మిమ్మల్ని అభివృద్ధి వైపుకు నడిపే 6 సూత్రాలు

ArticleSep 16, 2016
జీవిత వైభవాన్ని మనకు కావలసిన రీతిలో జరుపుకోవడానికి దోహదపడే 6 సూత్రాలను తెలుసుకుందాం.
- మీకు ఏమి ఎదురైనా, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు, దాని నుంచి మీరేమి నేర్చుకుంటారన్నది పూర్తిగా మీమీదే ఆధారపడింది.

- చూడడానికి మంచిగా కనిపించడం ముఖ్యం కాదు. జీవితం మీకొక గొప్ప అనుభవమా, కాదా? ఇదీ ముఖ్యం. విలువల్లో ఈ మార్పు తప్పక రావాలి.

- ఓ సంపూర్ణ మానవుడిగా ఉండటం అంటే, మీ జీవితంలోని ప్రతీ అంశాన్ని, ప్రతీ క్షణాన్ని పూర్తిగా జీవించడం

- మీలోని పరిస్థితులను మీరు పరమానందకరం చేసుకోగలిగితే, మీ ప్రాపంచిక వ్యవహారాలు మీ మీద ఒక్క చిన్నమచ్చను కూడా వేయలేవు.

- మీరు ఒకదాన్ని ఇష్టపడినా లేదా అస్యహించుకున్నా – రెండు విధాలా, మీరు వాస్తవాన్ని అతిశయం చేస్తున్నారు.

- బాహ్యం మీకు స్పూర్తిని, మార్గనిర్దేశతను ఇవ్వవచ్చు, కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడమనేది లోపలి నుంచే జరగాలి.
