‘సద్గురు సన్నిధి సంఘ’లో పాల్గొనడం ద్వారా, మీ ఇంటిని దేవాలయంగా ఎలా మార్చుకోవచ్చో సద్గురు తెలుపుతున్నారు. సద్గురు సన్నిధి అనేది ప్రతిష్టించబడిన రూపం. ఇది, మీ ఇల్లు అనుగ్రహంతో నిండేలా చేస్తుంది, అలాగే మీ ఇంటిని అంతర్గత పరివర్తనకు దోహదపడే శక్తివంతమైన స్థలంగా మార్చుతుంది. ఇంట్లో సన్నిధిని నెలకొల్పడం అనేది, మీ ఆధ్యాత్మిక పురోగతిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణతో నిర్వహిస్తే, ఆ ఆవరణలోకి వచ్చే అందరి ఆంతరంగిక ఇంకా బాహ్య శ్రేయస్సుపై సన్నిధి అద్భుతమైన ప్రభావం చూపుతుంది; ఆ విధంగా అక్కడి ప్రజలకు కూడా ఆధ్యాత్మిక అవకాశాన్ని అందిస్తుంది.
Subscribe