విజయ సాధన చిట్కాలు – 2/5

idea-inspiration

విజయం మీతో ఎప్పుడూ దోబూచులాడుతుందని మీరు అనుకుంటుంటే, బహుశా మీరు ఒక కొత్త పద్ధతిలో ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమయిందని అర్ధం. మీరు చేసేదేదైనా, దాంట్లో మీరు విజయం సాధించేందుకు సహాయపడే కొన్ని చిట్కాలను సద్గురుఒక సందర్భంలో  తెలియజేసారు.  వాటిలో రెండొవ దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


చిట్కా – 2 : వైఫల్యాలు స్థిరం అనుకోకండి!

success6

  ఒకసారి మీ ఆలోచనలు, భావోద్వేగాలు క్రమబద్ధమయితే, మీ శక్తులు, మీ శరీరం కూడా క్రమబద్ధమవుతాయి.

నిబద్ధత గల మనిషికి వైఫల్యం అనేదే లేదు. మీరు రోజులో 100 సార్లు పడిపోతే, అది మీరు 100 విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు  కావాలనుకున్న దాన్ని సృష్టించడానికి మీరు కనుక నిజంగా నిబద్ధులైతే, మీ మనసు క్రమబద్ధమవుతుంది. ఒకసారి మీ మనసు క్రమబద్ధమయితే, మీ భావోద్వేగాలు కూడా క్రమబద్ధమవుతాయి ఎందుకంటే మీ ఆలోచనల ప్రకారమే మీ అనుభూతులు ఉంటాయి. ఒకసారి మీ ఆలోచనలు, భావోద్వేగాలు క్రమబద్ధమయితే, మీ శక్తులు, మీ శరీరం కూడా క్రమబద్ధమవుతాయి. ఈ నాలుగు ఒకే దిశలో క్రమబద్ధమయినప్పుడు, కావలసింది సృష్టించగలిగే మీ సామర్ధ్యం అమోఘం అవుతుంది. ఇలాంటి క్రమబద్ధీకరణ జరిగినప్పుడు, అనేక విధాలుగా మీరే సృష్టికర్తగా అవుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert