శక్తినిచ్చే వేరుశనగ జావ
ఇది శక్తినిచ్చే - జ్యూస్ ఖాళీ కడుపుతో సేవిస్తే ఆకలి కాదు.
ArticleFeb 2, 2018
కావాల్సిన పదార్థాలు :
వేరుశనగ గింజలు - 1 గుప్పెడు
అరటిపండు - 1
ఖర్జూరం - 5 (చిన్న ముక్కలు)
తేనె - కొద్దిగా
జీడిపప్పు - కావలసినంత
కొబ్బరికోరు - 3 స్పూనులు
చేసే విధానం : - వేరుశనగ గింజలు అరగంట నానపెట్టుకోవాలి. నానినవి శుభ్రంగా కడగాలి. పైన చెప్పినవి అన్నీ మిక్సీలో వేసి నీరుపోసి వడగట్టి తాగాలి. అరటిపండు బదులు సపోటా, జామ, ఆపిల్, మామిడి పళ్ళు వాడవచ్చు. ఇది శక్తినిచ్చే - జ్యూస్ ఖాళీ కడుపుతో సేవిస్తే ఆకలి కాదు.