దివ్యత్వం నిర్గుణమైనది…

4628206613_bc4a183039_b

దివ్యత్వం అనేది ఎదో ఒక చోటులో కాదు, అది అందరిలో ఉంది అని, దానికి ఎటువంటి విచక్షణ ఉండదని సద్గురు చెబుతున్నారు.

శివుడు దీనికి ఎంతో గొప్ప ఉదాహరణ. శివుడు ఎంతో అందమైనవాడు. ఎంతో ఘోరమైనవాడు కూడా..! ఈయన ఒక గొప్ప గృహస్థు. అలాగే ఒక త్రాగుబోతు.. ఒక తాపసి.. మాదకద్రవ్యాలకు బానిస.. ఈయన ఒక్కడిలోనే అన్నీ..! ఇక్కడ మనం ఎం చెప్తున్నామంటే.. మీరు “దైవం” అంటున్న దానికి – విచక్షణ లేదు. మీరు దాని నుంచి ఏదైనా చేయవచ్చు. ఏదైతే సృష్టికి మూలమో అదే అన్నిటినీ తయారుచేస్తోంది. మీరు కూడా సృష్టిలో భాగమే కదా..! అంటే, ఎదైతే సృష్టికి మూలమో.. అది ఖచ్చితంగా మీలో కూడా ఉంది.

ఒకసారి ఇలా జరిగింది. కృష్ణుడు “దివ్యత్వం నీలో ఉంది” అని చెప్పినప్పుడు.. అర్జునుడు ఇలా ప్రశ్నించాడు.. నువ్వు అన్నింటిలోనూ దివ్యత్వం ఉంది అని అన్నావు..! అదే దివ్యత్వం దుర్యోధనుడిలో కూడా ఉంటుంది. అప్పుడు అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు..? నువ్వు, అతనిని సరి చెయ్యలేవా..?ఈ యుద్ధాన్ని ఆపలేవా..? మీరు.. “నేను అన్నింటిలోనూ ఉన్నాను.. నేనే అన్నీ” ..అని చెప్పినప్పుడు.. నీవు దుర్యోధనుడిలో కూడా ఉంటే.. అతని లోనికి కొంత ఇంగితాన్ని ఎందుకు తీసుకొని రావు..?! మనం ఈ యుద్ధాన్ని అరికట్టవచ్చు కదా..? – అని.  సరైన మాటే కదూ..?!!  దానికి కృష్ణుడు – దివ్యత్వం నిర్గుణమైనది. అని చెప్పాడు. అంటే దీనికి ఎటువంటి గుణమూ లేదు.

మీరు మీ నుంచి ఏ గందరగోళం సృష్టించుకున్నారో మీరు అదే రకమైన ప్రపంచంలో జీవిస్తారు.

దీనికి ఎటువంటి తత్వమూ లేదు. దీనికి ఎటువంటి విచక్షణా లేదు. మీకు దాని నుంచి ఏది కావాలంటే.. అది చేసుకోవచ్చు. ఇక్కడా.. అక్కడా.. అంతటా ఉన్నది ఒక్కటే..! మీరు దాని నుంచి ఏదైనా చేయవచ్చు. మీరు దీనిని ఒక కిరాతకుడిగానైనా మలచవచ్చు.. లేదా ఒక దివ్యమైనదానిగానైనా మలచవచ్చు. రెండూ కూడా.. మీలోనే ఉన్నాయి. మీరు గనుక కొంత ఎరుక కలిగి ఉంటే, ఖచ్చితంగా ఎదైతే ఉన్నతమైనదో దానినే మీరు చేస్తారు. మీకు గనుక ఈ ఎరుక లేకపోతే, మీరు దానిని ఒక గందరగోళంగా తయారు చేస్తారు. మీరు మీ నుంచి ఏ గందరగోళం సృష్టించుకున్నారో మీరు అదే రకమైన ప్రపంచంలో జీవిస్తారు. నేను ఇది సహజంగా చెప్తున్నాను. మనం ఎలాంటి గందరగోళాన్నైతే సృష్టించుకుంటామో అదే రకమైన సమాజంలో ఉంటాము. అదే రకమైన ప్రపంచంలో ఉంటాము. మనందరమూ కూడా ఒక ఉన్నత స్థాయి చైతన్యంలో ఉంటే, అందరం ఒక పూర్తిగా విభిన్నమైన సమాజంలో జీవించేవాళ్లం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
Davidlohr Bueso@flickr అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert