నమస్కారం సద్గురు, ఇంతక ముందు మీరు సంధ్యాకాలాలు, బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు, కానీ దేవీ ఆలయములో జరిగే అభిషేకాలు ఈ సమయాల్లో ఎందుకు జరగటం లేదు?

ఈ ప్రశ్న ఎన్నో విషయాలను వెలికి తీస్తుంది. దీనిని సులభంగా చెప్పాలంటే, మనమేదైనా రూపాన్ని సృష్టిస్తే, దాని వెనుక మొత్తంగా ఒక గణిత వ్యవస్థ ఉంటుంది. ధ్యానలింగం సంపూర్ణంగా సౌర విధానంతో ఆలీనమై ఉంటుంది. మేము అందుకే ఎంతో విశ్వాసంతో అది 5 నుండి 10,000 సంవత్సరాలు జీవించి ఉంటుదని చెబుతాము.

ఎందుచేతనంటే సహజ విధానంతో ఆ శక్తి సంపూర్ణంగా ఆలీనమై ఉంటుంది. కానీ దేవీని అలా తయారు చేయలేదు, ఆమె కొంచెం భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉంటుంది అంటే, ఏదైతే సహజంగా ఉంటుందో ఆమె దానికి భిన్నం. ఆమె కావాలనే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె పనీ, ఆమె శక్తీ  వేరు.

సూర్యుడు ప్రతి రోజు సంపూర్ణంగా గుండ్రంగానే ఉంటాడు, కానీ చంద్రుడు కొత్త దశలలో ఉంటాడు, అందుకే  ప్రజలు ఎక్కువ గమనిస్తారు. ఆమె కూడా అలానే; ఆమె కూడా ఆమె సొంతంగా రెండున్నర (లేక) ఇరువయి ఏడున్నర రోజుల వృత్తంలో తిరుగుతూ ఉంటుంది.   ఆమె శక్తులు చిన్న వృత్తంలో ఉండటం చేత, ఆమె ఎక్కువగా పరిభ్రమిస్తుంది. ఇంకా ఆమె గుండ్రంగా ఉండే వారి(ధ్యానలింగం)తో పోల్చి చూస్తే తేలికగా అనుభవంలోకి రాగల శక్తిని సృష్టిస్తుంది. అందుకే, ఆమె సంధ్యా కాలాలు, బ్రహ్మ ముహూర్తం పాటించదు.  ఆమె సహజ శక్తులకు ఆలీనమై ఉండదు ఎందుకంటే ఒక స్త్రీ ఏదో ఒక విధంగా భిన్నంగా ఉండాలి అని కోరుకుంటుంది, మరి ఆమె స్పష్టంగా భిన్నం. అదే ఆకర్షణ, అందం.. ఇంకా చెప్పాలంటే అవకాశం  -  మీరు ఆమెపై శ్రద్ధ పెట్టకుండా ఉండలేరు. ఒక వేళ మీ జీవ శక్తులు ఆకర్షింపబడి ఆమెని స్పృశించగలిగితే,   మీరు ఎంతో పారవశ్యంలో మునిగిపొతారు. మీరు యధాలాపంగా ఆమెతో కూర్చుని ఉంటేనే, ఆమె మిమ్మల్ని ఆ దారిలో తీసుకు వెళుతుంది. ఎందువలన అంటే ఆమె శక్తులు అంత వెర్రిగా ఉంటాయి.

ధ్యానలింగం కంటే ఆమె ఎక్కువ ప్రసిద్ధి చెందుతుందేమో అని నేనెప్పుడు భయపడుతూ ఉంటాను.

ఆమె తీవ్రంగా , మొత్తం విశృంఖలoగా  ఉంటుంది. ఆమె కేవలం స్త్రీ కాదు - ఆమె స్త్రీ – స్త్రీ!  ధ్యానలింగం కంటే ఆమె ఎక్కువ ప్రసిద్ధి చెందుతుందేమో అని నేనెప్పుడు భయపడుతూ ఉంటాను. ఇప్పుడు  నా భయాలు  వ్యక్తమవుతున్నాయి. నేను ఎంతో మంది దేవీ లాకెట్టును  ధరించటం చూసాను, కానీ ఎవరి తల మీద ధ్యానలింగం ఉండటం నేను చూడలేదు. ఒక వేళ ఆమె మరీ  ఎక్కువగా ప్రసిద్ధి చెందితే, దేవీ ఆలయాన్ని మూడు నెలల పాటు మూసి ఉంచుతామేమో. కానీ ఒక వేళ మూసి మరలా తెరిస్తే, ఆమె ఇంకా ఎక్కువ ప్రసిద్ధి చెందుతుంది. ఎందుకంటే దేనినైనా మీరు నిషేదిస్తే అందరూ  దానినే చూడాలి అనుకుంటారు. అందుకని , నేను ఆమెను ఎలా నిర్వహిస్తానో తెలియదు, కానీ ఆమె చాలా ఘనంగా దివ్యంగా పనిచేస్తొంది.

