శివుడి రూపాలను అర్ధం చేసుకుందాం - ఆదియోగి
భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటీ అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. వీటిలోకొన్నిరూపాల వెనుక ఉన్న అంతరార్ధాన్నిసద్గురు మనకి వివరించారు. ఆ రూపాలను గురించి మనం ఈ వారం ఈ సీరీస్ లో తెలుసుకుందాం....వీటితో పాటు సౌండ్స్ ఆఫ్ ఈశా వారి త్రిగుణ్ సిడి నుంచి మీకు ఓ స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం..విని ఆనందించగలరు..!!
ఆదియోగి - మొట్టమొదటి యోగి, మొట్టమొదటి గురువు
మన సంప్రదాయంలో శివుడ్ని ఒక దేవుడిగా పూజించరు.ఆయన ఆదియోగి అంటే మొట్టమొదటి యోగి,, ఆది గురువు అంటే మొట్టమొదటి గురువు.ఈయన నుంచే యోగ శాస్త్రం పుట్టింది. దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆ రోజు ఆది యోగి తన మొదటి ఏడుగురు శిష్యులైన సప్తఋషులకు ఈ శాస్త్రాన్ని నేర్పించటం మొదలు పెట్టాడు.
ఇది అన్ని మతాలు పుట్టక పూర్వమే జరిగింది. మానవత్వం మళ్ళీ అతుక్కోలేని విధంగా విడగొట్టటానికి మనుషులు వేర్వేరు మార్గాలను సృష్టించకముందే, మానవ చైతన్యాన్ని పెంచటానికి అవసరమైన, శక్తిమంతమైన సాధనాలను అర్ధం చేసుకుని, నేర్పించటం జరిగింది. అది నమ్మశక్యం కానంత అద్భుతం!, అంటే ఆ కాలం మనుషుల్లో ఇంతటి నాగరికత ఉందా! అని మీరనుకోవచ్చు. కానీ ఇది ఒక నాగరికత నుంచో, ఆలోచనా విధానం నుంచో వచ్చింది కాదు. ఇది ఆత్మ సాక్షాత్కారం నుండి ఉద్భవించిన ఓ సమర్పణ . ఇది స్వయానా ఆయన అభివ్యక్తీకరణే . ఆయనచెప్పిన దాంట్లో నేటికి కూడా మనం ఏ ఒక్కటీ మార్చలేం ఎందుకంటే ఆయన చెప్పగలిగిన విషయాలన్నీ కూడా ఎంతో అందంగా , తెలివైన విధంగా చెప్పారు. దాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ మీరో జీవితకాలం గడిపేయొచ్చు !
శివ షడక్షర స్తోత్రం
https://soundcloud.com/soundsofisha/shiva-shadakshara-stotram?in=soundsofisha/sets/trigun
ప్రేమాశీస్సులతో,
సద్గురు