ఈశాలో గురు పూర్ణిమ సంబరాలు..!


“జీవితపు అసలు లక్ష్యాన్ని, సంభావ్యతను మీ ఎరుకలోకి రావాలని  నా ఆకాంక్ష ! ఈ గురు పౌర్ణమి రోజు నా అనుగ్రహం మీపై ఉంటుంది.” –  సద్గురు

సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ఎదో తెలియని కారణం వలన మనం జ్ఞానం బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం, అందుకని ఇది ప్రభుత్వ సెలవు దినం కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం. మెల్లగా దేశ వ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఆశ్రమాలలో, అది సజీవంగా ఉంది, కానీ ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు.

ఇటువంటి పరిస్థితులలో, గురుపూర్ణిమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం, అలాగే గురుపూర్ణిమ వేడుకలకు పూర్వవైభవాన్ని తీసుకరావడం కోసం, ఈ నెల జూలై 19వ తేదీన ఈశా యోగా కేంద్రంలో గురుపూర్ణిమ వేడుకలు సద్గురు సమక్షంలో జరిగాయి. ఈ ఉత్సవంలోని కొన్ని దృశ్యాలు మీకోసం..
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert