అంతరంగానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleFeb 27, 2017
అంతరంగానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:
- నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనబరచే ప్రవర్తన కాదు. అది మీలో మీరు ఉండే విధానం.

- స్వర్గం, నరకం అనేవి భౌతికమైన ప్రదేశాలు కావు. వాటిని మీరు మీలోనే సృష్టించుకుంటారు.

- ప్రపంచంలో జరిగేది మీకు కావలసినట్లు జరగకపోతే, కనీసం మీలో జరిగేదైనా మీరు కోరుకున్నట్లు జరగాలి.

- మీలో మీరు ఉండే స్వభావాన్నిబట్టి మీరెవరు అనేది నిర్ణయింపబడాలిగాని, మీరు చేసే పనిని బట్టి కాదు.

- మన అంతరంగంలో సరైన వాతావరణం సృష్టించుకోగలిగితే – అంతర్గత శ్రేయస్సుతో బ్రహ్మానందంగా జీవించగల క్షమత మనందరికీ ఉంది.

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.