పొట్లకాయ సలాడ్
పై కాయగూరల ముక్కలు మామిడి తురుము కలిపి ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి ఆ తర్వాత తాలిపు వేసి కొత్తిమీర చల్లి అందరికీ వడ్డించాలి.
కావాల్సిన పదార్థాలు :
పొట్లకాయ - 150 గ్రా. పైన గీసి, లోపల గింజలు తీసి, చిన్న ముక్కలు చేసుకోవాలి
టమేటాలు - 2 (గింజలు తీసి చిన్న ముక్కలు చేసుకోవాలి)
క్యాప్సికమ్ - అరకప్పు - గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
మామిడికాయ (చిన్నది) - కోరుకుని ఉంచుకోవాలి
ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం - తగినంత
కరివేపాకు, కొత్తిమీర - చిన్నగా చేసుకోవాలి
తాలింపు సామాను - ఆవాలు, మినపప్పు, జీలకర్ర శనగపప్పు, కరివేపాకు
చేసే విధానం :
పై కాయగూరల ముక్కలు మామిడి తురుము కలిపి ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి ఆ తర్వాత తాలిపు వేసి కొత్తిమీర చల్లి అందరికీ వడ్డించాలి.