Shivanga Sadhana For Gents

శివాంగ సాధన గురించి
శివాంగ సాధన - సృష్టికి మూలమూ, అదే సమయంలో పరమోత్తమ సంభావ్యతా అయిన శివునికి మీరు ఒక భాగం అనే విషయాన్ని మీ ఎరుకలోకి తీసుకురావడం కోసం ఉద్దేశింపబడింది. - సద్గురు
seperator
 
About Shivanga Sadhana
 
శివాంగ సాధన, పురుషుల కొరకు శక్తిమంతమైన 42-రోజుల(సాధన కాలవ్యవధి) దీక్ష. సద్గురు అందిస్తున్న ఈ సాధన, ధ్యానలింగ శక్తులను స్వీకరించే సామర్థ్యాన్ని సాధకునిలో పెంచి, అతడు శరీరం, మనస్సు మరియు శక్తులను మరింత లోతుగా అన్వేషించే వీలుకల్పిస్తుంది.
అంతరంగంలోని భక్తిభావాన్ని బయటకు తీసుకువచ్చే ఒక అవకాశం. శివాంగ అంటే “శివుని యొక్క అంగం” అని అర్థం. శివాంగ సాధన సృష్టి మూలంతో మనకున్న అనుబంధాన్ని మన ఎరుకలోనికి తెచ్చేందుకు ఒక అవకాశం. పవిత్రమైన వెల్లెంగిరి పర్వతయాత్ర చేసేందుకు, ఇంకా శక్తిమంతమైన సాధన అయిన శివ నమస్కార దీక్ష తీసుకునేందుకు కూడా ఈ సాధన ఒక అవకాశం.
శివునిలో భాగమవ్వండి
 
Become a Limb of Shiva
 
 • ఒక శక్తివంతమైన 42-రోజుల దీక్ష
 • పవిత్రమైన “శివ నమస్కారం” దీక్ష స్వీకారం.
 • “దక్షిణ కైలాసం” గా పిలువబడే వెల్లెంగిరి పర్వతయాత్ర.
 • అంతరంగ అన్వేషణకు ఒక బలమైన భౌతిక, మానసిక పునాదిని నిర్మిస్తుంది.

 

వెల్లెంగిరి గురించి
 
About Velliangiri
 

“తెంకైలాయం” లేదా దక్షిణ కైలాసంగా పేర్గాంచిన వెల్లెంగిరి పర్వతాలు – ఆదియోగి అయిన శివుడు స్వయంగా కొంతకాలం గడిపిన ప్రదేశం. యుగ యుగాలుగా అనేక మంది సిద్ధులు, మునులు ఈ పర్వతాలలో నిక్షిప్తం చేసిన శక్తులు, కృప ఈనాటికీ గ్రహించేందుకు అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మాండమైన శక్తితో నిండిన వెల్లెంగిరి ఏడవ పర్వతానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు యాత్ర చేస్తారు.

 

 

తీర్థయాత్ర ఎందుకు?
 
Why Pilgrimage
 
సద్గురు: ప్రయాణానికీ, పర్యటనకూ, తీర్థయాత్రకూ గల తేడా ఏమిటి? అనేక కారణాల వల్ల ప్రజలు ఒకచోట నుండి మరొక చోటికి వెళతారు. కొంతమంది అన్వేషకులు సరికొత్త ప్రదేశాలలో తమ కాలు మోపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఏదో చేసి చూపాలనుకుంటారు. కొంతమంది ప్రతి దాన్నీ సందర్శించాలనుకుంటారు. కేవలం విహారం కోసం వెళ్ళే పర్యాటకులూ ఉంటారు. కేవలం పని, కుటుంబం నుండి తప్పించుకునేందుకు వెళ్ళే పర్యాటకులూ ఉంటారు. కానీ ఒక తీర్థయాత్రీకుడు వీటిలో దేనికోసమూ యాత్రచేయడు. తీర్థయాత్ర అంటే అదేదో జైత్రయాత్ర కాదు, అది శరణాగతి. మీకు మీరే స్వయంగా ప్రక్కకు తొలగే విధానం అది. మీలో ఆ నమ్రత గుణం లేనప్పుడు, అది మీలో తీసుకువచ్చే మార్గం. మీలోని పరిమితత్వాన్ని, నిర్బంధంతలనూ నాశనం చేసి అవధుల్లేని చైతన్య స్థితికి చేర్చే ఒక ప్రక్రియ.
మరింత చదవండి... (ప్రజలు తీర్థయాత్రలు ఎందుకు చేస్తారు?)
సాధన తేదీల వివరాలు
 
Sadhana Date
 
పురుషుల కొరకు, ఈ 42- రోజుల దీక్ష పౌర్ణమి రోజున ప్రారంభమై (మాస)శివరాత్రి రోజున ధ్యానలింగకు సమర్పణలు అయిన తరువాత, రమణీయమైన వెల్లెంగిరి పర్వత శిఖరాలకు యాత్రతో ముగుస్తుంది.

