కరకరలాడే బీట్రూట్ సలాడ్

betroot

కావాల్సిన పదార్థాలు :

బీట్‌రూట్‌           –          1 కప్పు (పొడుగు ముక్కలు)

క్యాబేజి   –          1 కప్పు (పొడుగు ముక్కలు)

అప్పడాలు           –          వేయించినవి 2

నిమ్మరసం          –          2 టేబుల్‌ స్పూన్‌లు

పుదీనా   –          1/4 కప్పు – సన్నగా తరిగినది

ఉప్పు     –          తగినంత

ఆలివ్‌ ఆయిల్‌     –          1 టేబుల్‌ స్పూను

మిరియాల పొడి   –          1 టీస్పూను

చేసే విధానం :

–          క్యాబేజీని, బీట్‌రూట్‌ని (పైన తొక్కతీసి) పొడవుగా ముక్కలు చేయాలి. వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉంచి నీరు తీసి పక్కకి ఉంచుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం, పుదీనా, ఉప్పు, మిరియాలపొడి అన్నీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పాలి.

–          బీట్‌ రూట్‌, క్యాబేజి ముక్కలతో మిక్సీలో చేసిన పేస్టును కలిపి ఒక ప్లేట్‌ తీసుకుని కింద అప్పడం ముక్కలు వేసి పై మిశ్రమాన్ని పేర్చి వడ్డించాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *