కావేరీ పరీవాహక ప్రాంతం ప్రపంచంలోనే అతి సారవంతమైన ప్రాంతాల్లో ఒకటి. కాని గత 70 ఏళ్లలో దానిలోని జల ప్రవాహం 40% కు పైగా పడిపోయింది. 2016 లో కావేరీ జన్మస్ధానంలో ఎండిపోయింది, వర్షపాతం 40-70% పడిపోయింది. అంతకు ముందు కొన్ని నెలల క్రితమే 2015 లో తమిళనాడు తీవ్రమైన వరదల పాలైంది. 500 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 20,000 నుంచి 160,000 కోట్ల రూపాయల మధ్య నష్టం జరిగిందని అంచనా. ఆ తరువాతి సంవత్సరం 2017 లో మళ్లీ తమిళనాడు గత 140 ఏళ్లలో లేనంత తీవ్రమైన కరవుకు గురైంది. కర్ణాటకలో ఆహార ఉత్పత్తిలో 36% లోటు చోటు చేసుకుంది. ఇలా దేశంలోని ప్రధాన నదులలో వరదలో, కరవో ఒకదాని తరువాత ఒకటి తరచుగా రావడం కనబడుతోంది. చేయవలసిన పనేదో, చేవలసిన సమయం ఆసన్నమైంది. #CauveryCalling
Subscribe