శరీరం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleFeb 16, 2017
శరీరం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు :
- శరీరం, ప్రాణాలతో సహా, మీకు ప్రియమైనది ఏదైనా కూడా, కాలం తీరినప్పుడు దానిని హుందాగా విడిచి వేయడం ఎలాగో మీరు తెలుసుకోవాలి.

- మీ శరీరంలోని ప్రతి కణం మీ శ్రేయస్సుకై పనిచేస్తోంది. మీరు మీ శరీర వ్యవస్థకి అనుగుణంగా ఉంటే, సహజంగానే ఆరోగ్యంగా ఉంటారు.

- ఈ శరీరం భూమాత నుండి తీసుకున్న ఋణం మాత్రమే. ఏదో ఒకరోజు ఈ ఋణాన్నిమీరు తిరిగి చెల్లించాలి.

- మీరు మీ గమ్యాన్ని అందుకోవాలనుకుంటే, ముందు మీ శరీరం, మనస్సులు మీ స్వాధీనంలో ఉండాలి.

- మీ శరీరం పిల్లగాలిలా తేలిపోవాలి. అప్పుడే మీరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్లు.

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.