యోగి ఇంకా మార్మికుడు సద్గురు, ధ్యానంలో వచ్చే ఆలోచనలను ఎలా నియంత్రించడం అనే ప్రశ్నకు సమాధానమిస్తున్నారు.

Question: ప్రశ్న: నమస్కారం. క్రియా సాధన సమయంలో, ఎల్లప్పుడూ సవాలు చేసే ఆలోచనలు నా మనస్సులో ప్రవేశిస్తూంటాయి. వాటిని దూరంగా పెట్టి క్రియల మీద కేంద్రీకరించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాను, కానీ ఇది వాస్తవంగా పనిచేయడంలేదు. ధ్యానంలో లేదా క్రియల్లో ఆలోచనలను నియంత్రించడం ఎలా?  

సద్గురు: ఆలోచనలను తరిమివేయడం మీద మీరు గట్టిగా కేంద్రీకరిస్తున్నారు కాని అవి పోవడం లేదు. ఇది మనస్సు లక్షణం, కానీ మీరు మనస్సుకు వ్యతిరేకంగా తొందరపాటు నిర్ణయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీరు మీ క్రియా సాధనలో గాని మీ ధ్యానంలో గాని మీ మూత్రపిండాలు, లేదా ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా లేదా గుండె కొట్టుకుంటోందా అని దృష్టి పెట్టరు. మీ శరీరంలోని ఇతర ప్రక్రియల గురించి పట్టించుకోరు – మీ మెదడు మాత్రం పనిచేయకూడదనుకుంటారు! మీరు ఆధ్యాత్మికంగా ఏదైనా చేస్తుంటే మీ మెదడు పనిచేయడం ఆగిపోవాలని భావించడం పూర్తిగా తప్పు.

మీ ఆలోచనలు వట్టి వాసనలే – సుగంధం అయినా దుర్గంధం అయినా - మీరు మీలో మోసే సరుకుకు సంబంధించిదే. కొత్తగా ఏమీ ఉదయించదు. ఒకవేళ మీరు పోగుచేసిన ఆ సరుకును మీ మెదడులోనికి పోనివ్వకపోతే, మీ మెదడు అసాధారణ రీతిలో పని చేస్తుంది. అది మీరు అసాధ్యమనుకున్న వాటిని కూడా చేయగలదు. కాని అది ఇప్పుడు పూర్తిగా మీ చెత్త చెదారంతో నిండి ఉంది – అదే సంఘర్షణ; అందుకనే మీరు దానిని ఆపాలని కోరుకుంటున్నారు. మీ జీవితానికి కిరీటంలా ఉండాల్సిన మెదడు, మీ జీవితానికి చెత్తకుండీగా తయారయ్యింది. భౌతికంగా అది కిరీటం. యోగ సంకేతాలలో సహస్రారం వెయ్యి రేకులుగల కమలం – “ఒక వెయ్యి” అక్షరాలా సంఖ్యని కాదు కాని అసంఖ్యాకమని. మీ మెదడుని అస్థిత్వ ప్రక్రియ దారిలో పెట్టి ఉంటే అసంఖ్యాకమైన అవకాశాలు తెరుచుకునేవి. కాని ప్రస్తుతం మీ మెదడు కేవలం మనో ప్రక్రియ దారి పట్టి ఉంది.

Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

ఇప్పుడు మీరు అనవచ్చు “ సద్గురూ, సరిగ్గా అదే నేను అంటున్నాను – ఆలోచనలను ఎలా నియంత్రించాలి?” అని. లేదు, మీరు అనేది అది కాదు. జ్ఞానోదయంపై మీకున్న భ్రాంతిజనకమైన భావాలకు మీ ఆలోచనలు అడ్డుపడడం మీరు కోరుకోవడంలేదు. భ్రాంతిజనకమే ఎందుకంటే జ్ఞానోదయం అనేది మీరేదో చెయ్యడం వలన రాదు. కాంతికి మీరు హేతువు కాదు, కానీ మీరు కాంతిని చూస్తున్నారు. ఉదయం సూర్యోదయం అయినపుడు, వచ్చే కాంతికి మీరు కారణం కాదు, కానీ మీ కళ్ళు తెరిచి ఉంటే కాంతిని చూడగలుగుతున్నారు. మీరు దీపం లేదా వేరే పరికరం ఉపయోగించి కాంతికి కారణమైనప్పుడు, మీరు ఎప్పుడూ దానిని వెలిగించి ఉంచాలి, ఇంకా అది ఆరిపోతుందోనే భయం ఎల్లప్పుడూ ఉంటుంది.

