Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
ఆధ్యాత్మిక ప్రక్రియలోని ప్రాథమిక అంశం, మీ ఊహలన్నింటినీ పక్కన పెట్టడం.
ఆధ్యాత్మికతకు మీరు నివసించే వాతావరణంతో ఎటువంటి సంబంధమూ లేదు. అది మీరు మీ అంతరంగంలో సృష్టించుకునే వాతావరణానికి సంబంధించినది.
ఆనందంగా ఆడండి, నిజాయితీగా ఆడండి, తీక్షణంగా ఆడండి. జీవితం చాలా చిన్న ఆట - అలాగే అది అద్భుతమైనది.
విజయం అంటే ఏదైనా ఒక పనిని అది ఫలించే రీతిలో చేయడమే.
ప్రశాంతత అనేది మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామనే దాని ఫలితమే.
తార్కిక బుద్ధి సత్యాన్ని జయించాలనుకుంటుంది. భక్తి సత్యాన్ని హత్తుకుంటుంది.
మీ మనసులో జరిగే నాటకం మీరు కోరుకున్నట్టు జరగాలి. దానికి మీరే డైరెక్టర్.
జీవితంలో చేయడానికి ‘అత్యుత్తమమైనది’ అంటూ ఏదీ ఉండదు. మీరు చేస్తున్న పనిలో మీ సర్వస్వాన్నీ పెడితే, అదే గొప్పది.
మీరు ఎరుకలేకుండా చేసే ప్రతి పనినీ ఎరుకతో కూడా చేయవచ్చు, అదే మీ జీవితంలో ఎంతో మార్పును తెస్తుంది.
ఎవరైతే ఉనికి యొక్క సంపూర్ణత్వాన్ని వింటారో, వారికి ప్రతిదీ సంగీతమే.
వ్యక్తిత్వం అనేది సామాజిక మనుగడ కోసం మీరు సృష్టించుకున్న ఒక ముసుగు. ఉన్న ఒకే సమస్య, ఆ ముసుగు ఇప్పుడు మీకే అతుక్కుపోయింది.