Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీరెవరన్న అంతఃపార్శ్వాన్ని మీరు అందుబాటులోకి తెచ్చుకోవాలన్నదే నా అభిమతం, దానికే నా ఆశీస్సులు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మీతోనే ఉంటుంది.
మీ కోరికలని తీర్చుకునే దిశగా కాకుండా, మీ సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా కృషి చేస్తే, మీరు ఈ జీవితాన్ని ఎంతో సునాయాసంగా, హుందాగా, చాలా బాగా కొనసాగించగలరు.
యోగా అన్నది స్వర్గానికి వెళ్ళడం గురించి కాదు. మీనుంచి మీరే ఓ స్వర్గాన్ని సృష్టించుకోవడం గురించి.
మీ గతమో లేదా భవిష్యత్తో మిమ్మల్ని బాధ పెట్టలేవు, ఎందుకంటే అవి ఉనికిలో లేవు. మీరు బాధ పడుతున్నది మీ జ్ఞాపకాలు ఇంకా ఊహాలతోనే.
మాతృత్వంలోని అందం పునరుత్పత్తిలో లేదు, చేర్చుకునేతత్వంలో ఉంది - మరో జీవిని మీలో ఒక అంతర్భాగంగా అనుభూతి చెందడంలో ఉంది.
మీ జీవితం ఏదో యాదృచ్ఛికంగానో, మరొకరి దయా, దాక్షిణ్యాల వల్లనో కాకుండా మీకున్న స్పష్టత, సామర్ధ్యాల వల్ల నడవాలన్నది నా ఆకాంక్ష.
ఓ సంపూర్ణ మానవుడిగా ఉండటం అంటే, మీ జీవితంలోని ప్రతీ అంశాన్ని, ప్రతీ క్షణాన్ని పూర్తిగా జీవించడం.
ధ్యానం అంటే శ్రద్ధ పెట్టడం కాదు, విశ్రాంతి తీసుకోవడమూ కాదు. ఇది ఒక విధంగా స్వస్థానానికి చేరుకోవడం లాంటిది.
మానవునిగా ఉండడం అంటే, మీరు చేసే ప్రతిదాని గురించి ఎరుక కలిగి ఉండే సామర్ధ్యంతో ఉండడం.
ఒకసారి మీకు ఇంకా మీ ఆలోచనా ప్రక్రియకు మధ్య కాస్త దూరం ఏర్పడితే, ఒక కొత్త స్వేచ్ఛ పుడుతుంది. ఈ స్వేచ్ఛతో, ఓ కొత్త అవగాహన ఉదయిస్తుంది.
జీవితాన్ని తెలుసుకోవడానికి మీకున్న ఏకైక ద్వారం మీరే. దాన్ని తెరిచి ఉంచండి.
మనిషి ఒక వనరు కాదు. మానవుడో బ్రహ్మాండమైన అవకాశం. సరైన పోషణతో, వారు అద్భుతమైన వారిగా వికసిస్తారు.