Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
మహాత్మా అంటే మహోన్నతమైన వ్యక్తి అని అర్థం. ఒకరు అన్ని గుర్తింపులకూ అతీతంగా ఒక జీవంగా మసులుకున్నపుడు మాత్రమే మహోన్నతమైన వ్యక్తిగా అవుతారు.
మీరు అహంభావంతో నిండివుంటే, మీరిక గ్రహణశీలత్వంతో ఉండలేరు. మీలో అహం ఎంత తక్కువ ఉంటే, అంత ఎక్కువ స్వీకరిస్తారు. మీలో అహం ఎంత ఎక్కువ ఉంటే, అంత తక్కువ స్వీకరిస్తారు.
అంతర్ముఖులు కావడం అనేది ఒక ప్రయాణం కాదు. అక్కడ ఎలాంటి దూరమూ లేదు.
జ్ఞానోదయానికి సంబంధించిన బీజం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. జ్ఞానోదయం అనేది ఒక సాక్షాత్కారం.
ప్రేమ ఓ లావాదేవి కాదు; అది మీ మనోభావంలోని ఒక విధమైన ఉల్లాసం, మాథుర్యం.
There is no need to do what others are doing. You must do what truly matters to you.
మీరు దేన్నైతే అత్యున్నతమైనదిగా భావిస్తారో, దానినే అన్వేషించండి. ఆ దృక్పథంతో జీవించడం, దానికదే ఉన్నతమైన, విముక్తి కలిగించే ఒక ఆనందకరమైన ప్రక్రియ.
ఆధ్యాత్మిక ప్రక్రియలోని ప్రాథమిక అంశం, మీ ఊహలన్నింటినీ పక్కన పెట్టడం.
పరమాణువు నుండి అనంత విశ్వం వరకు ఉన్న ప్రతిదీ మీ అవగాహనకు మించినదని గ్రహించినప్పుడు, మీరు సహజంగానే వినమ్రులై, ఎంతో సౌమ్యంగా నడుచుకుంటారు.
మీ బాంధవ్యాలు ఒకరి నుండి సంతోషాన్ని పిండుకునేలా కాకుండా, సంతోషాన్ని పంచుకునేలా ఉన్నప్పుడు, మీకు ఎవరితోనైనా సరే అద్భుతమైన అనుబంధం ఉంటుంది.
సుముఖతతో ఉండటం అంటే ఎటువంటి నిర్ధారణలూ లేకుండా - ప్రతిదానినీ ఉన్నది ఉన్నట్లుగా చూడటమే.
ప్రశాంతత అనేది మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామనే దాని ఫలితమే.