ఫ్రూట్స్ & ఫ్రూట్ బ్రెడ్ సలాడ్
అనాస, జామ, కీరా గుండ్రంగా ముక్కలు చేసి పళ్లెంలో పెట్టుకోవాలి.
ArticleDec 24, 2016
కావాల్సిన పదార్థాలు :
అనాసపండు - 1 కప్పు (చిన్న ముక్కలు)
జామపండు - 1 కప్పు (గింజలు తీసినవి)
కీరదోసకాయ - 1 కప్పు (పెచ్చుతీసి చిన్నముక్కలు చెయ్యాలి)
నల్లద్రాక్ష - 1 కప్పు
ఫ్రూట్ బ్రెడ్ ముక్కలు - 1 కప్పు
ఛాట్ మసాల - 1 టీస్పూను
చేసే విధానం :
అనాస, జామ, కీరా గుండ్రంగా ముక్కలు చేసి పళ్లెంలో పెట్టుకోవాలి. ఫ్రూట్ బ్రెడ్ ఒవెన్లో పది నిమిషాలు ఉంచాలి. కావాలంటే నూనెలో వేయించి పక్కన పెట్టాలి. పళ్ళెంలో అన్నీ కలిపి, ఛాట్-మసాలా చల్లి అందరికీ వడ్డించాలి.