ArrowBack to Home page

శివాంగ సాధన

అనుగ్రహానికి మార్గం

(పురుషుల కోసం, ఆన్‌లైన్ ద్వారా లేదా ప్రత్యక్షంగా)

శివాంగ సాధన, పురుషుల కొరకు శక్తిమంతమైన 42-రోజుల (సాధన కాలవ్యవధి) దీక్ష. సద్గురు అందిస్తున్న ఈ సాధన, ధ్యానలింగ శక్తులను స్వీకరించే సామర్థ్యాన్ని సాధకునిలో పెంచి, అతడు శరీరం, మనస్సు ఇంకా శక్తులను మరింత లోతుగా అన్వేషించే వీలుకల్పిస్తుంది.

రాబోయే ఉపదేశం - 07 Mar 2023
రిజిస్ట్రేషన్ ఫీజు - Rs. 350 (*కిట్ ధర కాకుండా)

శివాంగ సాధన అంటే ఏమిటి?

“శివాంగ సాధన అనేది, సృష్టికి మూలమూ, అలానే పరమోత్తమ సంభావ్యత అయిన శివునిలో, మీరు ఒక భాగం అనే విషయాన్ని మీ ఎరుకలోకి తీసుకురావడం కోసం ఉద్దేశింపబడింది.”


సద్గురు

ఈ సాధన ఒకరి అంతరంగంలోని భక్తి భావాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ఒక అవకాశం.


ఈ సాధనకు ఉపదేశం ఇంకా ఉద్యాపన ఉంటాయి. ఇవి వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌ ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి.

Translation is available in English, தமிழ், हिंदी, తెలుగు, ಕನ್ನಡ, മലയാളം

“జీవితం చాలా మెరుగుపడింది. శివుడు అన్నింటా ఉన్నాడని నేను అనుభవపూర్వకంగా చూడటం మొదలుపెట్టాను. నా అనుభవంలో ప్రతీదీ శివుడే, కేవలం శివుడే.”

విశాల్

సప్లై చైన్ మేనేజర్, ఢిల్లీ

“వెల్లియంగిరి పర్వతాన్ని ఎక్కుతున్న సమయమంతా శివ శంభో మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాను. పైకి ఎలా చేరుకున్నానో కూడా నాకు తెలియలేదు. మరెవరో నన్ను మోసుకెళ్తూన్నట్టు అనిపించింది.”

అభిరామ్

ఇంటీరియర్ డిజైనర్, బెంగళూరు

శివాంగ సాధన ప్రయోజనాలు

separate_border
శక్తివంతమైన 42 రోజుల సాధనలోకి ఉపదేశం
పవిత్రమైన "శివ నమస్కారం" అనే యోగ ప్రక్రియను నేర్చుకోండి
వెల్లియంగిరి పర్వతాలకు తీర్థయాత్ర (తప్పనిసరి కాదు)
అంతరంగ అన్వేషణకు ఒక బలమైన భౌతిక, మానసిక పునాదిని నిర్మిస్తుంది.

రాబోయే సాధన తేది 07 Mar 2023

సాధన వివరాలు

separate_border
 • మార్గదర్శకాలు
 • రిజిస్ట్రేషన్
 • ఉపదేశం
 • ఉద్యాపనం

ఈ సాధన, పౌర్ణమి నాడు ప్రారంభమమై, 42 రోజుల తర్వాత వచ్చే శివరాత్రి (అమావాస్యకు ముందు) రోజున ముగుస్తుంది.

సాధన మార్గదర్శకాలు

 • ఈ సాధన కేవలం పురుషులకు మాత్రమే.
 • రోజుకు ఒకసారి సూర్యోదయానికి ముందు కానీ, సూర్యాస్తమయం తరువాత కానీ, ఖాళీ కడుపున భక్తితో 21-సార్లు శివ నమస్కారము (ఉపదేశం సమయంలో ఇది బోధించబడుతుంది) చేయాలి.
 • రోజుకు కేవలం రెండు సార్లే భోజనం చేయాలి. మొదటి భోజనం మధ్యాహ్నం 12 గంటల తరువాత చేయాలి.
 • 8 నుంచి 10 మిరియాలు, రెండు లేక మూడు బిల్వ ఆకులను రాత్రిపూట తేనెలో నాన పెట్టండి. అలాగే ఒక గుప్పెడు వేరుశనగలను నీటిలో నానబెట్టండి. ఆ తరువాతి ఉదయం, ఖాళీ కడుపుతో, ఆకులను నమలండి. మీ రోజువారీ శివాంగ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మిరియాలు-తేనె మిశ్రమానికి నిమ్మరసం జోడించి తినండి. నానబెట్టిన వేరుశనగలను కూడా తినండి.
 • రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. సబ్బుకు బదులుగా హెర్బల్ స్నానం పొడిని వాడవచ్చు.
 • కనీసం 21 మంది నుండి భిక్షను స్వీకరించాలి. (విదేశీయులకు తప్పనిసరి కాదు)
 • సాధనా కాలంలో తెలుపు లేదా లేతరంగు వస్త్రాలను ధరించాలి.
 • సాధనా కాలంలో, పొగ త్రాగడం, మద్యం సేవించడం, మాంసాహారం తినడం అనుమతించబడవు.