 

పురుషులకు సాధన నియమాలు:

 • సాధన పౌర్ణమి రోజున ప్రారంభమై 42 రోజుల అనంతరం శివరాత్రి రోజున ముగుస్తుంది.
 • శివాంగ సాధకులకు, శివ నమస్కార దీక్ష, దానికి అనుబంధమైన మంత్ర దీక్ష ఇవ్వబడుతుంది.
 • రోజుకు ఒకసారి సూర్యోదయానికి ముందు కానీ, సూర్యాస్తమయం తరువాత కానీ, ఖాళీ కడుపున భక్తితో 21-సార్లు శివ నమస్కారము చేయాలి.
 • శివాంగ సాధకులు మాస శివరాత్రి రోజున తప్పనిసరిగా కోయంబత్తూరులోని ధ్యానలింగం వద్ద ఉండాలి.
 • రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. సబ్బుకు బదులుగా హెర్బల్ స్నానం పొడిని వాడవచ్చు.
 • కనీసం 21 మంది నుండి భిక్షను స్వీకరించాలి.
 • దీక్షా కాలంలో పొగ త్రాగడం, మద్యపానం సేవించడం మరియు మాంసాహారం భుజించడం నిషేధం.
 • రోజులకు కేవలం రెండు సార్లే భోజనం చేయాలి. మొదటి భోజనం మధ్యాహ్నం 12 గంటల తరువాత చేయాలి.
 • సాధనా కాలంలో తెలుపు లేదా లేతరంగు వస్త్రాలను ధరించాలి.
 • మొదటిసారి దీక్ష తీసుకుంటున్న వారికి – రూ. 400/-
 • ఇదివరకు దీక్ష తీసుకున్న వారికి – రూ. 250/-
అక్కడకు ఎలా చేరుకోవాలి
 
How to Get There
 

ఈశా యోగా కేంద్రం, కోయంబత్తూరుకు పశ్చిమంగా 30 కిలోమీటర్ల(20 మైళ్లు) దూరంలోఉంది. కోయంబత్తూరు దక్షిణ భారతదేశంలోని ఒక ముఖ్యమైన పారిశ్రామిక నగరం. ఈ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. అన్ని ప్రముఖ విమానయాన సంస్థలు, చెన్నై, ఢిల్లీ , బొంబాయి మరియు బెంగళూరు, హైదరాబాదుల నుండి విమాన రాకపోకలు సాగిస్తున్నాయి. దేశంలోని అన్ని ముఖ్యనగరాలనుండి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూరు నుండి ఈశా యోగా కేంద్రానికి  బస్సు మరియు టాక్సీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి.

కోయంబత్తూరుకు నుండి యోగా కేంద్రానికి  సరాసరి లోకల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి:

బస్సుల సమయాలను చూడండి

టాక్సీలు అందుబాటులో ఉంటాయి. మీరు ఈశా యోగా కేంద్రానికి టాక్సీ బుక్ చేసుకోవాలంటే,

దయచేసి 094426 15436, 0422-2515430 or 0422-2515429 ఈ నంబర్ల ద్వారా మా ట్రావెల్ డెస్క్ ను సంప్రదించగలరు. రోజుకు 24 గంటలూ డెస్క్ పని చేస్తూ ఉంటుంది.

ఫోన్: +91 8300083111

ప్రయాణ సూచనలు: కోయంబత్తూరు నుండి ఉక్కడం మీదుగా పేరూర్/సిరువని రోడ్ తీసుకోవాలి. అలందురై దాటిన తరువాత ఇరుటుపల్లం జంక్షన్ వద్ద నుండి కుడివైపుకు ప్రయాణించాలి. జంక్షన్(ఇరుటుపల్లం) నుండి ఈశా యోగా కేంద్రం  మరో 8 కి.మీ, ఇదే మార్గంలో వచ్చే పూండి ఆలయానికి 2 కి.మీ ముందే వస్తుంది. అక్కడ నుండి ధ్యానలింగ ఆలయానికి చేరుకోటానికి అదే మార్గంలో ఉన్న సైన్ బోర్డుల ద్వారా సూచనలు కనుగొనవచ్చు.

 

మమ్మల్ని సంప్రదించండి
 
Contact us
 

Contact Details:

Email:  info@shivanga.org

Phone:  +91-83000 83111

Leave a Message

Testimonials