కావేరిని రక్షించటానికి ఇప్పుడే స్పందించండి! http://CauveryCalling.org 80009 80009 విరాళం అందించడానికి క్లిక్ చేయండి: https://www.ishaoutreach.org/en/cauve... కావేరీ పిలుపు ఉద్యమం నూతన తరహా ఉద్యమం. దేశ జీవాధారలైన, భారతీయ నదులను ఎలా పునరుజ్జీవింప జేయవచ్చో అన్నదానికి ప్రమాణాలు నిర్ణయించేది. అది కావేరీ నదిని పునరుజ్జీవంప చేయడానికి శ్రీకారం చుట్టి, 8 కోట్ల 40 లక్షల మంది ప్రజల జీవితాలను మార్పు చేస్తుంది (మార్చి వేస్తుంది). కావేరీ పరీవాహక ప్రాంతంలో 242 కోట్ల పంట మొక్కలు నాటి, వ్యవసాయిక అడవుల సాగుకు మారే రైతులకు, కావేరీ కాలింగ్ సహాయం అందిస్తుంది. కావేరీ పరీవాహక ప్రాంతం ప్రపంచంలోనే అతి సారవంతమైన ప్రాంతాల్లో ఒకటి. కాని గత 70 ఏళ్లలో దానిలోని జల ప్రవాహం 40% కు పైగా పడిపోయింది. 2016 లో కావేరీ జన్మస్ధానంలో ఎండిపోయింది, వర్షపాతం 40-70% పడిపోయింది. అంతకు ముందు కొన్ని నెలల క్రితమే 2015 లో తమిళనాడు తీవ్రమైన వరదల పాలైంది. 500 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 20,000 నుంచి 160,000 కోట్ల రూపాయల మధ్య నష్టం జరిగిందని అంచనా. ఆ తరువాతి సంవత్సరం 2017 లో మళ్లీ తమిళనాడు గత 140 ఏళ్లలో లేనంత తీవ్రమైన కరవుకు గురైంది. కర్ణాటకలో ఆహార ఉత్పత్తిలో 36% లోటు చోటు చేసుకుంది. ఇలా దేశంలోని ప్రధాన నదులలో వరదలో, కరవో ఒకదాని తరువాత ఒకటి తరచుగా రావడం కనబడుతోంది. చేయవలసిన పనేదో, చేవలసిన సమయం ఆసన్నమైంది.
Subscribe