Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
భక్తి అంటే పూజించడం కాదు. భక్తి అంటే మిమ్మల్ని మీరు శూన్యం చేసుకోవడం.
మాతృత్వంలోని అందం పునరుత్పత్తిలో లేదు, మరో జీవాన్ని మనస్ఫూర్తిగా మీలో ఒక భాగంగా చేర్చుకోవడంలో ఉంది.
మంచితనం అనేది ఒక ఆపాదించుకున్న వైఖరి. కానీ ఆనందం అనేది నిజమైన అనుభూతి.
విశ్వంలో మరోచోట నుంచి మీరు భూమిని చూస్తే, మనందరం దివ్య జీవులమే.
ఒక మనిషిగా, మీ జీవితానుభూతిని గ్రహాలు, నక్షత్రాలు నిర్ణయించాల్సిన అవసరం లేదు. మీ ఆంతరంగిక అనుభూతిని మీరే నిర్ణయించుకోవాలి.
మనశ్శరీరాలు అద్భుతమైన సాధనాలు. కానీ అవి అద్భుతంగా పనిచేయాలంటే, వాటిని సరైన రీతిలో ఎలా నిర్వహించాలో మీరు నేర్చుకోవాలి.
మానవ జీవితం కేవలం మనుగడతో ముగిసిపోదు. మనుగడ గురించి చింత లేనప్పుడే అసలైన మానవ జీవితం మొదలవుతుంది.
ప్రేమ ఒక లావాదేవీ కాదు. అది మీలో జరిగే ఓ మధురమైన విషయం. దాని వ్యక్తీకరణ బాహ్యంగా ఉండవచ్చు, కానీ అది అంకురించేది మీ అంతరంగంలోనే.
యోగా అంటే నిరంతరాయమైన శక్తి మూలానికి అనుసంధానం అవ్వడమే.
మిమ్మల్ని కుంగదీస్తున్నది మీ పని ఒత్తిడి కాదు, మీ ఆలోచనలు, భావోద్వేగాలలో మీరు నిత్యం తలమునకలవ్వడమే దానికి కారణం.
మీరు దానికి సన్నద్ధం కానప్పుడే ఆటంకం మీకు ఒక ఆటంకంగా ఉంటుంది. అవసరమైన అంతర్గత కృషి చేసినప్పుడు, అది ఓ సోపానం అవుతుంది.
బుర్రలో ఎలాంటి స్పష్టత లేకుండానే ప్రజలు అపారమైన ధీమాతో ఉంటున్నారు. అది అనర్థదాయకం.