విద్యకు జ్ఞానానికి మధ్య వ్యత్యాసం ఇదే – మీరు మిమ్మల్ని 1, 10, లేదా 1000 పుస్తకాలతో విద్యాధికులను చేసుకోగలరు, అయినా ఎక్కడో ఒకచోట మీరు ముందుకు వెళ్ళలేక ఆగిపోవాల్సిందే. జ్ఞానోదయం అంటే మిమ్మల్ని మీరు పుస్తకాలతో విద్యాధికులను చేసుకోవాటం కాదు – మీరు ఊరికే అక్కడే ఉంటారు; అది ఒక అంతులేని ప్రక్రియ. జ్ఞానోదయమైన వ్యక్తికి ప్రత్యేకంగా తెలిసింది, మీకు తెలియంది ఏదైనా ఉందా? లేదు. జ్ఞానోదయమైన వ్యక్తికి ప్రత్యేకంగా తెలియనిది ఏదైనా ఉందా? లేదు. నేను పదాలతో ఆడటం లేదు. ఇది అస్థిత్వ లక్షణం.

అసమర్ధమైన మనస్సు

మీ కాలేయంలోనూ, మూత్రపిండాలలోనూ ఏది జరుగుతుందో అది మీరు సృష్టించే ఆలోచనల కన్నా ఎంతో క్లిష్టమైంది. మీ అవయవాల కార్యకలాపాలు మిమ్మల్ని ఆటంక పరచకపోతే, మీ ఆలోచనలు ఎందుకు ఆటంకపరుస్తాయి? కారణం మీరు మీ ఆలోచనలే అనుకుంటున్నారు. మీరు ఆలోచిస్తున్నప్పుడు, మీరు వాటిని ‘‘నా ఆలోచనలు’’ గా చూడరు, నేనలా భావిస్తున్నాను  అంటారు. మీరు మీ ఆలోచనా ప్రక్రియతో లోతుగా గుర్తింపబడి ఉన్నారు కనుకనే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీకు మూత్రపిండాలతో ఏ సమస్య లేకపోతే మీరు మీ మూత్రపిండాలతో గుర్తింపబడరు. అవి మామూలుగా పనిచేస్తే, చాలామందికి వారికి మూత్రపిండాలు ఉన్నాయా లేవా అనైనా కనీసం ఊహించరు. మూత్రపిండాలు అనే ఆ సాధనాలు – అవి వాటిని గురించి మనం మర్చిపోయేటంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.

మీరు ఆధ్యాత్మికంగా ఏదైనా చేస్తుంటే మీ మెదడు పనిచేయడం ఆగిపోవాలని భావించడం పూర్తిగా తప్పు.

మీరు ఎప్పుడూ ఏది సమర్థవంతంగా పనిచేయదో దాని స్పృహతోనే ఉంటారు. నేను మీ మెదడు గురించి మాట్లాడుతున్నానని మీకు తెలుసు. ఒకవేళ అది సవ్యంగా పనిచేస్తుంటే మీరు మీ మూత్రపిండాలను గాని కాలేయాన్నిగాని గమనించనట్లు, మీరు మీ మెదడునూ గమనించరు. ఒకవేళ మీరు దానితో గుర్తింపు పొంది ఉండకపోతే, మీరు దానిని పట్టించుకోరు. ఒకవేళ మీరు గుర్తింపు పొందితే అది ఒక పెద్ద వ్యవహారం. మీరు మీ ఆలోచన కాదు. మీరుకాని దాని దేనితోనో మీరు గుర్తింపు పొందుతున్నారు. ఒకసారి మీరుకాని దాని దేనితోనో మీరు గుర్తింపు పొందితే, మానసిక ప్రక్రియను మీరు ఆపలేరు – అది అలా అనంతంగా సాగిపోతుంది. అది మీరు చెడిపోయిన ఆహారం తింటే మీలో గ్యాస్ తయారయ్యే విధంగా. మీరు దానిని ఓ మద్యంసీసా మూతతో ఆపలేరు. మీరు చెడు ఆహారాన్ని తినడం ఆపివేయాలి.

ప్రస్తుతానికి మీ చెడు ఆహారం అంటే మీరు మిమ్మల్ని మీరుకాని వాటిగా నమ్ముతున్నారు. మీరు మీ శరీరంతో, మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, మీ చుట్టూ మిగిలిన చాలా ఇతర విషయాలతో గుర్తించిన తక్షణమే, మీ ఆలోచనా ప్రక్రియ అనంతం అవుతుంది. ప్రజలు మనస్సు అలాగే ఉంటుంది అనుకుంటారు. మనస్సు అలాగ ఉండదు, లేదా అది ఏమాత్రమూ అలా ఉండవలసినది కాదు. మీకు నిరంతరంగా కడుపు నొప్పిగావుంటే, మీరు కడుపు అంటే అలాగే ఉంటుంది అనుకుంటారు.

