సొరకాయ సలాడ్
సొరకాయ చెక్కుతీసి లోపల గుజ్జు తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు :
సొరకాయ - 350 గ్రా
టమేటాలు - 2
క్యాప్సికం - 1
క్యారెట్ - 1
ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం - తగినంత
కొబ్బరికోరు - 3/4
పచ్చిమామిడి కోరు - 1/4
సన్ఫ్లవర్ ఆయిల్ - 2 టీ స్పూనులు
చేసే విధానం :
సొరకాయ చెక్కుతీసి లోపల గుజ్జు తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. టమోటాలు, క్యాప్సికవ్ు చిన్న ముక్కలు చేసుకోవాలి. క్యారెట్ తురుముకోవాలి... మామిడి కోరు, కొబ్బరి కోరు నూనెవేసి ఉప్పు, మిరియాల పొడి నిమ్మరసం వేసి కలుపుకుని, ఆ తరువాత అందరికీ వడ్డించాలి.