కాలీ ఫ్లవర్ సూప్
ఇది శక్తివంతమైనది. అలసిపోయినప్పుడు తాగితే వెంటనే శక్తినిస్తుంది.

ArticleJun 30, 2018
కావాల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్ - 75 గ్రాములు
బఠాణీ - 75 గ్రాములు
క్యాబేజీ - 75 గ్రాములు
పచ్చి టమేటాలు - 100 గ్రాములు
ఎండుమిర్చి - 2
వెన్న - 2 టీ-స్ఫూనులు
మిరియాల పొడి, ఉప్పు - తగినంత
చేసే విధానం :
- బాణలిలో వెన్న వేసి తరిగిన కూరగాయలు వేసి లేతగా వేయించాలి.
- నీరు పోసి కుక్కర్లో 1 విజిల్ రానివ్వాలి. చల్లార్చుకుని మిక్సీలో వేసి తిప్పాలి. మిరియాల పొడి, ఉప్పు కలిపితీసుకోవాలి.
- ఇది శక్తివంతమైనది. అలసిపోయినప్పుడు తాగితే వెంటనే శక్తినిస్తుంది.