నిజానికి, ఒక వేళ ఆలయాన్ని మనం రాత్రి తెరిచి ఉంచితే ఆమె అద్బుతంగా ప్రసిద్ధి చెందుతుంది, ఆమెకు రాత్రి కావాలి - రాత్రుల్లో ఆమె క్రియాశీలంగా ఉంటుంది. ఒక వేళ మీరు రాత్రుల్లో దేవీ ఆలయంలోకి ప్రవేశిస్తే, మీరు జీవానికి వేరొక కోణాన్ని చూస్తారు. కానీ మేము అలా చెయ్యదలుచుకోలేదు ఎందుకంటే భారత దేశంతో సహా అన్ని చోట్లా, సమాజాలు మిక్కిలి బిడియంగా ఉన్నాయి. వారు ఏదైతే తీవ్రంగా, విశృంఖలoగా ఉంటుందో దానికి వారు భయపడతారు. భారతదేశంలో ఇటువంటి దేవీని ఎప్పుడు పులి మీద స్వారి చేస్తునట్టు చిత్రీకరించేవారు. ఆమె తీవ్రతను సూచింపజేస్తూ - పులి కంటే ఎక్కువగా తీవ్రంగా ఉంటుందని సూచించడానికి అలా చిత్రీకరించేవారు. కానీ ప్రజలు వన్యప్రాణులు మంచివి కాదు అనుకుంటారు, వారికి లొంగి ఉండేవి కావాలి, వారు పులి కూడా ఆడుకోవటానికి అనువుగా ఉండాలి అనుకుంటారు. మనకి నాగరికత అంటే అది అందరిని వంచి ఉంచాలి. ప్రజలు తీక్షణతో ఉండే కొంతమందిని ఇష్టపడరు - నా లాగా, గడ్డంతో.

ఆమె కేవలం ఆడది కాదు - ఆమె ఒక స్త్రీ - స్త్రీ. 

ఆమె లొంగి ఉండేది కాదు. ఆమె తీవ్రం , మొత్తం భయంకరం. ఆమె కేవలం ఆడది కాదు - ఆమె ఒక స్త్రీ - స్త్రీ. మేము ఆశ్రమం ఇంత దూరంలో పెట్టటానికి కారణం ఏమిటి అంటే మాకు ఆటవిక తుమ్మెర కావాలే కానీ,  నగరంలోని సంస్థ కాదు.  మేము కొన్ని కంచలను ఏర్పరిచాము, కానీ ఒక వేళ ఒక ఏనుగుమంద ప్రవేశించదలిస్తే, అవి ఏ క్షణానైనా  యధాలాపంగా లోపలికి నడిచి రాగలదు. ఒక వేళ పులి, చిరుత లేక నాగుపాము లోపలికి రావాలి అనుకుంటే యధాలాపంగా రాగలవు. ఆధ్యాత్మిక ప్రక్రియ, అంచున జీవించడం - ఈ రెండూ నేరుగా మిళితం అయి ఉంటాయి. భవిష్యత్తులో చాలా మందికి దేవీ మొదటి మెట్టు అవుతుందని నేను నమ్ముతున్నాను. కొంతకాలం ఆ ఆటవికతత్వంలో వారు మునిగితేలుతారు. తరువాత ధ్యానలింగం యొక్క సౌష్ఠవంలోకి వస్తారు. పరిస్థితి ఆ విధంగా  తయారు అవుతుంది. ఎందువల్ల అంటే మీరు ఆమె యొక్క ఆటవికస్వభావాన్ని విస్మరించలేరు.

లింగ భైరవి నా శక్తీ వ్యవస్థలోని ఎడమభాగపు(ఈడా) వ్యక్తీకరణే.  దేవీ యొక్క ఆట నాకు ఓ అసాధారణ ప్రక్రియ, అలాగే ఓ గొప్ప అనుభవం. ఒకే సమయంలో తీవ్రంగా, అలాగే దయతో ఉండే ఆమె అద్భుతమైన మార్గాలు మీ అందరిని స్పృశిoచాలని కోరుకుంటున్నాను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు