కావాల్సిన పదార్థాలు:

కీరా       -          1 మీడియం సైజు

బంగాళాదుంప    -          1

ఉప్పు     -          తగినంత

పాలు     -          1 కప్పు

నెయ్యి    -          1-స్పూను

వైట్పెప్పర్‌  -  చిటికెడు

చేసే విధానం :

కీరా దోసకాయని సగం కోసి తొక్కతీసి పొడవుగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. మిగతా సగం దోసకాయ, బంగాళాదుంప తొక్కతీసి మిక్సీలో పేస్టు చేసి పెట్టుకోవాలి.

- బాణలిలో నెయ్యివేసి పొడవుగా కోసి పెట్టుకున్న ముక్కలని సిమ్లో వేయించు కోవాలి. తరువాత అందులో పాలు పోసి మూడు నిమిషాలు మరిగించాలి. తరువాత మిక్సీలోఉన్న పేస్టు తీసుకుని మూడు గ్లాసుల నీరు పోసి మరిగించాలి. ఆఖరున ఉప్పు, మిరియాల పొడివేసి కలిపి తాగాలి.