సాధన – వాస్తవంలోకి ఒక మేల్కొలుపు…..!!

sadhana

ఆత్మాభివృద్ధి (self-development) గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆత్మని అభివృద్ధి చేయడం ఎలా సాధ్యం ? ఇప్పుడు మీరీ శరీరాన్ని అభివృద్ధి పరచవచ్చు, అలాగే మనసుని కూడా. అహాన్ని కూడా బాగా అభివృద్ధి చేయొచ్చు, సరే ఇదెలాగూ అందరూ చేస్తూనే ఉన్నారనుకోండి. కానీ ఆత్మనెలా అభివృద్ధి చేస్తారు? ఒకవేళ చేసారే అనుకోండి, దాన్నితీసి అవతల పారేయడం ఉత్తమం, ఎందుకంటే అదెలాగూ అసంపూర్ణమైనదే కదా! ఏదైతే అంతటా వ్యాపించి ఉందో, ఏదైతే అజరామరమైనదో, దాన్నింకా అభివృద్ధి పరచడం ఎలా సాధ్యమౌతుంది ?

మీరు ఆత్మ అనేదాన్ని పెంపొందించడం కానీ అభివృద్ధి పరచడం కానీ చేయలేరు. కావాలనుకుంటే మీరు మీ స్థలాలనీ, భూమినీ అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఆత్మాభివృద్ధి ఎలా చేసుకుంటారు ? ఒకవేళ అలా చేసుకున్నారే అనుకోండి మిగితా సామాన్లతోపాటు, దాన్ని కూడా సామాన్ల గదిలో పదిలెంగా దాచిపెట్టుకోవచ్చు .

సాధననేది ఓ కనువిప్పు ! అలారం గంటలాంటిది సాధన!  

అందుకే, నేను చేప్పేదేమిటంటే, సాధన అనేది ఏదో పెంపొందించుకోవడం కోసం చేసేది కాదు. మీలో దైవత్వాన్ని సృష్టించడం అంతకంటే కాదు. ఆత్మ సాక్షాత్కారం కోసం చేసేది అసలే కాదు. దైవత్వమనేది మీలో ఉండనే ఉంది. సాధన అనేది ఓ కనువిప్పు ! అలారం గంటలాంటిది. మనమొక స్థాయిలో ఉన్న వాస్తవానికి అతుక్కుపోయున్నాం. మరి మరొక స్థాయి వాస్తవంలోకి మేలుకోగలమా ? అది జరిగేపనా? అక్కడ జరగడానికేమీ లేదు, మీరేగనక ఈ జీవిలో/ఆత్మలో  పూర్తిగా లీనమైపోతే, పూర్తిగా మమేకమైపొతే, దీన్ని దాటి వెళ్ళగలరు. అలాగే మీరు అస్సలు ఏ మాత్రం లీనంకాకుండా, దూరంగా ఉన్నాకూడా ఆవలి తీరాన్ని చూస్తారు. ఉన్నవి ఈ రెండు మార్గాలే. 100% నిమ్మగ్నమైపోవడం లేదా పూర్తిగా దూరంగా ఉండటం.

ప్రేమాశిస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *