ మీ ఉత్సాహం తగ్గనక్కర్లేదు.
గురువు మీలోని చీకటిని పారద్రోలుతాడు. ఆయన లోపలి నుంచి జ్వలిస్తాడు. మీరూ ఆ జ్వాలతో ప్రజ్వరిల్లి, మిమ్మల్ని వెనక్కి లాగే వాటన్నింటినీ దాటి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
పూర్తి స్పష్టత ఉన్నప్పుడు ధైర్యంతో పనిలేదు. ఆ స్పష్టతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
మనమందరం పుట్టుకతోనే జ్ఙానులం. అజ్ఞానం అనేది మనం ఎంచుకున్నదే.
ఇతరులతో పోల్చుకుంటూ మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నిన్నటికన్నా కాస్తంత మెరుగ్గా ఉన్నరో లేదో చూసుకోండి చాలు.
మీ చుట్టూ ఉన్నవారిని మీ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించకండి. వారు ఎలా ఉన్నారో అలాగే ఉండనివ్వండి. మీరు పూర్తిగా బాధ్యత తీసుకోవలసింది ఒక్క జీవితం పట్ల మాత్రమే – అది మీ జీవితం.
ఇతరులెవరూ మీకు మానసికంగా బాధ కల్గించలేరు. మీకు మీరే - మీ చుట్టూ జరుగుతున్న వాటికి ప్రతిచర్యగా చేసుకుంటున్నారు.
జీవం హాయిగానే ఉంది. మనసే ఒత్తిడిలో ఉంది.
ప్రపంచంలో చాలామంది నిజంగా బిజీగా లేరు – వారు కేవలం ఇతర ఆలోచనలలో మునిగిపోయి ఉన్నారు.