పురుషులకు సాధన నియమాలు: హిందీతమిళ్ఇంగ్లీష్ మలయాళంతెలుగుకన్నడ

రిజిస్ట్రేషన్

 • ఉపదేశానికి హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

 • ఈ సాధన ఉపదేశానికి హాజరు కావడానికి శివాంగ కిట్ అవసరం. మీరు మీ కిట్‌ని ఈశా లైఫ్ నుండి ఆర్డర్ చేయవచ్చు.

ఉపదేశం

 • ఒక శిక్షణ పొందిన శివాంగ, పౌర్ణమి నాడు, పాల్గొనేవారికి సాధనలోకి ఉపదేశం ఇస్తారు. మీరు ఆన్‌లైన్‌ ద్వారా కూడా పాల్గొనవచ్చు.
 • ఈ సాధన, పౌర్ణమి నాడు ప్రారంభమమై, 42 రోజుల తర్వాత వచ్చే శివరాత్రి రోజున (అమావాస్యకు ముందు రోజున) ముగుస్తుంది.

ఉద్యాపనం

 • శివాంగలు, శివరాత్రి నాడు కోయంబత్తూరులోని ధ్యానలింగం వద్దకి రావడం తప్పనిసరి కాదు.
 • కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రం‌ వద్ద ఉద్యాపనం చేయడం కుదరని వారికి, ఆన్‌లైన్ ద్వారా ఉద్యాపనం చేసే సౌకర్యం కూడా ఉంది.
రాబోయే సాధన తేది 07 Mar 2023

వెల్లియంగిరికి వెళ్లాలని నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. అది కేవలం ట్రెక్కింగ్ మాత్రమే కాదు, అది దైవాన్ని కలవడానికి వెళ్లడం లాంటిది. మీరు జీవితంలో ఒక్కసారైనా అక్కడకు వెళ్ళాలి, ఒక్కసారి వెళితే మీకే తెలుస్తుంది!

ప్రవీణ్

ముంబై

ఇది కూడా మరొక ట్రెక్కింగ్ లా ఉంటుంది అని అనుకున్నాను. కానీ వెల్లియంగిరి పర్వతం, మీరు ఎప్పుడూ ఎరుగని మీలో ఉన్న, మీ భౌతిక పరిమితులను మీకు చూపుతుంది. మీరు ఎదిగేలా చేయడానికి అది మిమ్మల్ని కూలగొడుతుంది!

సువిగ్య

రోబోటిక్ ఇంజినీర్, బెంగళూరు

రాబోయే సాధనల తేదీలు

separate_border

ఉపదేశం ఇంకా ఉద్యాపనం రెండింటిలో మీరు ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొనొచ్చు. ధ్యానలింగం వద్ద ఉద్యాపనం ఇంకా వెల్లియంగిరి పర్వతాలకు యాత్ర తప్పనిసరి కాదు.

ఉపదేశం
ఉద్యాపనం
యాత్ర(Optional)
7 Dec 2022
20 Jan 2023
21 Jan 2023
6 Jan 2023
18 Feb 2023 (Mahashivaratri)
5 Feb 2023
20 Mar 2023
21 Mar 2023
7 Mar 2023
18 Apr 2023
19 Apr 2023
5 Apr 2023
17 May 2023
18 May 2023

వచ్చే రుసుము మొత్తం TKBP లాభాపేక్ష రహిత ట్రస్ట్‌కి వెళ్తుంది

ఆసక్తిగా ఉందా? అయితే చేయాల్సినవి

separate_border

1

రిజిస్ట్రేషన్

ఈ శివాంగ సాధనలో ఉపదేశం పొందడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

2

సాధన కిట్

ఉపదేశానికి హాజరుకావడానికి ఇది తప్పనిసరి. మీరు దీన్ని ఈశా లైఫ్ నుండి ఆర్డర్ చేయవచ్చు.

3

ఉపదేశం

మీరు ఆన్‌లైన్‌ ద్వారా ఉపదేశం పొందవచ్చు, లేదా శిక్షణ పొందిన శివాంగ నుండి మీ స్థానిక కేంద్రంలో వ్యక్తిగతంగా ఉపదేశం పొందవచ్చు.

4

ఉద్యాపనం

మీరు సాధనను ఆన్‌లైన్‌ ద్వారా ముగించవచ్చు, లేదా ఈశా యోగ కేంద్రానికి వచ్చి ముగించవచ్చు.

శివాంగ స్పూర్తితో మీ భక్తిని ప్రజ్వలింపజేయండి

separate_border

శివునికి అర్పించే ఉత్తేజభరితమైన భక్తి కీర్తనలు, సద్గురు అందించే లోతైన జ్ఞానం, ఇంకా శక్తివంతమైన గైడెడ్ ధ్యానాలతో మీ భక్తిని ప్రజ్వలింపజేసుకోండి.

సమయం:

7-8 PM IST

తేది:

ప్రతి అమావాస్య

FAQ

separate_border

మమ్మల్ని సంప్రదించండి

separate_border
మీ సాధన సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక శివాంగ కోఆర్డినేటర్‌ను సంప్రదించండి.

మీరు మమ్మల్ని ఇక్కడ కూడా సంప్రదించవచ్చు:
info@shivanga.org | +9183000 83111

మరిన్ని వివరాల కోసం శివాంగ బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

 
Close