మానవ అవకాశాలు

మెదడు ఇతర అవయవాలకన్నా అత్యంత సున్నితమైనది. అన్ని ఇతర అవయవాలకి ప్రత్యేకమైన విధులు ఉంటాయి, మెదడులో కొంతవరకు మాత్రం ప్రత్యేకమైన విధులు ఉండి  మిగిలినది మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఇదే మానవుడిగా ఉండడంలో సమస్య. ఏ ఇతర జీవికైనా ప్రత్యేకమైన గమ్యాలను మించి ఏమీ ఉండదు. అవి బాగా తినాలి, బాగా పెరగాలి, పునరుత్పత్తి చేయాలి, ఇంకా ఒక రోజున మృతి చెందాలి. కేవలం మనిషి మాత్రమే “నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? నా జీవిన లక్షణం ఏమిటి? నేను ఎక్కడనుండి వచ్చాను? నేను ఎక్కడికి వెడతాను?” అని ఆశ్చర్యపోతుంటాడు. ఈ ప్రశ్నలన్నీ మీరు మానవుడిగా ఉన్నప్పుడే వస్తుంటాయి. మనిషికీ ఏ ఇతర జీవికైనా ఉండే వ్యత్యాసం - మనిషి మెదడులోని పెద్దమెదడు భాగం (మస్తిష్క వలయం) ఇంకా ఇతర భాగాలు వికసించడమే.

ఒక కోతికి, ఒక తోకలేని కోతికి లేదా ఏ ఇతర జీవికి లేని ఒక క్రొత్త అవకాశం మీలోపల ఉదయిస్తే మీరు పిర్యాదు చేస్తున్నారు. ఒక అవకాశాన్ని సమస్యగా పరిగణించవద్దు. అది సమస్య కాదు – అది మీరు ఇక్కడ కూర్చుని 1000 మైళ్ళ దూరంలో, 1000 సంవత్సరాల క్రితం, లేదా 1000 సంవత్సరాల ముందు గురించి గాని ఇంక మరి దేని గురించైనా ఆలోచించగల అవకాశం. ఇది చాలామందికి సమస్యగా తయారయ్యింది, ఎందుకంటే వారు ఎప్పుడూ ఉపయోగించుకునే వివరణ పుస్తకం (user manual) పై దృష్టి పెట్టకపోవడం వలన.

ముందుగా బుర్రకి చెడు ఆహారం ఇవ్వడం మానేయండి – దానిని సత్యంతో నిపండి, అసత్యంతో కాదు. మనం సత్యంయొక్క చేతులలో ఉన్నాం. మన చేతులలో సత్యంలేదు. మన చేతులు పూర్తిగా అసత్యాలతో నిండిపోయాయి. మీరు నమ్ముతున్నవన్నీ, మీరు తయారు చేసుకున్నవన్నీ, వదిలేస్తే, మీరు ఇక్కడ కూర్చుంటే, మనస్సు ఊరికే ఖాళీగా ఉందని మీరు గమనిస్తారు. అది ఖాళీగా ఉంటే ఏమి ఉపయోగం? దాని ఉపయోగమేమిటంటే అది విశ్వమంతటినీ ప్రతిబింబించగలదు. లేదంటే, అది పూర్తిగా హాస్యస్పదమే అవుతుంది. ఇది మీ ఎంపిక – మీ మనస్సును హస్యకరమైన చోటుగా చేసుకోవడమా లేక విశ్వానుగతం చేసుకోవడమా అనేది. దానిని విశ్వానుగతం చేయాలనుకుంటే మీరు అన్ని అసత్యాలనీ వదిలేయాలి – అప్పుడు సత్యం, స్వభావ సిద్ధంగా తేజరిల్లుతుంది. మిథ్యాభావము లేకపోవడమే సత్యం.

కేవలం మూర్ఖుడే సత్యం అంటే ఏమిటి అనేది మాట్లాడతాడు. తెలిసిన వారు మాత్రం దాని చుట్టూ ఉన్న దాని గురించి మాట్లాడతారు ఎందుకంటే మీరు సత్యం గురించి మాట్లడలేరు కనుక. మీరు కేవలం ఏ పదార్ధానికైతే కొలమానాలు లేదా పరిధులు ఉంటాయో దానినే నిర్వచించగలరు, వివరించగలరు. ఒకవేళ దేనికైనా పరిధులు, కొలమానాలు లేకపోతే దాని గురించి మీరు మాట్లాడలేరు. మొత్తం పని అంతా మీరు సృష్టించిన గందరగోళాన్ని నివారించడమే, సత్యాన్ని స్థాపించడం కాదు. సత్యాన్ని స్థాపించవలసిన అవసరం లేదు. సత్యం యొక్క ఒడిలోనే మనందరం కూడా ఉన్నాం.

మీ క్రియా సాధన వేళలో మీకు వస్తున్న ఆలోచనలన్నీ బయటపెట్టమని నేను అడగను. మీకొచ్చే ఆలోచనలక గురుంచి ఆందోళన పడకండి. అంతకు పైగా వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. మీ మూత్రపిండాల కార్యశీలత జరుగుతున్నట్లే, వాటి కార్యశీలత అలాగే జరగనివ్వండి. మీ మూత్రపిండాలలో ఉన్నదంతా శుభ్రంగా ఉండదు. అలాగే మీ మెదడులో ప్రతీదీ శుభ్రంగా లేకపోతే – మీకు సమస్య ఏమిటి? 

మంచి ఆలోచనలు - చెడు ఆలోచనలు

మంచి ఇంకా చెడు ఆలోచనలనే విచక్షణ చూపవద్దు. మంచి ఇంకా చెడు అనే ఆలోచనలు లేవు – అక్కడ వట్టి ఆలోచనలే ఉన్నాయి. మీ ఆలోచనలు మీలో ఉన్న చెత్త ఏ రకం అనేదానిపై ఆధారపడి ఉంటాయి – అటువంటి వాసనే ఉద్భవిస్తాయి. నిన్నటి చెత్తను బట్టే నేటి వాసన ఉంటుంది. అది మీరు చెత్తబుట్టలో ఏం పారవేసారనే దానిని బట్టే ఉంటుంది. మీరు నిన్న ఒక సినిమా చూస్తే లేదా వేరే ఏదైనా సంభవిస్తే అదే ఈరోజు మళ్ళీ మీ వద్దకి వస్తుంది. మీ ఆలోచనల నాణ్యతను నిర్ణయించకండి – అది వట్టి పనికిమాలినది. ముఖ్యమైన విషయమేమిటంటే అవి ఏమాత్రం యదార్ధం కాదు. ఒక ఆలోచన అంటే అది యదార్ధం కానిది. మీరు ఎవరు అనేదానిలో ప్రస్తుతం చాలా భాగం చేతన లేకుండా ఉంది. మీరు ఎల్లవేళలా ఏదో ఒక విషయానికి ప్రాధాన్యతని ఇస్తున్నారు. మీకు సృష్టి ఇంకా సృష్టికర్త స్వభావం గురించి తెలుసుకోవాలని కోరిక ఉంటే, మీరు ప్రస్తుతం మీ అంతట మీరు ప్రయత్నిస్తున్న విషయాలన్నీ చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. ఇలా విషయాలు తయారు చేయడానికి చేసే ప్రయత్నాలు విశ్వసనీయమైనవి కావు.

మీరు చేసే క్రియా సాధనలో నిరంతరాయంగా ఆలోచనా తరంగిణి కొనసాగించే ప్రయత్నం చేస్తే, అకస్మాత్తుగా అవి రావు. అకస్మాత్తుగా మీకు తలలో అడ్డంకు కలుగుతుంది. మీ ఆలోచనల గురించి కాని వాటిని ఎలా నియంత్రించాలని కాని మీరు హైరానా పడకండి. లోపల ఈరోజు ఉన్నదానిని బట్టే ఆలోచనలు వస్తాయి. దీనికి ప్రాముఖ్యత కాని పర్యవసానం కాని ఏమీ లేదు. మీరు వట్టి క్రియా సాధన చేయాలంతే – ఆలోచనలు చేయకండి. మీరు వాటిని తీసివేయడానికి ప్రయత్నం చేసినా, లేక నిరంతరాయంగా ఆలోచనలు ఉంచాలన్నా, లేక ధ్యానంలో 108 పవిత్రమైన ఆలోచనలు చేయాలన్నా, మీరు ఇంకా ఆలోచనలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టే. మూత్ర పిండాలు వాటి పని అవి చేస్తాయి; కాలేయము దాని పని అది చేస్తుంది; మెదడు దాని పని అది చేస్తుంది; మీరు క్రియా సాధన చేయండి – అంతే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు