ఈ వారం  సద్గురు లింగ బేధానికి సంబంధించిన  సామాజిక, సాంస్కృతిక, జీవ నిర్వచనాల ద్వారా లోతైన, మౌళిక వ్యక్తీకరణలు బహిర్గతం చేస్తున్నారు. పంచభూతాల  స్థాయిలో, లింగ పరిమితిని  దాటి వెళ్ళడానికి ఒక అవకాశం ఉందని అంటున్నారు. ఆయన, "మీరు మీ కార్యాలయం, కుటుంబం, స్నేహితులు, సోషల్ మీడియా, ఫోన్లు ఇంకా  కంప్యూటర్లు నుండి కొంత సమయం మీకై  మీరు తీసుకుంటే, అప్పుడు మీరు మీ ప్రస్తుత పరిమితులు  అధిగామించాల్సిన అవసరం ఉందని గ్రహిస్తారు." అని చెప్తున్నారు.

Sadhguruమీ లింగ భేధానికి పట్టింపు కేవలం స్నానపు గదులు మరియు బెడ్ రూములు వారికే పరిమితమవ్వాలి, ఇంకెక్కడా ఈ భేదం ఉండకోడదని నేను ఎల్లప్పుడూ చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఏ బాత్రూం వాడాలన్నది కూడా వివాదాస్పద విషయంగానే మారింది. ఇది చూస్తుంటే, మానవ వ్యవస్థలో లింగ పరిమితి ఎంత లోతుగా నాటుకు పోయిందో అన్న ప్రశ్న వస్తుంది. జీవశాస్త్ర పరమైన తేడాలు స్పష్టమైనవే. అయితే  అవి శరీరం లోపల ఐదు మూలకాల స్థాయిలో కూడా ప్రతిబింబిస్థాయా? సాధారణంగా, పంచభూతాల స్థాయిలో, మౌళికంగా స్త్రీ పురుషుల స్వభావ ధోరణులలో ఒక తేడా ఉంది. ఇది ప్రతి వ్యక్తికీ వర్తించకపోవచ్చు. అయితే, స్త్రీ లక్షణంలో ఈ పంచభూతాలలో నీటి వైపు మరింత మొగ్గి ఉంటే, పురుష లక్షణం భూమి వైపు మొగ్గి ఉంది. ఇది స్త్రీకి  శరీరంలోనూ ఇంకా మనస్సులోనూ కూడా ఒక స్థాయి మృదుత్వన్నీ, సున్నితత్వాని ఇస్తుంది. భూమి వైపు మొగ్గి ఉండడం వల్ల, పురుషునిలో స్థైర్యం,  ధృడత్వం, బలం అభివ్యక్తం అవుతాయి.

సాధారణంగా మహిళలు సహజసిద్ధత  వైపు ఒరుగుతారు కానీ పురుషులు తర్కానికి మక్కువ చూపిస్తారు.

సాధారణంగా మహిళలు సహజసిద్ధత  వైపు ఒరుగుతారు కానీ పురుషులు తర్కానికి మక్కువ చూపిస్తారు. ప్రతి ఒక్కరిలో ఇది నిజమవ్వాల్సిన అవసరం లేదు. కానీ సాధారణ ప్రవృత్తి ప్రకారం, ఒక స్త్రీ జీవితం అనుభూతి చెందాలని కోరుకుంటుది - పురుషుడు  జీవితాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటాడు. జీవన విధానంలో ఈ పెద్ద తేడా ఎందుకంటే, ఒకరిలో నీటి మూలకం ఆధిపత్యంలో ఉంటే మరొకరిలో భూమి మూలకం ప్రబలంగా ఉంటుంది. మిగిలిన మూలకాలు ప్రతి వ్యక్తిలోనూ భిన్నంగా ప్రవర్తిస్తాయి.  మీరు ఒక స్త్రీ అయినా, పురుషుడయినా, వేరే లింగం వారు చేసే పనులు, శిక్షణ ద్వారా మీరూ చేయగల సమర్థ పెంపొందించుకోవచ్చు.

