ఈశా యోగ సెంటర్ – 2014 గురు పౌర్ణమి వేడుకల విశేషాలు!

adiyogi3

 

ఈశా యోగ సెంటర్లో గురు పౌర్ణమి వేడుకలుకు  చాలా ఘనంగా జరుపుబడ్డాయి. ఈ వేడుకలకి 15000మందికి పైగా హాజరయ్యారు.

దాదాపు 15 వేల సంవత్సారాల క్రితం, ఇదే పౌర్ణమి రోజున ఆదియోగి  శివుడు తనని తాను ఆది గురువుగా లేదా మొదటి గురువుగా రూపాంతరం చేసుకున్నారు. ఆయన ఈ రోజునే సప్త ఋషులకు యోగ శాస్త్రాల యొక్క ప్రసారణను మొదలు పెట్టి, కృషితో ఎవరైనా తమ పరిమితులను దాటగలగే అవకాశాన్నిమనకు అందించారు.

ఈ పవిత్రమైన రోజున సద్గురు ఆదియోగి ముఖాన్ని విగ్రహారూపంలో ఆవిష్కరించారు. ఈ దివ్య ముఖం అత్యున్నతమైన దానిని కోరుకోవటానికి ఒక ప్రేరణ. ఈ 21 అడుగుల విగ్రహం అమెరికాలోని ఈశా ఇన్‌స్ట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్‌కు వెళ్ళనుంది. 30 టన్నుల బరువున్న ఈ ఉక్కు విగ్రహం స్వయంగా సద్గురుచే రూపొందించబడింది.

ఈ విగ్రహాన్ని పూర్తి చేయటానికి 15 మందితో కూడిన ఈశా బృందానికి దగ్గర దగ్గరగా ఎనిమిది నెలలు పట్టింది. ఇదే బృందం ఆశ్రమంలోని నందిని రూపొందించింది. ఈ ప్రపంచానికి ఆది యోగి అందించన వాటికి ఈ విగ్రహం ఒక ప్రతీక.

జూలై 12న సాయంత్రం 6 గంటలకు మొదలైన వేడుకలు జూలై 13 ఉదయం 12.30వరకు జరిగాయి.

వేడుకలోని కార్యక్రమాలు ఇలా జరిగాయి:

10:00am నుంచి 6:00pm మరియు 7:45 నుంచి 10:00pm – గురు పాదుకా స్తోత్రం (బ్రహ్మచారులు మరియు రెసిడెంట్స్‌‌‌తో ఆశ్రమంలోని వివిధ చోట్ల). ఆశ్రమంలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఏడు పాదములలో వచ్చిన వారికి పవిత్ర రక్షలను అందించారు. వచ్చిన వారిలో చాలా మంది వివిధ పనులులో చాలా చురుకుగా వాలంటీర్ చేశారు.

6:00 to 7:00pm – ఆది యోగి విగ్రహ ఆవిష్కరణ (శ్రీ శంకర టీవీలో, వెబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం)

7:00 to 7:45pm – దేవి హారతి, నంది వద్ద

10:15pm to 12:30am – సద్గురుతో సత్సంగం (శ్రీ శంకర టీవీలో, వెబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం)

 
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *