ఆధ్యాత్మికత గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
ArticleMar 15, 2017
ఆధ్యాత్మికత గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.
- మీతో మీరు వంద శాతం నిజాయితీగా ఉండడం అన్నది ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ప్రాధమికమైన విషయం.
- ఆధ్యాత్మికత విధానంలోని మొదటి సూత్రం మీరు మీ నిర్ధారణలనన్నింటినీ ప్రక్కనబెట్టడం.
- ఆధ్యాత్మికతకు మీరే వాతావరణంలో జీవిస్తున్నారన్న దానితో సంబంధం లేదు. అది మీలో మీరు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారన్నదానికి సంబంధించినది.
- పూర్తి నిమగ్నతతో, ఏ పనైనా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కావచ్చు.
- ప్రతి సామాజిక వర్గమూ గుర్తింపుల ఆధారంగానే నెలకొల్పబడింది. గుర్తింపులకు అతీతంగా జీవించడం నేర్చుకోవడమే ఆధ్యాత్మిక ప్రక్రియలోని మూలసూత్రం.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.