కానీ అత్యావశ్యకంగా, పంచభూతాలు పురుషుల్లోనూ, స్త్రీల్లోనూ కూడా వారు ఒక పురుషడు లేదా స్త్రీ అవ్వడం మూలంగా నెరవేర్చాల్సిన ప్రాథమిక విధులు నెరవేర్చడానికి అనుకూలంగానే ప్రవర్తిస్తాయి.  మన నగరాలు, గృహాలు, ఇంకా ఉద్యోగ ప్రదేశాలలో ఒక కృత్రిమ ప్రపంచం సృష్టించుకున్నందువల్ల స్త్రీ, పురుష ప్రాథమిక విధులలోని తేడా మనకు కనిపించడం లేదు. కానీ మీరు అడవిలో నివసిస్తు ఉంటే, ఈ స్వభావాలు సహజ అవసరాలు అవుతాయి. అన్నిటికీ మించి, మనం తల్లి అని పిలిచే స్త్రీ మనకు జన్మనివ్వడంవల్లే, ఇప్పుడు మన ఉనికి ఉంది.   తదుపరి తరాన్ని ఉత్పన్నం చెయ్యడమనేది స్త్రీ శరీరానికి ఉన్న విధి అని దీని అర్థం. ఆ కారణంగా, స్త్రీ శరీరం ఒక నిర్దిష్ట విధంగా ఉంది.  పునరుత్పత్తికి, నీరు చాలా ముఖ్యమైన అంశం.

మీ ధోరణి ఆకాశం వైపు ఉంటే, ఆధ్యాత్మిక ఆకాంక్ష అన్ని ఇతర వాంఛలను అధిగమిస్తుంది.

ఒక నిర్దిష్ట వయస్సు వచ్చేవరకు, మౌళికంగా పురుషుని, స్త్రీ వ్యవస్థలు రెండూ కూడా ఒకదానికొకటి పరస్పర పూరకమైన విధంగా కూర్చ బడ్డాయి. జీవితంలో తరువాతి భాగంలో, స్త్రీ పురుషు శరీరాలు తమంతట స్వతంత్రంగా  పునఃవ్యవస్థీకరణ చేసుకుంటాయి. అయితే, దురదృష్టవశాత్తు ప్రజలు వారి జీవితాలను సామాజిక కట్టుబాట్ల  ప్రకారం జీవించాలను కుంటారు. ముఖ్యంగా, వివాహం, కుటుంబం విషయాల్లో. కొంత అలవాటు వల్ల, ఇంకా భావాత్మక, మానసిక అభద్రతాభావం వల్ల, ప్రజలు స్త్రీ-పురుష సంబంధాన్ని కొనసాగిస్తారు. స్త్రీ, పురుష వ్యవస్థలో మూలకాలమధ్య అవగాహన తాత్కాలికమే అంటే పురుషుడు మౌళిక ధోరణి భూమి వైపు, స్త్రీ మౌళిక ధోరణి నీటి వైపు ఉండడం తాత్కాలికమే. ఈ లింగ పరిమిత ధోరణులను మీరు ఎంత త్వరగా అధిగమిస్తారన్నది, మీలోని ఆకాశ తత్వంపై ఆధారపడి ఉంటుంది.

మీ ప్రస్తుత పరిమితులు అధిగమించి, పంచేంద్రియాలును ఇంకా భౌతిక పరిమాణానికి మించి మీ అవగాహన విస్తరించేందుకు, ఉనికిని ఆధ్యాత్మిక స్వభావాన్ని అన్వేషించటానికి, మీలో ఆకాశ తత్వం వృద్ధి చెయ్యడం చాలా అవశ్యకం. ఇప్పుడు ప్రశ్న దీనిని వృద్ధి చెయ్యడం ఎలా అన్నది. అన్నిటికంటే మొదటి విషయం, భౌతిక సృష్టి కేవలం భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అయిన ఐదు మూలకాల కలయిక ద్వారా అభివ్యక్తం కాలేదు. భౌతిక సృష్టి జరిగే ముందు, కేవలం శూన్యత మాత్రమే ఉంది. శూన్యం  నుండి  మొదటి మూలకమైన ఆకాశం తలెత్తింది. ఇతర మూలకాలు ఆకాశం నుండి పరిణామం చెందాయి.  మీలో ఆకాశ తత్వం వృద్ధి చెయ్యడం అంటే మీ తలలో ఖాళీ స్థలాన్ని సృష్టించడం కాదు. ఆకాశ తత్వం వృద్ధి చెయ్యడం అంటే  ఆధ్యాత్మికంగా, శరీరికంగా, మీ సహజ స్వభావం వైపు మళ్లడం. మీ ధోరణి ఆకాశం వైపు ఉంటే, ఆధ్యాత్మిక ఆకాంక్ష అన్ని ఇతర వాంఛలను అధిగమిస్తుంది.

మీ వ్యవస్థలో ప్రబలమైన మూలకం ఆకాశం అయిన్నప్పుడు, శారీరక అంశాలను తక్కువ ప్రాముఖ్యమైనవిగా మారతాయి. అంటే భౌతికత్వం నిర్లక్ష్యం చేయడమని కాదు, దాన్ని అధిగమించడం. అధిగమించడం అంటే ప్రస్తుతం పరిమితులు దాటటం. ప్రజలు సాధారణంగా తమ జాతి, మత లేదా లింగ గుర్తింపులు, లేదా వ్యక్తిత్వ లక్షణాలు ఆధారంగా తమని తాము గుర్తించుకుంటారు. అత్యావశ్యకంగా, మీరు మీ పరిమితులు, లేదా మీరు గీసుకున్న సరిహద్దుల ద్వారా మిమల్ని నిర్వచించుకుంటున్నారు. ఆకాశ తత్వం వృద్ధి చెయ్యడం, ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అంటే మిమల్ని  మీరు అనంతంతో నిర్వచించుకోవడమే. అనంతాన్ని నిర్వచించే హద్దులే లేవు..!   ఒకసారి, మీ అవగాహన భౌతిక ప్రకృతి దాటితే అప్పుడు పురుషుడు లేడు, స్త్రీ లేదు. ఉన్నది కేవలం ఒక మానవ రూపం. దీనిని అనేక రకాలుగా సమర్థవంతంగా తయారు చేయవచ్చు. సమర్థత కేవలం చేసే చర్యల పరంగానే కాదు, అవగాహన పరంగా కూడా.

మీరు ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక జీవిగా మీ సమర్థత పెంచుకోవచ్చు. మీరు మరింత సజీవంగా తయారవుతారు. ప్రతి మానవుడు మరో పెద్ద కోణంలో జీవితం తెలుసుకొనే సామర్ధ్యం కలిగి ఉన్నాడు. పరిమితులను దాటాలన్న కోరిక ప్రతి వ్యక్తిలోనూ నిద్రాణంగా ఉన్నది. మీరు మీ కార్యాలయం, కుటుంబం, స్నేహితులు, సోషల్ మీడియా, ఫోన్లు ఇంకా కంప్యూటర్లు నుండి కొంత సమయం మీకై  మీరు తీసుకుంటే, అప్పుడు మీరు మీ ప్రస్తుత పరిమితులు అధిగామించాల్సిన అవసరం గ్రహిస్తారు. దీనికోసం ఏ బోధనా అవసరం లేదు. తమకి తాము అవసరమైన సమయం తీసుకుంటే, ప్రతి మానవుడికి వారి ఉనికి పరిమితులు తెలుస్తాయి. మీకు సరిహద్దులు ఏమిటి అన్న స్పృహ మీకు కలిగాక, వాటిని అధిగామించాలన్న కోరిక కలగడం సహజమే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు